కాదేదీ కవిత కనర్హం!
ఔనౌను శిల్ప మనర్ఘం!
ఉండాలోయ్ కవితావేశం!
కానీవోయ్ రస నిర్దేశం!
దొరకదటోయ్ శోభాలేశం!
కళ్ళంటూ ఉంటేచూసి,
వాక్కుంటే వ్రాసీ!
ప్రపంచమొక పద్మవ్యూహం!
కవిత్వమొక తీరని దాహం! - శ్రీశ్రీ (ఋక్కులు)
తీరని దాహం తో ఉంటూ మన మనస్సును కరిగించే "మంచుగడ్డల"
లాంటి కవితలు అనంతపురం కు చెందిన శ్రీరాములు సొంతం!
చిన్నప్పుడు ఎప్పుడో రాసుకొన్న
"పిల్లలకి,పెద్దలకి,ప్రపంచంలో అందరికీ...
తరగని అన్నం కొండలు...
సముద్రమంత పప్పు,చారు...
చెరువు నిండా తాగేనీళ్లు...
అందరికీ ఉండాలి"
అన్న చిన్ని వాక్యంతో మెదలైన కవితా ప్రస్థానం ఇలా సాగింది....
"మట్టి పై కొలతలు,
నీటి అంచులు,
ఏ దేశానికైనా సరిహద్దులు!
మట్టిని నీటితో కలిపి,
మనిషీ మనిషీ శ్రమిస్తేనే,
ఏ దేశ ప్రజలైనా తినేది ఇన్ని ముద్దలు!" - శ్రీరాములు(జలగండం)
"ఋతువులు ఎన్నైనా,
మా రాయలసీమకు ఒకేఒక ఋతువు...కరువు ఋతువు!
కాలాలెన్నైనా మా సీమకున్న ఒకేఒక కాలం...ఎండాకాలం!"
"నాగలికే కాదు, నాలుకకీ దాహం తీరదు
విత్తనాన్ని సుత్తితో కొట్టినా సరే భూమిలో దిగదు!"
"వాన కాదు రైతుని చేస్తున్నది మోసం,
వాగ్దానాలతో ఊరిస్తూన్న రాజకీయులదే ద్రోహం!"
ఇంకా చదవాలంటే ఇక్కడ నొక్కండి.
- అనంతపురం వార్త కు ధన్యవాదాలతో...
1 comment:
"విత్తనాన్ని సుత్తితో కొట్టినా సరే భూమిలో దిగదు!" - అవస్థలు పడినోళ్లకు తెలుసు ఈ మాట లోతెంతో.
Post a Comment