రెండు నెలల విరామమంటూ ప్రకటించుకొన్నాక, ఇప్పటివరకు నా బ్లాగు దరిదాపులకి రాలేదు. ఎన్నో సంగతులు చెప్పాల్సినవి ఉన్నా చాలా నిగ్రహం పాటిస్తూ వచ్చాను. కానీ ఈ రోజు 'రైతు గర్జన' అంటూ ఆంధ్ర ప్రజలను మభ్యపెడుతున్న మన బాబు గారి ఆగ్రహాన్ని చూసి ఈ ఒక్కసారికీ నిగ్రహాన్ని చూపలేకపోయాను. మితృలతో రాజకీయాలు, మతం మాట్లాడకూడదని ఓ నానుడి. అది బ్లాగుపరంగాను నిజమని తెలిసింది. ఇకపై అలా మాట్లాడకూడదని నిర్ణయం తీసుకొన్నాక కూడా, ఈ రాజకీయ టపా ఎందుకంటే కడుపు మంట ఆపుకోలేక!
నా మూడేళ్ల ప్రభుత్వోద్యోగంలో '03 దాకా అనంతపురం జిల్లా అంతటా ఏ మూలకెళ్లినా రైతుల ఆత్మహత్యలే. కాపాడగలిగిన వారిని కాపాడినా ఎందుకు బతికించారు సారూ? అన్న వారి ప్రశ్నలే నాకు జవాబులు. ఇక రాలిపోయిన వారెంత మందో? ఆనాడు ఇదే రైతుల చావుల గురించి ప్రశ్నిస్తే, ఘనత వహించిన ఈ మా.ము.మం. బాబు గారు ఎక్స్-గ్రేషియాగా ఇచ్చే లక్షకో, పాతికకో ఆశపడి ఆత్మహత్య చేసుకొంటున్నారని ఈసడించారు. తను మొదలుపెట్టానని గర్వంగా చెప్పుకొంటున్న సరళీకరణ మంత్రాలకు, ఆనాడు మానవతా పార్శ్వం కనిపించలేదు కాబోలు.
నా మూడేళ్ల ప్రభుత్వోద్యోగంలో '03 దాకా అనంతపురం జిల్లా అంతటా ఏ మూలకెళ్లినా రైతుల ఆత్మహత్యలే. కాపాడగలిగిన వారిని కాపాడినా ఎందుకు బతికించారు సారూ? అన్న వారి ప్రశ్నలే నాకు జవాబులు. ఇక రాలిపోయిన వారెంత మందో? ఆనాడు ఇదే రైతుల చావుల గురించి ప్రశ్నిస్తే, ఘనత వహించిన ఈ మా.ము.మం. బాబు గారు ఎక్స్-గ్రేషియాగా ఇచ్చే లక్షకో, పాతికకో ఆశపడి ఆత్మహత్య చేసుకొంటున్నారని ఈసడించారు. తను మొదలుపెట్టానని గర్వంగా చెప్పుకొంటున్న సరళీకరణ మంత్రాలకు, ఆనాడు మానవతా పార్శ్వం కనిపించలేదు కాబోలు.
ఈనాడు నిర్లజ్జగా చెర్నాకోలు పట్టి, ఎద్దుల బండినెక్కి, దుక్కి దున్నేవానిలా నాగలి భుజాన పెట్టి తన కంటే పెద్ద రైతు బాంధవుడు లేనేలేడని ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నాడు. రికార్డు బద్దలుకొట్టిన తన తొమ్మిదేళ్ల పరిపాలనలో వినిపించలేదా ఈ రైతు గోడు. ఆనాటి వారి ఆక్రందనలే శాపాలుగా మారి తన పదవికి ఎసరొచ్చే దాకా ప్రజల ఘోష ఆయన మెత్తటి మనసుకు వినిపించలేదా? చుట్టుపక్కల ఉన్నవాళ్లు, అయ్యేయస్సులు, తోటి నాయకులు చెప్పినా తలకెక్కని విషయం ఇప్పుడు కావలసి వచ్చింది, రాజకీయ లబ్ధికి కాకపోతే, ఆయన గుండెల మీద చేయి వేసుకొని ఈ ఒక్కసారికైనా నిజం చెప్పమనండి. కనీసం చేసిన తప్పును ఒప్పుకొని తెలుగు రైతాంగాన్ని క్షమాపణ అడిగితే కాస్తయినా పాప పరిహారం దక్కుతుంది.
