'వాహ్'టె టీమ్!!!

వాహ్! ఇక హిల్లరీ క్లింటన్ 'మేడమ్ సెక్రటరీ' మన పరిభాషలో అమెరికాకు కాబోతున్న కొత్త విదేశాంగ మంత్రి. బరాక్ అధ్యక్షుడు, హిల్లరీ సెక్రటరీ ఆఫ్ స్టేట్! ఇదే విషయాన్ని కొన్ని నెలల క్రిందట చెబితే ఎవరైనా "పోబ్బా! భలే చెప్పొచ్చావు కానీ" అని ఎగతాళి చేసేవారు. ఎవరో అన్నట్టు "స్కిజోఫ్రినియా" అని అనుమానపడినా ఆశ్చర్యం లేదు. ఏదేమైనా కొత్త అధ్యక్షుడి ఒక్కో నిర్ణయం ఎంతో విజ్ఞతతో, సమయస్ఫూర్తితో తీసుకొంటున్నట్లు ఋజువవుతోంది. I strongly applaud him for his non-partisanship and to move forward with a team of rivals.

ఇక ఒబామా మీద చాలా విమర్శలే వచ్చాయి మన బ్లాగుల్లో. అక్కడ వ్యాఖ్యానిస్తే మళ్లీ ఓ 'రచ్చ' కు తెరతీసినట్లవుతుందని ఏదో నాకు తోచింది నా బ్లాగులో రాసుకొంటున్నాను. (బ్లాగుబద్ధమైన హెచ్చరిక: ఇది ఎవరినీ వ్యక్తిగతంగా కించపరచడానికి రాస్తున్నది కాదని, వారి భావాలకు నా ప్రతిస్పందన అని గమనించ ప్రార్థన.) ఆయన ఎన్నిక చారిత్రాత్మకం కాదన్నారు, సరే. సమానత్వమా...హ!హ!హ! అని నవ్వారు, సోషలిస్టు అని నిందించారు(ఏం చేస్తాం ఈ కాలంలో కమ్యూనిస్టు, సోషలిస్టు పచ్చి బూతు పదాలైపోయాయి, ఇక్కడ కాపిటలిస్టుల కోటలు కూలుతున్నా!) , తొక్క,తోలు అని...ములట్టో అని ఎగతాళి చేసారు. హి ఈజ్ హాఫ్ బ్లాక్ అంటూ రుసరులాడారు. బరాకేశ్వరుడంటూ 'పన్ను' పొడిచారు.

ఇన్ని చేసినా మరీ నోర్మూసుకొని కూర్చొంటే బరాకాకింతుణ్ని(నేను వ్యక్తిగత పూజకు 'సిద్ధయ్య'ను అని ఇప్పటికే మీకు తెలుసును కాన!) ఎలా అవుతానని, ఈ టపా:-) కేవలం తన 'తోలు' గురించి అవమానపరిచారనే ఓ సగటు మనిషి, రవి అస్తమించని సామ్రాజ్యాన్ని గడగడలాడించిన మహాత్ముడైయ్యాడు. "All men are created equal" అని రాసుకొన్న రాజ్యాంగం కింద ఓ నల్లవాడు, ఆఫ్కోర్స్ హాఫ్ నల్లవాడు, అధ్యక్షుడైన క్రమాన్ని భరించలేని వారు కోకొల్లలు (మా లూసియానా రండి, చూద్దురు గానీ). సో సమానత్వమా...వంకాయా! అన్నా 'వాకే'. ములట్టో, హాఫ్ బ్లాక్`ల గురించి కొంత- లించింగ్ అంటే తెలుసుగా, ఊరంతా పండుగలా చూస్తోంటే, ఊరి నడిబొడ్డున- చెట్టుకు ఉరి తీయడం, చచ్చేదాక! కారణాలు ఎన్నో ఉండొచ్చు- తెల్ల పిల్లను, నల్లవాడు కన్నెత్తి చూడడం దగ్గర నుంచీ- అలాంటి స్థితి నుంచీ ఒక తెల్లపిల్లకు-నికార్సైన ఆఫ్రికా నల్లనయ్యకు పుట్టినోడు అదే అమెరికా అధ్యక్షుడైయ్యాడు చూడండి, అది ఫుల్ బ్లాక్ అధ్యక్షుడైన దానికన్నా వెయ్యిరెట్లు చెంపపెట్టు! ఇది చారిత్రాత్మకం కాదనే వాళ్లుంటే, వారికి చరిత్ర తెలియదని మనం సరిపెట్టుకోవాలి.

