ఈద్-ముబారక్, దండయాత్ర , వీడ్కోలు!

తెలుగు బ్లాగర్లందరికీ 'రంజాన్' పండుగ సందర్భంగా ఈద్-ముబారక్! రంజాన్ పండుగ అనగానే ఆ ముందు రోజు ఎంతో ఉత్సాహంగా పెట్టుకొనే గోరింటాకు, పొద్దున లేవగానే తలంటు పోసుకొని వేసుకొనే కొత్త బట్టలు, బంధువులందరితో కలిసి మా హిందూపురం ఈద్గాకు వెళ్లి చేసే పండుగ నమాజు, దాని తరువాత ఏది కావాలంటే అది కొనిచ్చే అవ్వ-తాతలు, పక్కింటి వారికి అందించే క్యారియర్లు, బావలు-బామ్మర్దులు అందరితో కలిసి హుషారుగా వెళ్లే సినిమాలు, అలసిసొలసి ఇంటికొచ్చి మిద్దె పైకెక్కి వినే కథలూ...ఇవన్నీ ఒక్కసారిగా కళ్ల ముందు మెదలుతాయి.

మరి ఆ అనుభూతులకు సరితూగే విధంగా చేసుకోలేకపోయినా ఉన్నంతలో మొన్న అనంతపురం బాబా టైలర్స్ నుంచి కుట్టి పంపించిన కొత్త బట్టలు, ఇంట్లో చేసిన పాయసం, మా సుహాస్ తో కలిసి వెళ్లి చేసిన పండుగ నమాజు, న్యూయార్క్ నగరం నుంచి వచ్చిన మా అతిథులతో భోజనాలు+''హ్యాపీ డేస్" సినిమా ఇలా బాగానే గడిచింది. కాకపోతే బంధుమిత్రుల ఆలింగనాలను మాత్రం బాగా మిస్సయ్యాను, అంతే కాక పైలోకాన ఉన్న మా తాతలిద్దరినీ ఇంకా చాలా మిస్సయ్యాను. మొత్తానికి పండుగంతా ముగించేసి స్వదేశంలో ఈ రోజు పండుగ జరుపుకుంటున్న బంధుమిత్రులందరికీ కాల్ చేసి శుభాకాంక్షలు తెలుపుతూ అంత ముఖ్యమూ అయిన బ్లాగ్మిత్రులతోనూ ఈ విధంగా నా ఆనందాన్ని పంచుకొంటున్నాను.

ఇక బ్లాగులకు ఓ రెండు నెలల పాటు వీడ్కోలు చెప్పుదామని నిశ్చయించాను. మరో సంవత్సరం, మరో యుద్ధం, సన్నద్ధమవ్వాలిగా అందుకు. పోయినేడాది విజయం చేజారిపోయినా మరోసారి చేసే ప్రయత్నంలో ఈ కాస్త విరామం తప్పడంలేదు. కాబట్టి ఇలా సాహితీగోష్టులకు, చర్చావేదికలకు కొంత కాలం పాటు దూరం ఉంటూ ఆ రాయలు
సీ.తొల దొల్త నుదయాద్రి శిలఁదాకి తీండ్రించు
యసి లోహమున వెచ్చనై జనించె;
మఱి కొండవీడెక్కి మార్కొని నలియైన
యల కసవాపాత్రునంటి రాఁజె
నట సాఁగి జమ్మిలోయఁబడి వేగిదహించెఁ
గోన బిట్టేర్చెఁ గొట్టానఁ దగిలెఁ
గనకగిరి స్ఫూర్తిఁ గరచె; గౌతమిఁగ్రాచె;
నవుల నాపొట్నూర రవులు కొనియె;

తే.మాడెములు వ్రేల్చె; నొడ్డాది మసి యొనర్చెఁ
గటకపురిఁ గాల్చె గజరాజు గలఁగి పఱనఁ
దోఁక చిచ్చన; నౌర నీ దురవగాహ
ఖేలదుగ్ర ప్రతాపాగ్ని కృష్ణరాయ!"
{ఆముక్తమాల్యద 1:36}
చేసిన దండయాత్ర లాగా నా ఈ దండయాత్ర న్యూజెర్సీ, న్యూయార్క్ల మీదుగా ఓహయో, పశ్చిమ వర్జీనియాలపై వెళుతూ, లూయీసియానా దగ్గర ఆగుతుంది. గెలుపెక్కడో మరి? ఈ ప్రయాణాల్లో మన బ్లాగర్లనీ కలవవచ్చేమో పోయినసారి కలిసినట్టుగా. అలాగే విజయదశమి శుభాకాంక్షలు ముందుగానే అందుకోండి. అంత వరకు టాటా...వీడుకోలు...ఇంక సెలవు!

