రవి గాంచని చోట కవి గాంచును!

నిజంగా ఇది ఆశ్చర్యంగా ఉంది (నా వరకూ). ఈ రోజు 'హృదయకవాటాల శస్త్రచికిత్స' పై జరిగిన ఓ సదస్సుకు హాజరై అలసిసొలసి వచ్చిన నాకు, "ఈనాడు ఆదివారం"లో వికిపీడియా పై వచ్చిన వ్యాసం చాలా ఆనందాన్ని కలుగజేసింది.మన తెలుగు వికిపీడియా గురించి వ్రాసినా, ఏదో ఒక వాక్యంతో కానిచ్చేసారు.స్వోత్కర్ష కాదు గానీ కాకతాళీయంగా నా జాబు తర్వాత ఈ వ్యాసం రావడం నాకెంతో ఉల్లాసాన్నిచ్చింది.

మరోమాట మన తెలుగువారు అమెరికాలో వైద్యవృత్తిలో ఎన్నో జయకేతనాలు ఎగురవేస్తున్నారు.ఈ రోజు సదస్సులో ప్రసంగించిన డా.వివేక్ రెడ్డి ,బోస్టన్ లోని ప్రతిష్టాత్మక మసాచుసెట్స్ జనరల్ హాస్పటల్, హార్వార్డ్ మెడికల్ స్కూల్ లో "ప్రయోగాత్మక ఎలక్ట్రో ఫిజియాలజీ లాబరేటరీ" నిర్వాహకుడు.ఈయన చిత్తూరు జిల్లాకు చెందిన వారు. ఇలాగే క్యాన్సర్ నిపుణులైన డా.నోరి దత్తాత్రేయుడు గారు, న్యూయార్క్ లోని "వీల్ కార్నెల్ మెడికల్ సెంటర్" లో రేడియేషన్ ఆంకాలజీ విభాగానికి ఛైర్మన్.ఈయన మా కర్నూలు వైద్య కళాశాల విద్యార్థి కావడం మాకెంతో గర్వకారణం.

2 comments:

Anonymous said...

నిజమేనండీ...తెవికీ చిత్రాలు ప్రముఖంగా వాడారు గాని, రాసినది తక్కువే...అయితేనేం ఈ మాత్రం చాలు..మన తెలుగు వాళ్ళు తెవికీ ని సందర్శించటానికి :-)

రానారె said...

చాలా సంతోషం. ఆ పరిశోధనల పుణ్యమా అని మనదేశంలో వైద్యానికయే ఖర్చు అందుబాటులో ఉంటోంది. ఇస్మాయిల్ గారు కూడా ఇందులో ప్రముఖ భూమిక వహించాలని ఆకాంక్ష.