ఇదంతా చదివి నేను కాంగిరేసు పంకానని అపోహ పడేరు, తె.దే.పా ఆవిర్భవించిన రోజుల్లో ఇంటి ముందు టెంటు, చొక్కాకు ఎన్టీవోడి బొమ్మా, చేతిలో పసుపు జెండా పట్టుకొని మూడు-నాలుగు తరగతులలో నుంచే రాజకీయ చైతన్యం పొందినవాడిని. 'చేయెత్తి జై కొట్టు తెలుగోడా...గతమెంతో ఘనకీర్తి కలవోడా' అంటూ చెవులు గింగురుమనేలా రికార్డులు వేసినవాడిని. (ఆ ప్రభావమే నా బ్లాగు మకుటంలో కూడా కనిపిస్తుంది) అసలు మా నియోజక వర్గం శాసనసభ్యుడు మన 'అన్నగారు'. ఆయన ఏ విషయాలలో ఏమి చేసినా, ఆకలిగొన్న వాడికి కూడు - రెండు రూ. కిలో బియ్యం, గుడ్డ - జనతా వస్త్రాలు , నీడ ఇచ్చి ఆదుకొన్న మనిషి. పేదవారి పట్ల, రైతుల పట్ల అభిమానము, నిజాయితీ, వారి బాగోగుల కోసం ఏమైనా చేయాలని తాపత్రయం పడ్డ మనిషి.
ఇదంతా చదివి నేను కాంగిరేసు పంకానని అపోహ పడేరు, తె.దే.పా ఆవిర్భవించిన రోజుల్లో ఇంటి ముందు టెంటు, చొక్కాకు ఎన్టీవోడి బొమ్మా, చేతిలో పసుపు జెండా పట్టుకొని మూడు-నాలుగు తరగతులలో నుంచే రాజకీయ చైతన్యం పొందినవాడిని. 'చేయెత్తి జై కొట్టు తెలుగోడా...గతమెంతో ఘనకీర్తి కలవోడా' అంటూ చెవులు గింగురుమనేలా రికార్డులు వేసినవాడిని. (ఆ ప్రభావమే నా బ్లాగు మకుటంలో కూడా కనిపిస్తుంది) అసలు మా నియోజక వర్గం శాసనసభ్యుడు మన 'అన్నగారు'. ఆయన ఏ విషయాలలో ఏమి చేసినా, ఆకలిగొన్న వాడికి కూడు - రెండు రూ. కిలో బియ్యం, గుడ్డ - జనతా వస్త్రాలు , నీడ ఇచ్చి ఆదుకొన్న మనిషి. పేదవారి పట్ల, రైతుల పట్ల అభిమానము, నిజాయితీ, వారి బాగోగుల కోసం ఏమైనా చేయాలని తాపత్రయం పడ్డ మనిషి.
అలాంటి ఆయన్ని కారణాలేమైనా, నట్టేట ముంచి, వెన్నుపోటుతో రాజ్యాధికారం చేబట్టి, ఈనాడు నిస్సిగ్గుగా ఆయన పేరు జపిస్తూ, ఆయన బొమ్మలను వాడుకొంటూ, తెలుగింటి ఆడపడుచులకు... (గుర్రాలతో తొక్కించి, నీళ్లను కుమ్మరించినప్పుడేమైందో ఈ ఆడపడుచుల పై ప్రేమ!) అంటూ నక్క వినయాలు నటిస్తే, ఓట్లు కుమ్మరిస్తారని అనుకొంటున్నాడు కాబోలు. వచ్చిన జనాన్ని చూసి వాపుని బలుపుగా భ్రమపడితే మరోసారి భంగపాటు తప్పదు. అవినీతి రాజ్యమేలుతున్న ప్రభుత్వ వ్యతిరేకతే ఇదంతా, మన మహాజనానికి ఒక కొఱివి పోతే, ఇంకో కొఱివి తప్ప నిజంగా కాపాడే నాథుడేడీ?
