అమెరికా కొత్త అధ్యక్షుడు "బరాక్ హుస్సేన్ ఒబామా"!


నా జోస్యం నిజమైంది. 2007 జనవరిలో రాసిన ఈ టపా చదవండి. అమెరికాలోనే కాక ప్రపంచంలోనే సరికొత్త చరిత్రకు నాంది పలికాడు. "మార్పు" అన్న పదాన్ని తారక మంత్రంగా తీసుకొని సంచలనాత్మక విజయాన్ని సాధించాడు. నల్లజాతి తొలి అధ్యక్షుడిగానే కాక అమెరికాను, తద్వారా ప్రపంచాన్ని కొత్త దిశలో తీసుకెళ్లే బృహత్తర బాధ్యత ఇప్పుడు ఒబామా పైనుంది. "విశ్వమానవుడు" అన్న పదానికి పరిపూర్ణ ఉదాహరణ ఈ కెన్యా-కాన్సాస్ కుమారుడే! ఇదే "మార్పు" ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సమూల మార్పులను తీసుకురానుంది. అందరికన్నా ఈ విప్లవాత్మక విజయాన్ని అందించిన అమెరికా ప్రజానీకానికి నా మన:పూర్వక కృతజ్ఞతలు.
"ఎముకలు కుళ్లిన,వయస్సు మళ్లిన,సోమరులారా! చావండి!నెత్తురు మండే,శక్తులు నిండే,సైనికులారా! రారండి!"

3 comments:

రాజు సైకం said...

{ ఇదే "మార్పు" ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సమూల మార్పులను తీసుకురానుంది. } అర్ధం కాలేదే!

oremuna said...

రాజు,

అది అర్థం కావాలంటే మీరు రాయల వారి పాత టపాలు చదవాలి.

:)

Burri said...

ఒరెమూనా గారు బాగా చెప్పినారు, రాయలు వారు రాసిన 'వయస్సు మళ్లిన' పదముతో కొంచెం ఇరకటం ... ఏది ఏమైనా రాయలు వారి మాటలు ఇక్కడ కూడా నిజం కావాలి అని ఆశిస్తూ..

మరమరాలు