'రావు గారి' టపాకు స్పందన ఈ టపా: 'హోమియో' పనిచేస్తుందా? అంటే చేస్తుంది, కొంతవరకు. అదీ దీర్ఘకాలిక రోగాలకు- immunological disorders from simple 'allergic rhinitis' and to more complex 'connective tissue disorders'. కానీ ఏ వైద్య విభాగమయినా చికిత్సలను కొన్ని శాస్త్రీయ పరిశోధనల ద్వారా బుజువు చేయాల్సి ఉంటుంది. అది చేయడానికి డబ్బు, అవసరం అది ఎవరిస్తారు? ప్రభుత్వమే అలాంటి ప్రయత్నాలకు చేయూతనిచ్చి హోమియో, ఆయుర్వేద వైద్య విధానాలను శాస్త్రీయ పరీక్షకు నిలబెట్టాలి. ఫలితం సకారాత్మకంగా ఉంటే ఎంతో మందికి స్వాంతన కలిగించిన వారవుతాం. ఏమో? మన ఆయుర్వేదంలోని మందుల్లో ఎయిడ్స్ కారక హెచ్.ఐ.వి. వైరసును నిరోధించే శక్తి ఉన్న పసరు ఉందేమో? పరీక్షిస్తే కదా తెలిసేది.అయితే Small Pox, Polio, Measles ఇలా చెప్పుకొంటూ పోతే ఎన్నో అంటువ్యాధి మహమ్మారులను దాదాపు నిర్మూలించే విధానం కనిపెట్టింది అల్లోపతి విధానంలోనే. ఒక్క పెన్సిలిన్ వలనే చావు నుంచి బయటపడ్డ ప్రాణాలు ఎన్నో కోట్లు ఉంటాయి ఈ వందేళ్లలోపు. అలాగే గుండెపోటు, హృద్రోగ సంబంధ వ్యాధులకు, కాన్సర్, ఆస్థ్మా లాంటి ఊపిరితిత్తుల వ్యాధుల చికిత్సలో అల్లోపతి చికిత్సకు సాటి అయిన వైద్యవిధానం మరోటి లేదు. Think : Aspirin, Statins, Beta blockers, Anti hypertensives, Streptomycin, Antiretrovirals, Antibiotics, Albuterol, Corticosteroids, Insulin, ICDs, Pacemakers...the list goes on and on.అయితే దాని పరిమితులు దానికీ ఉన్నాయి. 24 ఏళ్ల యువకుడిని 'Scleroderma & CTD' కు కోల్పోయాం, అన్ని ప్రయత్నాలు చేసినా కాపాడలేకపోయం. అలాగే ఇంకో పార్శ్వంలో నుంచీ చూస్తే ఓ 60 ఏళ్ల వృద్ధుడు, ఇప్పుడు 72 ఏళ్ల యువకుడు.
ఆ కథానాయకుడు, నిన్న నేను మాట్లాడిన నా పేషంట్ భర్త 'మిస్టర్ X'. ఆయన గుండె పనిచేయని (terminal cardiac failure) కారణంగా 8 నెలలు ఐ.సి.యులో చావుకు అతి దగ్గరగా గడిపాడు. ఒక కుటుంబం దురదృష్టవశాత్తూ(ఆయన అదృష్టవశాత్తూ???), 16 ఏళ్ల కుర్రాడు మొదటిసారి కారు నడుపుతూ ప్రమాదానికి గురయి మెడ దగ్గర వెన్నుపాముకి బలమైన దెబ్బ తగిలి కోమాలోకి వెళ్లిపోయాడు (vegetative state) అంటే brain dead అన్నమాట. కేవలం తన driving license మీద తన అవయవాలను దానం చేయడానికి అంగీకరించినందు వల్ల, వారి కుటుంబం ఒప్పుకోలుతో ఆ అబ్బాయి గుండెను మన X గారికి అమర్చారు. ఇప్పుడు ఆ 16 ఏళ్ల గుండె వయస్సు 28 ఏళ్లు. X గారు సంపూర్ణ ఆరోగ్యంతో ఎంతో చలాకీగా వ్యవసాయం చేస్తూ, తను పండించిన పంటలనే తింటూ ఆ అబ్బాయిని తన గుండెల్లో నిలుపుకుంటూ జీవిస్తున్నాడు గత పన్నెండేళ్లుగా!
ఇందులో మనకు ఆదర్శం: చావులో కూడా అమరుడయిన ఆ అబ్బాయి 'simple'' decent act. Organ donationకు అంగీకరిస్తూ మన డ్రైవింగ్ లైసెన్స్ మీదో, లేదా వీలునామా లోనో రాసుకుంటే ఎవరో ఒకరి కళ్లలోనో, గుండెలోనో మనం తిరిగి జీవిస్తాం. ఒకరి కాలేయంగానో, కిడ్నీగానో వారి శరీరంలోని విషపదార్థాల నుండి కాపాడే 'గరళకంఠుడు' అవుతాం. ఇంకో వ్యక్తి ఊపిరిత్తిత్తుల్లో ఊపిరులూదే 'దేవుడు' అవుతాం. ఇలా అధమపక్షం ఓ ఏడు మంది జీవితాలకు అమృతం పోసిన వారవుతాం. ఏడు జన్మలున్నాయో లేవో కానీ, మనల్ని పోలిన ఏడగురు వ్యక్తులు ఉన్నారో లేరో కానీ, మనం ఈ పృథ్విపై లేకపోయినా ఏడు జీవితాలతో మన జీవితాన్ని పెనవేసుకొని ఇంకో రకంగా బ్రతుకుతాం. నేనెప్పుడో ఈ పని చేసేశాను. ఇంకెందుకాలస్యం మీరూ ఇప్పుడే ఆ పనిలో ఉండండి. ఇది ఖచ్చితంగా 'పని' చేస్తుంది."ఆలస్యం అమృతం విషం"!
(చిత్ర సౌజన్యం: క్రియేటివ్ కామన్స్. వ్యాఖ్య టపా చేసినందుకు ధన్యవాదాలు 'రావు' గారూ!)