రెండు మంచి వార్తలు!

ఈ మధ్య వార్తలు చదివితే అంతా చెడే జరుగుతోంది అనే భావన కలుగుతోంది. అలాగే ఓ మంచి విషయం విని సంతోషించి చాలా కాలమయినట్లు అనిపిస్తోంది. కానీ ఈ రోజు ఓ రెండు వార్తలు చదివి మండుటెండలో పన్నీటి జల్లు కురిసినంత సంతోషం వేసింది. కుల-మత- వర్గ భేదం లేకుండా పేద కుటుంబాల వారికి, వారి శక్తి మేర చదువుకున్నంత వరకూ ప్రభుత్వం అండగా నిలబడడం బహుధా ప్రశంసనీయం. పేద వర్గాల వారిని ఆదుకునే ఒకే ఒక్క ఆయుధం 'చదువు' అని నా ప్రగాఢ నమ్మకం. నాకు తెలిసి తెలివి ఉన్నా, స్థోమత లేక ఆగిపోయిన చదువులెన్నో, అలాంటి వారికి ఈ నిర్ణయం నిజంగా ఓ వరం. ఈ నిర్ణయం తీసుకొన్నందుకు ప్రభుత్వాన్ని అభినందించాలి. ఇంతలా కాకున్నా కొంత వరకు 'ఆరోగ్య శ్రీ' పథకం కూడా ప్రజలకు ఉపయోగపడుతోందనే అనుకొంటున్నాను. (Disclaimer: నేను అధికార పార్టీకి, వారి పార్టీ పత్రికకు గుడ్డి అభిమానిని కానని సవినయంగా తెలియజేసుకొంటున్నాను. ఇంకా విశదీకరించాలంటే 'సూర్య'బావుటా నిగనిగలు, 'ప్రజారాజ్యపు' ధగధగల కోసం వేచి ఉన్న ఓ సగటు అభిమానిని:-) అలాగే మా అనంతపురంలో జరిగిన ఈ సుహృద్భావ సంఘటన కూడా ఆహ్వానించదగ్గది. I am celebrating this incident with a spiritual fervor! And this is the ground reality in small towns and villages all across the country, which is in stark contrast to the views espoused by many in the Telugu Blog world, who are spewing hatred towards Indian muslims in all possible ways. They are integrated into the national fabric, they are not a stain, they are one among the threads of the tunic, which is INDIA. "ఏకం సత్ విప్రా బహుధా వదంతి."

{ చిత్రాలు: 'సాక్షి' సౌజన్యం}

2 comments:

చిలమకూరు విజయమోహన్ said...

మీరు మా మన అనంతపురం వాసులు కావడం మా అదృష్టం.మాది తాడిపత్రి మరి మీదో...

Dr.Pen said...

అక్కడ వ్యవసాయం చేస్తూ, ఇక్కడ బ్లాగుల ద్వారా సాహితీ వ్యవసాయం చేస్తున్న మీ పరిచయం కావడం నా అదృష్టం. నాకు తెలిసి 'వ్యవసాయం' వృత్తిగా ఉన్న మొదటి తెలుగు బ్లాగరు మీరేనేమో? నాకు అన్నం పండించే రైతన్నా, అందుకు చెమటోడ్చే రైతుకూలీ అన్నా ఎనలేని అభిమానం. మీరే లేకపోతే ప్రపంచానికి ముద్ద ఎలా దిగుతుంది. మీరన్నట్టు ఈ దేశానికి మీరే మహారాజు! అన్నట్టు నేను పుట్టింది, పెరిగింది హిందూపురంలో.