16 comments:

Unknown said...

మీ దండయాత్రకు జయము గాక

జ్యోతి said...

ఈద్ ముబారక్,,

ఈ సారి మీ దండయాత్ర దిగ్విజయంగా సాగాలని మనసారా కోరుకుంటూ.

విహారి(KBL) said...

ఈద్-ముబారక్ sir.

Aruna said...

All the best and ed mubarak.
ఎప్పుడూ మీ బ్లాగు కు వస్తాను కాని కామెంట్లు రాయాలి అంటే బద్దకం.[:)]

కొత్త పాళీ said...

టోపీ షేర్వాణీలో సుహాస్ పిచ్చ క్యూట్‌గా ఉన్నాడు.
మీ అంత కాకపోయినా హైదరాబాదులో రంజాన్ వాతావరణాన్ని నేనూ మిస్సయ్యాను.
ఇంక .. ఒక సినిమాని బ్లాహ్దృష్టితో చూడ్డం ఇదే మొదలు అనుకుంటా .. మీరు దీన్నొక మహాటపాలో భాగంగా వెయ్యడం ఏమీ బాలేదు .. కాస్త శ్రమ చేసుకుని విడి టపాగా ముద్రించండి.
మీ దండయాత్రకి ..విజయోస్తు

teresa said...

బ్రహ్మాండమైన రెసిడెన్సీ ప్రొగ్రాంస్ ఉన్న మా మిషిగన్ ని ఎందుకోదిలేశారూ? Best of luck and
Id mubArak.

Unknown said...

మీకు రంజాన్ శుభాకాంక్షలు...
ఈ సారి తప్పకుండా మీ దండయాత్ర లో విజయం సాధిస్తారు. విజయోస్తు.

హాపీ డేస్ అహెడ్ :)

Dr.Pen said...

అశ్విన్,ప్రవీణ్,విహారి.కె,జ్యోతక్క,అరుణ గారూ...మీ శుభాకాంక్షలకు,శుభాశీస్సులకు ధన్యవాదాలు. థెరెసాగారూ... అక్కడికీ దరఖాస్తు పంపడం జరిగింది.
అప్పాజీ! మీ ఆదేశం శిరసావహించాం:)

cbrao said...

మీకు రంజాన్ శుభాకాంషలు.సాహితీవనం -5 ప్రశ్నలకు ఉత్తమ సమాధానాలిచ్చినందుకు అభినందనలు. ఉత్తమ సమాధానాలిచ్చిన మీకు దీప్తిధార వీరతాడు వేస్తున్నది. హై!హై! నాయకా.మీకు రసమయి మాసపత్రిక సంచిక, దీప్తిధార అభినందనలతో అందగలదు.మీ చిరునామా,ఫోన్ నంబర్ వివరాలు నాకు పంపగలరు.

cbraoin at gmail.com
http://deeptidhaara.blogspot.com/

Anonymous said...

డాక్టర్ సాబ్,
ఈద్-ముబారక్. మీ దండయాత్రకి ..విజయోస్తు.

గిరి Giri said...

ఈద్ ముబారక్..మీ ప్రయత్నాలు సఫలించాలని ఆకాంక్షిస్తు...గిరి

Anonymous said...

ఈద్ ముబరాక్.

విజయీభవ. ఈ సారి "పెళ్ళి పెటాకులయ్యింది" అనకుండా "పట్టాభిషేకం అంగరంగ వైభవం" అని హెడ్డింగ్ పెట్టాలి.

-- విహారి

Anonymous said...

బ్లాగ్లోకం రాయలు వారు లేకుండా రెండు నెలలు గడపాలన్నమాట! ఏం చేద్దాం మీరు డిసైడ్ చేసాక తపుతుందా! సరే కానివ్వండి, 2008 లో దుమ్ము దులిపేద్దాం.

Unknown said...

అట్టా ఇట్టా కాదు.. ఇది కళింగ దండయాత్ర. విజయోస్తు! ఈద్ ముబారక్

Naga said...

ఈద్ ముబారక్, All the best.

oremuna said...

జయము జయము కృష్ణా! నందనందనా! నీకు జయము జయము.