మైనారిటీ ఓట్లతో అధ్యక్షపీఠం అలకరిస్తున్నాడు, అనేవారికి ఓ సూచన- అందరికన్నా అమెరికా ననవయువతలో బరాక్̍కు ఎక్కువ ఓట్లు పడ్డాయి, అమెరికా భవిష్యత్తు వీరిదే, వారి స్వరాన్ని తమ ఓటు ద్వారా ప్రపంచానికి ఎలుగెత్తి చాటారు. ఈ రొడ్డకొట్టుడు రాజకీయాలు, మతం పేరిట ఓట్లు దండుకోవడాలు, ప్రజలను భయవిహల్వులను చేయడం ద్వారా అధికారాన్ని చేజిక్కించుకోవడాలు మొదలైన 'రోవియన్' పాలిట్రిక్సు చూసి, చూసి విసుగెత్తి పోయి, చేవ చచ్చిన 'పెద్ద ముదుసలి' పార్టీని పాడెక్కించారు. కొత్త ఆలోచనలతో ముందుకు రావడం మాని, పాచిపోయిన భావాలకు అందమైన మేలిముసుగు వేసి ప్రజలను నమ్మించాలని చూశారు. అది ప్రజలు తిప్పికొట్టారు. ఇకనైనా మేలిముసుగుల్ని, అందమైన మైనపుబొమ్మల్ని, ముద్దుగుమ్మల్ని కాదని, కాస్త సత్తా ఉన్న యువరక్తంతో పార్టీని నింపితే తప్ప, భవిష్యత్తు లేదు. రాబోయే కొద్ది రోజుల్లో ఈ దేశంలో 100% ప్యూర్ వైట్- సంప్రదాయక- మతాభిమాన- జాత్యాహంకార-శతాధిక వృద్ధులు మైనారిటీ కాబోతున్నారని గుర్తెఱిగితే వారికే మంచిది.

నా బుర్ర వేడెక్కిపోయింది ఈ టపాతో, చదవిన మీ బుర్ర వేడెక్కితే కాస్త ఈ 'కాఫీ'పాఖ్యానం చూసి, చదివి, తాగి రిలాక్స్ కండి. తోటరాముడు గారు మీకు డిజైనింగు పాఠాలు, అవిడియాలు ఇందులో ఎన్నో ఉన్నాయి:-) ఇక Thanksgiving కు మా థాయ్`లాండ్ నర్స్ మిస్టర్ వచారా కచాట్రాన్ తన adopted అమ్మా, నాన్న ఇంటిలో జరుపుకొంటూ మమ్మల్ని ఆ విందుకు ఆహ్వానించి మాంఛి టర్కీ వంటకాన్ని, బీన్స్ విత్ మాష్డ్ పొటాటో, స్వీట్ పొటాటో (అదే మన గెనసు గడ్డ) pie ను కడుపు నిండా పెట్టి, మా మనస్సంతోషపరచినారని ఇందుమూలంగా యావన్మందికీ తెలియజేయుటకు సంతసిస్తున్నాను. తాంబూలమొక్కటీ తక్కువైంది:-)

13 comments:

కొత్త పాళీ said...

డాట్రారూ, బహుబాగు :)
అమెరికాలో సెక్రటారీ ఆఫ్ స్టేట్ అంటే మన భాషలో విదేశాంగ మంత్రి. హోం మినిష్టర్ కి సరైన సమాన పదవి లేదు. బహుశా ఇప్పుడు ఎటార్నీ జనరల్ కీ, సెక్రటరీ ఆఫ్ హోం లాండ్ సెక్యూరిటీకీ కలిపి ఉంటుంది పోలీసు, రక్షణ బాధ్యత

Anil Dasari said...

టపా అదిరింది (నా నోటెంట ఈ మాట అంత వీజీగా రాదు కాబట్టి మీ టపా నిఝంగా అదిరింది అని అర్ధం)

ఒక నల్లాయన (ఓకే - సగం నల్లాయన) అమెరికా అధ్యక్షుడయ్యాడంటే తెల్లతోలు అమెరికన్లన్నా జీర్ణించుకున్నారు కానీ కొందరు భారతీయులు ఆ నిజాన్ని దిగమింగలేకున్నారు. ఆయన గెలుపుకి నోటికొచ్చిన కారణాలు చెబుతూ చప్పరించి పారేసే వాళ్లు మీ టపా తప్పక చదవాలి.

Dr. Ram$ said...

