Showing posts with label రాజకీయాలు. Show all posts
Showing posts with label రాజకీయాలు. Show all posts

కడుపు మండమంటే మండదా?

'తెలంగాణా' ప్రత్యేక రాష్ట్రంగా చేయడానికి మేమంటే మేమని సంతకాలతో సహా ముందుకొచ్చారే? ఇప్పుడేమో ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తూ తమ తమ రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా 'సమైక్యాంధ్ర' జపం చేస్తున్న ఈ రాజకీయులను చూసి ఏ తెలంగాణా వాడి కడుపు మండదు.

ఒక 'లగడపాటి', ఒక 'కె.సి.ఆర్.' - వీరికి ఉన్న నిబద్ధత ముందు మిగతా రాజకీయులంతా బలాదూర్.గోడ మీద పిల్లి వాటం వలె 'బాబు',తెలంగాణా కు ఓకె అంటూ ఓట్లడుక్కొని ఇప్పుడు ఇలా చేయడం అన్యాయం అని ఒక్కరికీ అనిపించలేదా. తెరాసకు ఓట్లు రాలేదు సరే కానీ 'సమైక్యాంధ్ర' అని ఓట్లు అడుక్కొన్న ధీరుడొక్కడైనా ఉన్నాడా ఈ శిఖండుల్లో...చివరికి మా చిరంజీవి కూడా...ఎంత దుర్మార్గం.

అవన్నీ సరే కానీ మన తెలుగు బ్లాగు 'సమైక్యవాదుల'కు ఓ సూటి ప్రశ్న సంధించారు ఆనందిని'సంతోష్ కుమార్' గారు...
"ఇదేమిటి?...ఇగ్నోర్‌ చేయవద్దు.. జవాబు ఇవ్వండి"
http://kovela.blogspot.com/2009/12/blog-post_19.html
చదువరి గారిని, శరత్ గారిని, తాలబాసు గారిని, అబ్రకదబ్ర గారిని, వంశీ గారిని,సుజాత గారిని దీనికి సమాధానం ఇవ్వాలని నేను వినమ్రంగా అడుగుతున్నాను.

అమెరికా కొత్త అధ్యక్షుడు "బరాక్ హుస్సేన్ ఒబామా"!


నా జోస్యం నిజమైంది. 2007 జనవరిలో రాసిన ఈ టపా చదవండి. అమెరికాలోనే కాక ప్రపంచంలోనే సరికొత్త చరిత్రకు నాంది పలికాడు. "మార్పు" అన్న పదాన్ని తారక మంత్రంగా తీసుకొని సంచలనాత్మక విజయాన్ని సాధించాడు. నల్లజాతి తొలి అధ్యక్షుడిగానే కాక అమెరికాను, తద్వారా ప్రపంచాన్ని కొత్త దిశలో తీసుకెళ్లే బృహత్తర బాధ్యత ఇప్పుడు ఒబామా పైనుంది. "విశ్వమానవుడు" అన్న పదానికి పరిపూర్ణ ఉదాహరణ ఈ కెన్యా-కాన్సాస్ కుమారుడే! ఇదే "మార్పు" ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సమూల మార్పులను తీసుకురానుంది. అందరికన్నా ఈ విప్లవాత్మక విజయాన్ని అందించిన అమెరికా ప్రజానీకానికి నా మన:పూర్వక కృతజ్ఞతలు.
"ఎముకలు కుళ్లిన,వయస్సు మళ్లిన,సోమరులారా! చావండి!నెత్తురు మండే,శక్తులు నిండే,సైనికులారా! రారండి!"