{చిత్ర సౌజన్యం: 1.ది హిందూ - కార్టూనిస్ట్: కేశవ్, 2.ఈనాడు}
{చిత్ర సౌజన్యం: 1.ది హిందూ - కార్టూనిస్ట్: కేశవ్, 2.ఈనాడు}
17 comments:
ఇదంతా ఎలక్షన్ల కోసమే...క్రితం లాప్‍ట్యాప్ పట్టుకుని వచ్చాడు. ఇప్పుడూ ట్రాక్టరు ఎక్కి వస్తున్నాడు. జనాలను ఎదవలను చేస్తున్నాడు. అంతే...
మొత్తం మీద ఇస్మాఇల్ returns హ హ
అనుంతపురంలో ఘోరాలు చూసిన మీ అనుభవాల అభిప్రాయాలు కదిలించాయి.
తెలుగోడి పరిస్థితి నుయ్యకీ గొయ్యకీ మధ్యలో వుందండి.
కానీ రైతు బిడ్డగా ఒక్క మాట, బాబు వున్నా లేకున్నా వ్యవసాయం రోజురోజుకూ దశాబ్దానికీ దశాబ్దానికీ ఇంకా ఇంకా కష్టమవుతూపోతుంది. ప్రపంచీకరణ కాలంలో చిన్న చిన్న రైతుల వ్యవసాయం లో రాగల ఆదాయానికి, అందులో వున్న రిస్కు చాలా చాలా ఎక్కువ. దానికి బదులు ఐటిని ఒక ఆశ్రయంగా తెచ్చినందుకు అభినందించాలి.
Bravo, Ismail bhaay.
జ్యోతక్క...మీరన్నదే నిజం.
బూ.అ...రాక తప్పలేదు.
రాకేశ్వరా...నేను రైతు బిడ్డ కాకపోయినా, వారి బాధలను ప్రత్యక్షంగా చూసిన వాడిని. నేటికీ సెన్సెక్సు ఎగబాకిపోతోంది, భారతదేశమే కాబోయే అగ్రరాజ్యం అంటూ రంకెలు వేయడం తప్ప పల్లెల్లో సామాన్య ప్రజానీకం జీవన విలువలు ఎంత పెరిగాయి?
మరి ఆ ఐ.టి. ఫలాలకు ఆ ప్రపంచీకరణే కారణం కాదా? బాబు గారు కాస్త దారి చూపించారంతే, ఆయన లేకున్నా ఐ.టి.రహదారి బాగానే వృద్ధి చెందుతోంది కదా! ఓ ప్రభుత్వాధినేతగా తన పాలనలోని అందరికీ ఆయన జవాబుదారీ కాదా? వర్షాలు పడలేదన్నదీ నిజం, ప్రపంచీకరణ కారణంగా రైతుల జీవితాలు చిధ్రమైందీ నిజం. కానీ అలాంటప్పుడే మీకు ప్రభుత్వ ఆసరా ఉందంటూ భరోసా కలిగించటమే కాకుండా వారికి వెన్నుదన్నుగా నిలిచేది పోయి, విసుగు, ఛీత్కారం చూపించాడు. అది తప్పంటున్నాను నేను. నేటి రాజశేఖరుడు ఆ గూటి పక్షే!
ఐదు వందల సంవత్సరాల క్రితం చెఱువులు తవ్వించిన రాయల కున్నంత ప్రాప్తకాలజ్ఞత లేకపోయినా కనీసం వారి పట్ల దయ అయినా చూపొద్దా? ఇప్పుడు ఈ కల్లబొల్లి మాటలు వింటూంటే...రక్తం మరగదా?
మీకిష్టమైన కందంలోనే ఆ రాయల వారేమన్నారో తెలుసా-
కం. ఏపట్టున విసువక ర
క్షాపరుఁడవు గమ్ము ప్రజలచక్కి; విపన్ను
ల్గూ పెట్టిన విని తీర్పుము
కాపురుషుల మీద నిడకు కార్యభరం బుల్.
