ఓ 'ఇరవై' కథ


పెనుకొండ బాబయ్య ఉరుసు..అంటే చిన్నప్పటి ఎన్నో సంగతులు గుర్తొస్తాయి. ఆ పెనుకొండ కొండల్లో దారీ, గమ్యం తెలీకుండా తిరిగిన సంగతులు...మరీ ముఖ్యంగా ఆ రోజు మా బాబు మామ ఫోటో స్టూడియోలో కిందపడ్డ ఓ ఇరవై రూపాయాల నోటు చూసి ఎవరూ చూడలేదనుకొని జేబులో దోపుకొని, దర్గా దగ్గర మా పిల్ల గుంపు కందరికీ తలా ఓ బఠానీల పొట్లమో, ఓ మరమరాల పొట్లమో, ఓ లడ్డూ పొట్లమో కొనిపించి హీరోలా ఫీలయ్యా! ఒక రూపాయికి అరశేరో, శేరో వచ్చే కాలమది.అందరి చేతుల్లో అంతంత చిరుతిళ్లు చూసిన మా అమ్మకు ఎక్కడో అనుమానం వచ్చింది. ఇంటికెళ్లాక తీరిగ్గా చేసిన అపరాధ-పరిశోధనలో నా ఘనకార్యం బయటపడింది. ఇంకేముంది మా అమ్మ ట్రేడ్ మార్క్ పనిష్మెంటు: బచ్చలిలోకి తీసుకెళ్లి ముఖం పై ఓ చెంబుడు చన్నీళ్లు  కాంతి వేగంతో కొడితే, నా మెదడు బ్లాంకయి, ఇక మళ్లీ ఆ తప్పు మరోసారి చేయను అంటూ ఏడ్చుకొంటూ చేసిన వేడుకోలులన్నీ ఆ చన్నీటిలో కలిసిపోయిన వేడి కన్నీళ్లయ్యాయి. ఆ ఇరవైకు పరిహారంగా మరో ఇరవై జతచేసి దర్గా హుండీలో నాతో వేయించి నా తప్పు కాయమని బాబయ్యకు దువా చేసి ఇంటికి తీసుకొచ్చింది. ఆ రోజు నుండి ఎక్కడ ఏ వస్తువు కనిపించినా ఆ సొంతదారుకు ఇచ్చేంత వరకు నా మనస్సు ఊరుకోదు. కానీ ఇప్పటికీ ఆ ఇరవై ఎవరిదో నాకు ఇంతవరకు తెలీదు

6 comments:

సుజాత వేల్పూరి said...

ఎంత మంచి అమ్మ!!

"బచ్చలి" లోకి తీసుకెళ్ళి అంటే.......??

Dr.Pen said...

మా సీమ భాషలో "స్నానాల గది"!

http://www.andhrabharati.com/dictionary/

>>>

బచ్చలి(5)

బచ్చలి
బౘ్చలి : బహుజనపల్లి శబ్దరత్నాకరము        గ్రంథసంకేతాది వివేచన పట్టిక
దే. వి. 
కలంబి† . (దీని భేదములు తీఁగబౘ్చలి, దుంపబౘ్చలి. ఇదే తీఁగబౘ్చలి.)

***

బౘ్చలి, బౘ్చలికూర : బ్రౌణ్య తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు    
baṭsṭsali
[Tel.] n.
Indian Spinach, Basella alba ఉపోదకి.
తీగబచ్చలి, అల్లుబచ్చలి or పొలముబచ్చలి the plant termed the Creeping Purslane.
దుంపబచ్చలి Basella indica Rox. ii.104.
ఎర్ర అల్లుబచ్చలి Basella rubra (Watts.)

***
బౘ్చలి : బ్రౌణ్య తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు    
baṭsṭsali
[Tel.] n.
1. A bathing place; a place for washing vegetables, &c.
2. A certain vegetable.
కందకులేని దురద బచ్చలి కేమి? (proverb.)

***
బౘ్చలి : శంకరనారాయణ తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు    
n. 
(bot.) see తీఁగ, దుంప, మట్టు.
బచ్చలి : తెలుగు నిఘంటువు (జి.ఎన్.రెడ్డి - ఆం.ప్ర. సాహిత్య అకాడమీ)    
విశేష్యము
శాకవిశేషము.

***
బచ్చలి : మాండలిక పదకోశము (ఆం.ప్ర. సాహిత్య అకాడమీ)    
స్నానాలగది. జాలారి. [కర్నూలు]

Anonymous said...

"ఓ మరమరాల పొట్లమో" - మరమరాలు అంటే?!

Dr.Pen said...

>>>ప్రాంతీయ మాండలిక పదకోశం (తెలుగు అకాడమి)
బొరుగులు [రాయలసీమ మాండలికం]
మరమరాలు [కళింగ మాండలికం]
పాలాలు, బొంగు పేలాలు, ముర్మురాలు[తెలంగాణ మాండలికం]

Unknown said...

Hey ismail,

Great, that is true, iam also from pkd i born and brought up in pkd, i also n joyd a lot in babaiah parasa.

Unknown said...

Hey ismail,

Great, that is true, iam also from pkd i born and brought up in pkd, i also n joyd a lot in babaiah parasa.