ఈ పుస్తకాన్ని తెలుగులో గ్రంథస్తం చేసిన రచయితలెవరో తెలియదు, కానీ సి.పి.బ్రౌన్ గారి చొఱవతో ఇది ఆంగ్లీకరించబడి మనకు 1750-1851 వరకు అనంతపురం ప్రాంతంలోని చారిత్రక పరిస్థితులను పరిచయం చేస్తుంది. విజయనగర ప్రాభవం ఎంత వరకూ విస్తరించిందో, దాని పతనం తాలూకు ప్రభావం ఈనాటి వరకూ ఎలా కనిపిస్తుందో తెలుసుకోవడానికి ఈ గ్రంథపఠన ఆవశ్యనీయం. పాలెగాళ్లు, నవాబులు, మరాఠాలు, బ్రిటిషు దొరలు ఇలా చరిత్రలో ప్రతి పార్శ్వాన్ని మనం చూడగలుగుతాం. ఈనాటి ఫ్యాక్షన్`కు పునాదిరాళ్లు ఇలా పడ్డాయో తెలుసుకోవచ్చు. పదిమంది మంచి కోసం ప్రాణత్యాగం చేసిన "ముసలమ్మ మరణం"తో ప్రారంభమయ్యే ఈ నిజజీవిత కథలో ఎన్నో కుట్రలు, కుతంత్రాలు. చరిత్రలో ఎగసిపడ్డ కుటుంబాలెన్నో నామరూపాలు లేకుండా పోయిన వైనం చూస్తాము. ఇంతకూ "హండే అనంతపురం" అనే పేరు కలిగిన ఈ అనంతపురం చరిత్రలో మిగిలి ఉన్న "హండే" కుటుంబపు ఆనవాళ్లు మీకేమైనా తెలిస్తే చెప్పగలరు. హ్యాపీ రీడింగ్! (ఈ scribd పరిచయం చేసిన తాడేపల్లిగారికి కృతజ్ఞతలు-అలాగే ఈ పుస్తకాన్ని డిజిటైజ్ చేసిని గూగులమ్మ తల్లికి కూడా- పదాలు సరిగా కనపడనిచో పెద్దవిగా చేసి చదవగలరు)
3 comments:
hello sir,
baagunnaraa!! meeru posting lo cherinanduku mundu gaa naa nenarlu.. bush gaaru nannu america raanichharu andi..nenu prastutam america lo vunnanu. Houston ane city nandu seda teerutunnanu. residency ki apply cheyadaniki mee salahaalu teesukovali anukuntunnanu. meeku ibbandi kalagadu anukunte me email id naa mail ku forward cheyaru..!! Plzz.. my email id : drtallapaneni@gmail.com, lagerahorams@gmail.com
mundastu nenarlu..
Dear sir:
I'm Afsar from University of Texas- Austin. Thanks a lot for this book. Actually, there is a new translation of this book in Telugu.
I'm working on Gugudu Muharram. I really appreciate if you share any info on the history of Anantapuram or Rayalaseema Muharram or Muslim saints.
my email is : afsar@mail.utexas.edu
afsar
రామ్స్...
సో హ్యూస్టన్̍కు ఇప్పుడు ప్రాబ్లం వచ్చిందన్న మాట:-) మీకు వేగు పంపుతున్నాను...బెస్టాఫ్ లక్!
అఫ్సర్ గారు,
నేను మీ కన్నా చాలా చిన్నవాణ్ని వయస్సులోనూ,మేధస్సులోనూ...
అంతలేసి పదాలు వాడకండి. మీ కవితలు
చాలా కాలం క్రితమే చదివాను. మీతో
పరిచయం నాకెంతో సంతోషాన్ని కలుగజేసింది.
నాకు తెలిసిన విషయాలను వీలు వెంబడి వేగు చేస్తాను.
Post a Comment