తా. ఏ సమయంలోనైనా ప్రజలను విసుగుకోక కాపాడాలి. ఆపదలలో మునిగినవారు మొఱపెడితే విని తీర్చాలి. కార్యభారం చెడ్డవారిమీద పెట్టకూడదు.
(ఆముక్తమాల్యద 4-207)
ఇంకా...
తే. దేశవైశాల్య మర్థ సిద్దికిని మూల,
మిల యెకింతైన,గుంటకాల్వలు రచించి,
నయము పేదకు,నరిఁగోరునను,నొసంగి,
ప్రబల జేసిన నర్ధధర్మములు పెరుఁగు.
తా. రాష్ట్ర విస్తృతి అర్థానికి మూలం. ఒకవేళ రాజ్యం చిన్నదైతే చెఱువులూ, కాల్వలూ త్రవ్వించి, పేదరైతుకు పన్నులభారం తగ్గిస్తే ధర్మానికి ధర్మం- అర్థానికి అర్థం లభిస్తాయి. (4-236)
కొ.పా. గారు...ధన్యోస్మి!
మొదట ఒక భావన/ఆశయం చుట్టూ (తేదేపా కేసులో తెలుగు ఆత్మగౌరవం) జనాన్ని పోగేసి పార్టీ స్థాపిస్తారు. ఆ తర్వాత ఆశయం కంటే మనుషులే (పార్టీ..అధికారం) గొప్పవైపోతాయి. అప్పుడు ఆశయం కనుమరుగైపోతుంది. అదియే పార్టీల పరిణామం.
గాంధీ స్వాతంత్ర్యసాధన తర్వాత కాంగ్రేసు పార్టీని dissolve చెయ్యమన్నది అందుకే. ఆశయం మరచిపోయినప్పుడు పార్టీలను జీర్ణం చెయ్యటం చాలామంచి పరిణామం. అందుకే లోక్ సత్తా, చిరంజీవి పెట్టబొయ్యే కొత్తపార్టీల్లాంటివాటిని ప్రోత్సహించాలి.
knowledge economyలో వ్యవసాయం మీద ఆధారపడే వారి సంఖ్య తగ్గాలి. తగ్గుతుంది. దాన్ని ఎవరూ ఆపలేరు. రైతులు ఇప్పుడే మేల్కొంటే మంచిది. ప్రత్యక్షంగా ఆత్యహత్య కేసులు చూసిన మీకు బాధగానే ఉండవచ్చు కానీ మార్పు ఆపలేనిది. మారనివాళ్ళ సంగతి చెప్పక్కర్లేదు. ఉష్ట్రపక్షిలాగా ఇసుకలో తలపెట్టి అంతా సవ్యమే అనుకుంటే దానికి ప్రభుత్వమే కాదు. ఆ దేవుడు కూడా ఏమీ చెయ్యలేడు.
అదే బాబు రాజకీయం, ఆనాడు చేసినంత చేసి తరువాత వాళ్ళ బొమ్మను (అన్న, రైతు, రేపు ఎవరో..) 'ఈనాడు' చూపి గద్దె ఎక్కగల అసలుసిసలు రాజకీయ నాయకుడు.