బాగా చెప్పారు.. ప్రపంచం అంతా ఇప్పుడు ఓబామా బారక మంత్రమే జపిస్తుంది.. తను అందుకు అర్హుడు కూడా..నేను ప్రస్తుతము ఒక తెల్ల రిపబ్లికన్ డాక్టర్ దగ్గర వర్క్ చేస్తున్నాను, పెన్సిల్వేనియా లో..యీ రాష్ట్రం లో వాళ్ళు పెద్ద అతివాదులు, మా డాక్టరు గారు కూడా..కాని ఆయనే ఒబామా విజయాన్ని మనస్పూర్తి గా గొప్ప విజయం రాం అని చెప్పారు.. కాని చాలా మంది యితర దేశస్తులు మాత్రము ఇంకా ఏడుస్తూనే వున్నారు.. ఎందుకో మరి.. ఎందుకంటే ఒబామా కి అమెరికా ని ప్రేమిస్తాడు కాబట్టి.. మీ థాంక్స్ గివింగ్ మెను బాగుంది.

KumarN said...

"తెల్లతోలు అమెరికన్లన్నా జీర్ణించుకున్నారు కానీ కొందరు భారతీయులు ఆ నిజాన్ని దిగమింగలేకున్నారు"

నిజమా అబ్రకదబ్ర గారూ!! నాకు చాలా ఆశ్చర్యం కలిగించే విషయం అది. నాకు తెలిసిన భారతీయులంతా 99% శాతం పైనే ఒబామాని సపోర్ట్ చేసారు మరి..

ఒకవేళ నిజంగా ఎవరైనా ఒబామా గారిని ఆయన చర్మపు రంగు ని బట్టి వ్యతిరేకిస్తే, వాళ్ళని ఈ క్రింది ప్రశ్న అడిగి వాళ్ళ సమాధానం నాకొంచెం చెపుతారా?

"నల్ల వాళ్ళు సివిల్ వార్ లో విజయాలని అమెరికాకి అందించక పోతే, మనలాంటి(ఇండియన్స్) వాళ్ళం ఈ రోజున ఇంత స్వేచ్చగా బ్రతికే వాళ్ళమా ఈ దేశంలో?"

నేనయితే వాటి కోసం నా జీవితమంతా రుణ పడి ఉంటాను వాళ్ళకి.

అయినా నాకు తెలీకడుగుతానూ, ఒబామా గారి మాటలు విన్నా, ఆయన పుస్తకాలు చదివినా, ఒక సెన్సిబుల్, రీజనబుల్, కామన్ సెన్స్, ఇంటలెక్ట్ ఉన్న మనిషి కనబడతాడే తప్పితే, ఆయనలో టిపికల్ నల్ల తనం (ఈ పదం పొలిటికల్లీ కరక్ట్ కాదు, కాని వాడుతున్నా, మీకర్ధమయ్యింది కదా, వాట్ ఐ మీన్ అని) నాకు ఒక్క శాతం కాదు కదా, 0.01% కూడా కనబడలేదు ఈ రెండు సంవత్సరాల్లో.

అసలాయనకి 44% తెల్ల వోటు పడింది, కెర్రీ కన్నా, గోర్ కన్నా, క్లింటన్ కన్నా కూడా ఎక్కువ అని చెప్పల్సింది వాళ్ళకి. అసలు వర్జీనియా, నార్త్ కెరోలినా, ఇండియానా ల్లో విజయాల గురించి కొంచెం వివరించక పోయారా ఆ భారతీయులకి. కళ్ళు తిరిగే నిజం అది, వాళ్ళ కర్ధమయితే.

క్లుప్తంగా చెప్పలంటే, ఒబామా గారిని కేవలం ఒక నల్ల వ్యక్తి గా ఎవరైనా భారతీయులు చూస్తున్నారంటే, వాళ్ళకి ఆయన గురించే కాదు, అమెరికా గురించి కూడా ఏమీ తెలీదన్న మాట. వీళ్ళని నేనెమంటానో మీకు తెలుసు, మీక్కోపమొచ్చినా సరే :-)

అసలు ఆయన "కేవలం నల్ల వ్యక్తి" అన్న ముద్ర పడితే, ఈ రోజున ఆయన అక్కడ ఉండే వాడు కాదనుకోండి. That said, ఆయన నల్ల తనం, ఆయనకో అదనపు ఆకర్షణ ని తీసుకొచ్చిందనుకోండి. Well, that's for another day..

Disclaimer: I voted for John McCain. Based on what I observed, I haven't seen one Indian who is not happy that Obama won, although their expectations and hopes a bit misplaced.

