హ్యాపీ డేస్!

సినిమా చూస్తూన్నంత సేపూ మన బ్లాగర్లే కళ్ల ముందు కదలాడారు. వ్యక్తిగతంగా లేదా వారి బ్లాగుచిత్రాలలో చూసి ఉండడం వల్ల ముఖకవళికలతో పోలిక కొంత మంది, వారి అభిరుచుల ఆధారంగా, వారిని ప్రత్యక్షంగా చూడకపోయినా, మరి కొంత మంది జ్ఞప్తికి వచ్చారు. రాజేష్ ను చూడగానే 'ప్రవీణ్ గార్లపాటి', టైసన్ గా మన 'రాక్-ఏశ్వరుడు', శంకర్ గా 'రానారె' (మరి రానారె నవ్వు అచ్చంగా ఇతనిలాగే ఉంటుంది మరి), ఇక చివరికి చందు ఎవరా అనుకొంటూంటే హఠాత్తుగా గుర్తొచ్చింది: మన ఎవర్ గ్రీన్ 'విహారి' . విద్యార్థులకు బుద్ధులు చెప్పే ఫ్రెంచి గడ్డం మాస్టారిగా మన 'సాలభంజికల' వారు, కీలెరిగి వాత పెట్టే స్ట్రిక్టు మాస్టారిగా 'కొత్తపాళీ' గారు. ఇలా సినిమా అంతా బ్లాగుమయం చేసి చూసేశాను. అవును అసలు సూత్రధారి 'శేఖర్' గారిని మరచిపోయేనని అనుకొనేరు, ఆ బ్లాగ్శేకరుడు ' వెంకట్'.
ఇక సినిమా గురించి చాలా ఎక్కువగా వినడం వల్ల బాగుంది అనిపించింది. అయినా ప్రేమదేశం అంతగా ఊపేస్తోందంటే నమ్మశక్యంగా లేదు. అక్కడక్కడా మనస్సును తాకే సన్నివేశాలు ఉన్నా మనల్ని ఊపేసే సినిమా అయితే మాత్రం కాదు. అసలు కమ్ముల గారి సినిమాలు నిండు గోదారిలా ఉంటాయి కానీ ఉరకలెత్తే కృష్ణమ్మలా ఉండవు. మొత్తానికి మంచి సినిమా. ఇక నటీనటుల పరంగా రాజేష్ పాత్రధారి నిఖిల్ కే పూర్తి మార్కులు. ఇక సినిమా ఆరంభంలోనే మితృలతో చెప్పాను చిరు పేరు ఒక్కసారైనా వస్తుందని విజిలేయక తప్పదని. అనుకొన్నట్టే వచ్చింది, విజిలూ పడింది.ఇక నా వరకూ వస్తే నేనూ ప్రతి పాత్రతోనూ నన్ను సరిపోల్చుకొన్నాను. పదో తరగతి దాకా 'టైసన్', ఇంటర్లో 'శంకర్', తర్వాత నాలుగేళ్లు 'రాజేష్', కాలేజి చివరి సంవత్సరం 'చందు'...ఇలా అన్నమాట అది ఎందుకో నాకే తెలుసు మరి:)

2 comments:

rākeśvara said...

మీరింత మాటన్న తరువాత, ఇక నేను ఆ సినిమా చూడాల్సిందే :)
మీ మాట నా సినిమా అనుభవాన్ని inhibit చేస్తాయేమోనని భయం వేస్తుంది.
అన్నట్టు నేను చిరుత చూసా.
చరణ్ చాలాఆఆ బాగున్నాడు కానీ, సినిమాని మాత్రం పూరీ జగన్నాథ్ రొచ్చు చేసేసాడు పాపం. కుఱ్రాడికి మంచి భవిష్యత్తు వుందనిపిస్తుంది. మొదటి సినిమా చేస్తున్నట్టు లేడు.

అన్నట్టు మీకు ఈద్ శుభాకాంక్షలు.
(నాకెందుకో, మూడేళ్ల క్రితం తెలుగు బ్లాగులు చదవడం మొదలు పెట్టినప్పుడు మీకు ఒక సారి ఈద్ ముబారక్ తెలిపినట్టు దేజా వూ వస్తుంది :D )

Anonymous said...

@ ఇస్మాయిల్ గారు,

మీకు బ్లాగు మత్తు బాగా ఎక్కినట్టుంది :-) పరీక్షలప్పుడు జాగ్రత్తే :-)

నేను కూడా ఈ సినిమా చూడాలి మరి :-)

-- విహారి