ఇన్-ఫాచ్యుయేషన్
______________
టీనేజీలో ప్రేమేంటీ?
అన్నారందరూ...
అది అప్పుడే మొగ్గలేస్తూన్న
పసి వయస్సు...
కులం, మతం కల్మషం అంటని
పసి మనస్సు...
అప్పుడు నాటుకున్న ప్రేమ విత్తనం
లేలేతగా చివురుతొడిగి
తీగెలు, తీగెలుగా మనస్సంతా
అల్లుకుంటుంది.
గుత్తులు, గుత్తులుగా విరబూసే
సౌహార్దపు పూల సౌరభం
మదినిండా పొంగి పొర్లుతుంది.
కొద్దిరోజుల్లోనే ఆ చిన్ని మొక్క
కొమ్మలు రెమ్మలుగా విస్తరించి
శాఖోపశాఖలై వటవృక్షమౌతుంది.
విధి వైపరీత్యం వల్ల
ఆ ప్రేమ...
మొదలంటూ నరికిన చెట్టులా కూలిపోతే
మిన్ను విరిగి నేల పడ్డట్టు ఆ హృదయం బద్దలవుతుంది.
హృదయాంతరాల్లోకి చొచ్చుకుపోయిన బలమైన వేళ్లు
ఏ తుఫానూ పెళ్లగించలేకపోయినా...
ఆ హృదయానికి పెట్టిన గాటు నుంచి
జ్ఞాపకాల రక్తం స్రవిస్తూనే ఉంటుంది.
7 comments:
pretty moving
చాలా బాగుంది.
మీ ఈ కవిత చూస్తుంటే.. నేను ఎప్పుడో రాసుకున్నది గుర్తొస్తుంది.
వీలైతే ఓ సారి చూడండి.
http://manasa4life.blogspot.in/2010/06/blog-post_8387.html
@ Rajendra..Thanks!
@ Manasa...WoW!!! Exact thoughts:-)
ఇప్పుడూ రక్తాలు కారేంత కష్టమేమొచ్చింది డాట్రారూ!
కాదంటే - ఇది "వెటరన్స్" గాధా? బాధా? కథా?
>>>రక్తాలు కారేంత కష్టమేమొచ్చింది.
...తెల్లవారుజామున ఓ కలొచ్చింది:-)
>>> గాధా? బాధా? కథా?
...గాధా'షుప్త'శతి.
>>>"వెటరన్స్"
... :-)))
బాల్యపు జ్ఞాపకాల మీద పట్టు, ఇన్-ఫాచ్యుయేషన్ గురుతుల మీద వింత మోహం ఉంటాయి కానీ ఆ జ్ఞాపకాలకి వేధించే శక్తి ఉంటుందా? జీవితానుభవం లో నానిన కొద్దీ ఆ దశ తాలూకు స్మృతులు చిక్కపడి నిశ్చలం అవుతాయి గానీ స్రవిస్తాయా? ఏకాంతాన వెన్నెల చలువతో ఊరట నిస్తాయి తప్పా గాట్ల తడితో గుండెని ముంచెత్తుతాయా? టీనేజ్ ప్రేమ పెళ్ళిగా పరిణమిస్తే ఆ నిష్కల్మష పరిమళం నిలుస్తుందా? అవి అలా పుట్టి ఇలా మనసుల్లో మెత్తని పారిజాతపు పూలలా నిలిచేవి కాదా?(ఈ ప్రశ్నలు ఈ కవితా మూలాల్లోకి తొంగి చూస్తూ నాకు వేసుకున్నవి.)
సర్ మీ బ్లాగ్ లో follow by email అని ఆప్షన్ పెట్టండి మేము మీ బ్లాగ్ లో మెంబెర్స్ అవతము
Post a Comment