Showing posts with label చరిత్ర. Show all posts
Showing posts with label చరిత్ర. Show all posts

'తెలంగాణ'- చరిత్ర చెప్తున్న నగ్న సత్యాలు!

సీమ బిడ్డగా ' తెలంగాణ' పట్ల నా సంఘీభావాన్ని ప్రకటిస్తూ...
1
200

500


1030




1200



1540

1700

1860

1956


1750- ఎ ఫ్యాక్షన్ స్టోరీ! (అనంతపురం చరిత్ర)

ఈ పుస్తకాన్ని తెలుగులో గ్రంథస్తం చేసిన రచయితలెవరో తెలియదు, కానీ సి.పి.బ్రౌన్ గారి చొఱవతో ఇది ఆంగ్లీకరించబడి మనకు 1750-1851 వరకు అనంతపురం ప్రాంతంలోని చారిత్రక పరిస్థితులను పరిచయం చేస్తుంది. విజయనగర ప్రాభవం ఎంత వరకూ విస్తరించిందో, దాని పతనం తాలూకు ప్రభావం ఈనాటి వరకూ ఎలా కనిపిస్తుందో తెలుసుకోవడానికి ఈ గ్రంథపఠన ఆవశ్యనీయం. పాలెగాళ్లు, నవాబులు, మరాఠాలు, బ్రిటిషు దొరలు ఇలా చరిత్రలో ప్రతి పార్శ్వాన్ని మనం చూడగలుగుతాం. ఈనాటి ఫ్యాక్షన్`కు పునాదిరాళ్లు ఇలా పడ్డాయో తెలుసుకోవచ్చు. పదిమంది మంచి కోసం ప్రాణత్యాగం చేసిన "ముసలమ్మ మరణం"తో ప్రారంభమయ్యే ఈ నిజజీవిత కథలో ఎన్నో కుట్రలు, కుతంత్రాలు. చరిత్రలో ఎగసిపడ్డ కుటుంబాలెన్నో నామరూపాలు లేకుండా పోయిన వైనం చూస్తాము. ఇంతకూ "హండే అనంతపురం" అనే పేరు కలిగిన ఈ అనంతపురం చరిత్రలో మిగిలి ఉన్న "హండే" కుటుంబపు ఆనవాళ్లు మీకేమైనా తెలిస్తే చెప్పగలరు. హ్యాపీ రీడింగ్! (ఈ scribd పరిచయం చేసిన తాడేపల్లిగారికి కృతజ్ఞతలు-అలాగే ఈ పుస్తకాన్ని డిజిటైజ్ చేసిని గూగులమ్మ తల్లికి కూడా- పదాలు సరిగా కనపడనిచో పెద్దవిగా చేసి చదవగలరు)

Read this document on Scribd: The wars of the rajas being the history

పెనుకొండ కోటకు మహర్దశ!

ఎన్నాళ్ల నుంచో ఈ విషయమై బ్లాగులో రాద్దామనుకొని పని ఒత్తిడిలో రాయలేకపోయాను. ఆ మధ్య పెనుకొండ వెళ్లినప్పుడు అక్కడి రాయల వారి వేసవి విడిది గృహమైన 'గగనమహల్' దుస్థితి చూసి మనసు వికలమయ్యింది. ఊరి చుట్టూ ఉన్న కోటగోడనే కాక పురాతన జైనమందిరాలు, అణువణువునా చరిత్ర చిప్పిల్లే ఎన్నో కట్టడాలకు పుట్టినిల్లు మా పెనుకొండ. మన సంస్కృతి, వారసత్వాన్ని కాపాడుకొనే విషయంలో మనం చాలా వెనుకబడి ఉన్నాం. ఈ విషయమై వారం వారం ప్రజలతో మాట్లాడుతోన్న జిల్లా కలెక్టరు సముఖానికి ఈ సంగతి చేరవేసేంతలో ఈ వార్త. కనీసం ఇప్పుడైనా ఘనత వహించిన ప్రభుత్వం వారు మన ప్రాచీన సంపదను కాపాడి, రేపటి తరాల వారికి చరిత్ర మిగిల్చిన తీపిగుర్తులను ఆస్వాదించే భాగ్యం కలుగజేస్తారని ఆశిద్దాం!
(వార్త: 'ఈనాడు' అనంతపురం నుంచి.)