KumarN said...
This comment has been removed by the author.
KumarN said...
This comment has been removed by a blog administrator.
Dr.Pen said...

Kumar said...

Ismailji,

I had to delete it, because I hit the 'publish' button twice inadvertently..

That said, this sentence caught my eye just now..

"రాబోయే కొద్ది రోజుల్లో ఈ దేశంలో 100% ప్యూర్ వైట్- సంప్రదాయక- మతాభిమాన- జాత్యాహంకార-శతాధిక వృద్ధులు మైనారిటీ కాబోతున్నారని గుర్తెఱిగితే వారికే మంచిది.
"

Your intro on the blog says that you are sensitive and sensible guy.. *edited*(Actually I love America with every cell of my body). I actually like traditionalists( not those extreme right-wing mongers ....hannitys..pat robertsons..bob jones.. etc.,). I similarly hate extreme left-wing nuts...*end of message*
Will respond in a short time...

Anil Dasari said...

@కుమార్:

నాకు తెలిసిన వాళ్లు ఒకరిద్దరున్నారు. బాగా దగ్గరి స్నేహితుడొకడు, వాళ్లలో. 'ఒక నల్లోడు దేశాధ్యక్షుడు కావటం ఏంటండీ' అని కనపడ్డవాళ్లందరి దగ్గరా వాపోతాడతను - ఎన్నికలై నెలౌతున్నా ఇంకా అదే గోల. మరో తెలుగు స్నేహితుడు - అనకూడదు కానీ అతని తోలూ నీలమేఘశ్యామ వర్ణమే - ఇతనికి స్వతహాగానే ఆఫ్రికన్-అమెరికన్లంటే ఎందుకో మంట. వాళ్లు తక్కువ జాతి వాళ్లని ఇతని నమ్మకం. ఒబామా విషయంలో ఇతనిదీ పై స్నేహితుడి అభిప్రాయమే. డెమొక్రాటా, రిపబ్లికనా అనేది అతని సమస్య కాదు. నలుపా తెలుపా అనేది మాత్రమే.

విశేషమేమిటంటే, వీళ్లిద్దరికీ అమెరికాలో ఓటు హక్కు లేదు. మెకెయిన్‌కి ఓటేసిన వాళ్లు కూడా ఇంత ఫీలయ్యుండరు ఒబామా గెలిచినందుకు :-)

Krishna K said...

Kumar బాగా చెప్పారు. ఒకళ్లిద్దరు వుండవచ్చు గాని, majority Indians (should I say, Indian Americans) ఓబామా కే ఓటు వేసారు అని చెప్పవచ్చు, అందరి లాగానే.
నా వరకు అయితే ఓబామా కు నల్ల తనం, ఉపయోగపడిందే కాని, నష్టం చేయలేదని అంటాను.
having said the above stmt. డాక్టర్ గారు చెబ్తుంది కూడ కొంత అర్ధం చేసుకోగలను, ఎందుకంటే, ఉండేది , పక్కా తెల్ల తోలు ఉంటెనే, జనాలను గౌరవించే, North Texas లో కాబట్టి.
మీరు నమ్ముతారో లేదో కాని, ఇప్పటికి, నెలకో మా client (health care industry) డాక్టర్ది తెల్ల తోలు కాదని, కుర్చిలో నుండి లేసి వెళ్లిపోతారు.
అద్రుష్టం కొద్దీ, అలాంటి వాళ్లు తగ్గి పోతున్నారు. so ఆ angle లో చూస్తే (christian white south), ఓబామా ఎన్నిక చారిత్రత్మకమే.
కాకపోతే, కాలం తో పాటు minority అయిపోతున్న వాళ్ల (southern white christian) angle లో ఎందుకు చూడాలి అన్నది నా ప్రశ్న?

Dr.Pen said...

@kottapali...
సవరించినందుకు నెనర్లు. I stand corrected.In a different view, the position holds similar weight in the administration as our home ministry as it is treated as the top position in the cabinet.

@Abacradabra...I appreciate your comment and sincerely acknowledge your tap on my shoulder. Thanks.

@Kumar...
100% ప్యూర్ వైట్- సంప్రదాయక- మతాభిమాన- జాత్యాహంకార-శతాధిక వృద్ధులు...Please read them as separate entities not as adjectives to a group. నేను ఏ జాతికీ వ్యతిరేకం కాదు. పై చిత్రంలో నాకు ఆతిథ్యం ఇచ్చింది ఎవరో కాస్త చూడండి. అలాగే ఏ మతానికీ నేను వ్యతిరేకం కాదు. I still go to church often and believe in all religions and respect every one's beliefs and set of values.