-మరమరాలు
చాలా ఆసక్తికరమైన చర్చ. నా రెండు పైసలు కూడ జత చేస్తే వొక పనైపోతుంది :-)
దేశానికైనా, రాష్ట్రానికైనా, అభివృద్ధి అనేది అన్ని రంగాలలో ఉండాలి, అంటె, మన రాజకీయ నాయకుల భాషలో చెప్పాలంటే, బహు ముఖ అభివృద్ధి. వేలం వెర్రిలగా ఏదొ వకటి పట్టుకొని, దాన్ని చితక్కొట్టేయకూడదు. ఇప్పుడు మనవాళ్ళకి ఐటి దొరికింది. టెక్నలజి రంగంలో అభివృద్ధి ముఖ్యమే ఐనా మిగిలిన రంగాలు అంత ముఖ్యము కాదు అనుకోవడం సరి కాదు. ముఖ్యంగా వ్యవసాయం, మన దేశంలో 70% (చాలా పాత సమాచరం) జనాభా అధార పడేది వ్యవసాయం మీదే, అటువంటి రంగాన్ని పట్టించుకోకవడమనేది సరి ఐన పద్దతికాదు. టెక్నలజి పరంగా ఎంత అభివృద్ధి చెందినా తినడానికి కావాలికదా. నా జ్ఞాపకశక్తి సరిగ్గా ఉంటే, మనకి స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో, మన లక్ష్యం ఏంటంటే వ్యవసాయ ఉత్పత్తులలో స్వావలంబన సాధించడం. ఇప్పుడు ఐటి లో వచ్చె ఆదాయం చూసి రైతులు వ్యవసాయం మానేసి వేరే ఎదైనా చేసుకోవాలంటే, తర్వాత మనకి ఆహారం ఎక్కడనుంచి వస్తుందనేది కొద్దిగా అలోచించాలి. With the usual disclaimer ;)
నమస్కారలతో,
సూర్యుడు :-)
నేనొకసారి యథాలాపంగా "ఈ ఉద్యోగాలకంటే చక్కగా వ్యవసాయం చేసుకోవడం మంచిది" అన్నమాటకు మా మితృడొకతను (అతనిది వ్యవసాయ కుటుంబం) "ఈ దేశంలో రైతుకంటే దౌర్భాగ్యుడెవడూ లేడ"ని ఆవేశంగా సమాధానమిచ్చాడు. ఎందుకో నాకు తర్వాత అర్థమయ్యింది.
నేను మఱియు తెలుగువీర చెప్పదలచినదేఁవిటంటే,
అభివృద్ధి చెందిన దేశాలలో ఉదా బ్రిటన్ లో ౫% జనాబా మాత్రమే దేశానికి కావలసిన వ్యవసాయ ఉత్పత్తులను పండిస్తారు.
అలాగే మనము కూడా భారీ పరిశ్రమలూ వగైరా services వగైరా పై దృష్టి సారించాలి. నేడు చిన్నకారు వ్యవసాయం చాలా కష్టం, దానికి ప్రత్యామ్నాయాలు ప్రోత్సహించాలి ప్రభుత్వం.
ఉదా- కొట్టు పెడతామని వచ్చిన వాల్క్సువాగన్ ని తఱిమేసారు. దాని నష్టం ప్రజలకు అర్థంకూడా కాదు. ఎన్ని వేల మందికి ఉపాది పోయిందో దాని వలన! వ్యవస్థలోని ఆ కుళ్లు వలన ఎన్ని కోట్ల ఉద్యోగాలు పోయాయో దేశంలో...
నాయిడు ముందు వ్యవసాయానికి చేయాల్సినదంతా చేసి (కాల్వలూ వగారా) ఆ తరువాత ఐటి పై దృష్టిసారించాల్సింది. రైతుల ఆత్మహత్యలకు పూర్తిగా అతనిని నిందించడం తప్పని నా ఉద్దేశం. అంత చదువుకున్న కేరళలోనే ఆత్మహత్యలు చాలా ఎక్కువగా జరిగేవి. మన దేశం లో ప్రతిదానికీ ప్రభుత్వాన్ని నిందించడం ఒక అలవాటు కూడా. మా నాన్నే నాకు అలాంటి డిమాండులు చాలా ఉదహరించారు.
ఇక పంటల మద్దతు ధర విషయమా దాని గురించి మనం వాదించుకోవడం సుద్ద టైం వేష్ట్.
అలానే వ్యవసాయాన్ని ప్రాక్టికల్ గా చూస్తే ఒకటి కనిపిస్తుంది. మనసు పెడితే ఇంకోటి కనిపిస్తుంది.
అమెరికా వంటి అగ్రరాజ్యాలే, అన్యదా పాటించే సంపూర్ణ పెట్టుబడీదారు తత్వం, వ్యవసాయానికొచ్చే సరికి వెనకాడుతారు.