నేను చెప్పాలని ప్రయత్నించిదల్లా they have to concentrate on all parts of society not just clinging to one. I am conservative too in certain aspects like abortion issues etc. but that doesn't prevent me from respecting other people's choices.

That said, in a lighter vein, మన తెలుగు బ్లాగుల్లో- తాడేపల్లి గారిని Fox news Bill O'reillyగా, మహేష్ గారిని HBO Bill Maherగా, చదువరి గారిని CNN Wolfblitzerగా ఊహించుకొని చూడండి:-)

P.S: Excuse me for this anglo-telugu commentary as I am at work for the past 48 hrs with 8 more to go:-(

Dr.Pen said...

@Dr.Ram$

Thanks.మీ ఇంటర్వ్యూలు ఎలా సాగుతున్నాయి? Best of Luck!

@Krishna
మీరు చెప్పింది ఆలోచింపదగినదే! Thanks for stopping by.

@Kumar
I am sorry to edit part of your comment. కారణాలు వివరించాలంటే మీ మెయిలు id నాకు తెలియదు, వీలైతే డి.ఆర్.సి.హెచ్.ఐ.ఎన్.టి.హెచ్.యు@జీమెయిల్.కాం కుమెయిలొకటి కొట్టండి.

యోగి said...

"ఆయన ఎన్నిక చారిత్రాత్మకం కాదన్నారు, సరే. సమానత్వమా...హ!హ!హ! అని నవ్వారు, సోషలిస్టు అని నిందించారు(ఏం చేస్తాం ఈ కాలంలో కమ్యూనిస్టు, సోషలిస్టు పచ్చి బూతు పదాలైపోయాయి, ఇక్కడ కాపిటలిస్టుల కోటలు కూలుతున్నా!"

ఒబామా సోషలిస్టు అన్న వాళ్ళలో నేనూ ఒకరిని కాబట్టి ప్రతిస్పందిస్తున్నా(ఇంకెవరన్నా ఉన్నారో లేదో తెలియదు): ఎవరినైనా సోషలిస్టు అని గానీ, కాపిటలిస్టు అనిగానీ లేదా మీరు చెప్పినట్లు కమ్యూనిస్టు అనడం గానీ నింద ఎలా అవుతుందండి? నింద అంటే ఒకరికి లేని గుణాన్ని ఆపాదించడం. మీ వివరణ ఒబామా ఎందుకు సోషలిస్టు కాదో చెప్పి నాలాంటి తెలియనివాళ్ళని సరిదిద్దే విధంగా ఉంటే ఇంకా బాగుండేది.

"ఇక్కడ కాపటలిస్టు ప్రభుత్వాలు కూలుతూ ఉన్నా..." ఈ మధ్య ఆర్థిక సంక్షోభాన్ని దృస్టిలో ఉంచుకుని మాట్లాడుతున్నారా? Is this failure an overwhelming phenomena of the failure of capitalism? is this an established fact in the academia now? I doubt it.

Savings, pension plans, etc have flowed into the hands of rentier capitalists: hedge funds, venture capitalists backed by major financial firms, etc. The whole world economy is, to a great extent, controlled by rentier capitalists.

These rentier capitalists just destruct themselves, a hypothesis that Jan Toporowski has defended in his book "The end of finance. Capital Market inflation, financial derivatives, and pension fund capitalism".

ఇంక రచ్చ విషయానికి వద్దాం. మీ అభిప్రాయాన్ని గౌరవిస్తున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ కామెంట్ చేయడం కూడా "రచ్చ" గా మీరు గానీ, ఇంకెవరు గానీ భావిస్తే, kindly ignore this. Wouldn't make any. difference to me. I am more concerned about issues than people, so its never personal.

On a lighter note, Imagine Panashaala Naresh as Comedy Central Stephen Colbert. :P

Dr.Pen said...

@యోగి...

ఒబామా-సోషలిస్టు: నో కామెంట్!

కాపిటలిస్టు 'కోటలు' అన్నది కంపెనీలనుద్దేశించి, ప్రభుత్వాలనుద్దేశించి కాదు. మీ అభిప్రాయంలో నిజముంది.

స్టీఫెన్ కోల్బేర్! :-) :-) :-) బ్లాగు పేరు 'పానశాల' బదులు 'పాఠశాల' అని పెట్టి ఉంటే ఇంకా నిర్మాణాత్మకంగా ఉండేదేమో? But who ever he is, he is quite a charmer:-){ I bet Mahesh agrees with this assessment}