నిష్పక్షపాతంగా మనస్సుని పక్కన పెట్టి చెప్పాలంటే, మార్పు చరిత్రలో సహజం, ఆ మార్పుకు అనుగుణంగా సమాజం తిరగలేనప్పుడు, చరిత్రకు కొందరు క్షతగాత్రులుగా ఆహుతౌతారు. ఇది మారే సమయం.
మీరు నాణానికి ఒక వైపు చూపించారు, నేను ఇంకో వేపు కూడా వుందని గుర్తుచేయ ప్రయత్నిస్తున్నాను.
ఒక తెలివైన వ్యక్తి అన్నారు...
"మితృలతో రాజకీయాలు, మతం మాట్లాడకూడదని ఓ నానుడి. అది బ్లాగుపరంగాను నిజమని తెలిసింది."
రెండో బొమ్మ 'బాగుంది' !
సూర్యుడు గారూ, అమెరికాలో రైతుల సంఖ్య ౦.7 శాతం. అంతమాత్రం చేత ఇక్కడ జనాలు ఆకలితో మాడుతున్నారనా? రైతుల సంఖ్య తగ్గి, లాండు సీలింగులాంటి చెత్త చట్టాలు ఎత్తేస్తే తక్కువ మానవ శ్రమతో ఉత్పత్తిని పెంచవచ్చు. ఒకరితో అయ్యే పనిని వందమందిని పెట్టి ఇంకా బీసీనాటిలా సాగిస్తామంటే ఇంక చెప్పేదేమీ లేదు. అమెరికాలో రిపబ్లికన్లూ, డెమాక్రాట్లు దొందూదొందే.. ఎన్నికలకు వచ్చేసరికి అయ్యో పాపం రైతులు అంటూ బయల్దేరుతుంటారు (అయోవా ప్రాథమికాలను గెలవాలిగా మరి)
స్పందించిన అందరికీ కృతజ్ఞతలు. కాకపోతే పరస్పరవిరుద్ధమైన రెండు విషయాలు తెలిపి నా వాదన ముగిస్తాను. అమెరికాలో సంవత్సరానికి రమారమి పదహారు బిలియన్ డాలర్ల (మన రూపాయల్లో అరవై నాలుగు వేల కోట్లు) సబ్సిడీ రైతులకు లభిస్తోంది కానీ దానిలో సింహభాగం పెద్ద రైతులకే వెళుతోంది. సంగతేమైనా కానీ ఇంత పెద్ద ఎత్తున సబ్సిడీలు ఇస్తుందన్నది వాస్తవం కాదా."The greatest loophole is the fact that subsidy limits apply to people, not farms; this applies to individuals as well as to corporations and partnerships. Therefore, large farms and agribusinesses can simply sign up each of their employees for a subsidy, and farmers in some cases can sign up their spouses and children to maximize the total subsidy to a given farm.": http://www.heritage.org/Research/Budget/BG1520.cfm కానీ అమెరికా చెప్పుచేతల్లో ఉండే ప్రపంచ బ్యాంకేమో సబ్సిడీలు ఇవ్వద్దంటూ నిబంధనలు పెడుతుంది. ఇదెక్కడి న్యాయం?
మరో పార్శ్వంలో చూస్తే ఇక్కడా రైతుల కోసం 'మానసిక నిపుణుల హాట్ లైన్లు':http://news.yahoo.com/s/ap/20071126/ap_on_bi_ge/farm_scene_1, వగైరా చూస్తే బక్క రైతుల కథ ఎక్కడైనా ఒక్కటే అనిపిస్తుంది.
ప్రతిదానికీ భారీతనం ప్రత్యామ్నాయం కాదు! భారీ యంత్ర పరికరాల పరిశ్రమ లాగా పాడి పరిశ్రమ, చిల్లరకొట్లు, వ్యవసాయం మొదలైన వాటికి కూడా భారీతనం పనికిరాదనుకుంటాను - మనదేశంలో.
అమెరికాలో ఫలానా విధంగా ఉంది కదాని, మనకూ అలా కావాలని అనుకోవడం సరైన పద్ధతి కాదేమో!
చదువరీ...లెస్స పలికితిరి.
Dr. Smile..
Oh..Excellent
Dr. Smile..
Oh..Excellent
Post a Comment