వయస్సు 33 - మనస్సు 13 ;-)

నేటితో నాకు 33 ఏళ్లు నిండుతాయి. మూడేళ్ల క్రితం 30వ పుట్టినరోజున కళ్లంబడి నీళ్లు వచ్చాయంటే నమ్మండి. అప్పుడే ముఫైయా అని! కానీ 31 నుంచి మళ్లీ మామూలే , ఏమీ అనిపించడం లేదు. వయస్సు శరీరానికి కానీ, మనస్సుకు కాదు కదా. అందుకే ఈ రోజు నా జీవితంలోని మధురానుభూతులను ఓ సారి నెమఱు వేసుకొందామని ఈ టపా. అంతే కాదండోయ్, ఈ టపా నా 200వ టపా కూడా!

జీవితంలో మధురానుభూతులంటే ఖచ్చితంగా ఓ అమ్మాయయినా అందులో ఉంటుంది. మఱీ ఓ అమ్మాయికే పరిమితం చేస్తే బావోదని నాకు పరిచయం ఉన్న స్నేహితురాళ్లకు ఈ టపా కేటాయించాను. ఏమో ఇది చదివి ఒక్కరయినా పలక్కపోతారా అని ఓ చిన్ని ఆశ;-)

నా జీవితంలో మొట్టమొదటి స్నేహితురాలు 'మా అమ్మ'. ఎవరికయినా అంతే అనుకోండి. కానీ చిన్నప్పటి నుంచి మా అమ్మతో నాకు సాన్నిహిత్యం ఎక్కువ. తను ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయిని. నాకు తెలుగంటే తెగని ఆసక్తి కలగడానికి ఆమే ప్రథమ కారణం. పేరు 'నూర్జహాన్'- ఈ ప్రపంచానికే(జహాఁ) వెలుగు(నూర్) అని అర్థం. ఇక రెండో స్నేహితురాలు, నా ముద్దుల చెల్లి 'బుజ్జి' అని ప్రేమగా పిలుచుకొనే 'షబానా'. ఇప్పుడు హై.లో గైనకాలజిస్టు. ఒకటో తరగతి పరీక్ష హాలు...అన్ని ప్రశ్నలకు సమాధానం రాసి, ఓ ప్రశ్న మాత్రం ఖాళీగా ఉంచి దిక్కులు చూస్తున్నాను. ఆ ప్రశ్న P_O_I_E. ఇంతలో నా పక్క వరుసలో ఉన్న అమ్మాయి ఎలా చూసిందో, నేనడగక ముందే పదే పదే తన అట్ట కేసి చూడమని కనుసైగ చేస్తోంది. అట్ట వెనకాల ప్రామిస్ వారి టూత్`పేస్ట్ ప్రకటన. నాకు ఎందుకా ప్రకటన చూపిస్తోందా అని తికమక. మఱి కాసేపైయాక, కాస్త ఆలస్యంగా ఐనా బుర్ర వెలిగింది. పరీక్షలో నూటికి నూఱు. ఆ అమ్మాయి పేరు 'సంధ్య'. చిన్మయా స్కూలులో నా మొదటి స్నేహితురాలు.

రెండో తరగతి క్లాసు రూం...మా మాస్టారు, పెద్దయ్యాక మీరేమి కావాలనుకొంటున్నార్రా? అన్న ప్రశ్నకు ఒక్కరొక్కరు సమాధానం చెబుతూ వస్తున్నారు. నా దాకా వచ్చేసరికి, అప్పడప్పుడే చదువుకొన్న ధృవుడి కథ ప్రభావమేమో తపోదీక్షలో కూర్చొన్నట్లు భంగిమ పెడుతూ, అడవికి పోయి తపస్సు చేసుకోవాలనుకొంటున్నా సార్! అన్నా. పక్కనెక్కడో కిసుక్కున నవ్విన 'మాధవి'. తనకు పేరు రాసుకొనే స్టికర్ లేబుల్లంటే చాలా ఇష్టం, మా అమ్మ ఇచ్చే పావలా దిన బత్తెంతో స్టిక్కర్ల పటం కొని మరీ ఇచ్చేవాన్ని ప్రతిరోజూ. సాయంత్రం పైనాపిల్ బండి వాడి దగ్గర అప్పు షరా మామూలే!

మూడో తరగతి స్కూలు మెట్లెక్కుతూ నేను... వెనకాల 'రాణి జయప్రద'. అప్పీ! (అలానే పిలిచే వాళ్లు మా హిందూపురంలో మఱి:-) నీ షర్టు చినిగింది చూసుకో అంది. నిజమేనేమో అని వెనక్కు తిరిగితే షర్టయితే చినగలేదు కానీ వెనకాల ఆ అమ్మాయి పెన్ను నుంచీ భారీగా ఇంకయితే పడింది. ఆ రోజు ఏప్రిల్ ఫూల్స్ డే మరి. మా ఇంటికి అప్పుడప్పుడూ వచ్చేది కూడా. ఆ మరుసటి సంవత్సరమే వేరే ఊరికి ట్రాన్స్`ఫర్ అయి వెళ్లిపోయారు.

నాలుగో తరగతి క్లాసు మొత్తం ఛాయాచిత్రం కోసం... ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నేను బుద్ధిమంతుడిలా రెండు చేతులు కట్టి కెమెరా వైపే తదేకంగా చూస్తూ కూర్చొన్నాను. ఇ'స్మైల్' అంటూ ఫోటోగ్రాఫర్ కెమెరా క్లిక్కుమనిపించాడు. తరువాతెప్పుడో వచ్చిన ఫోటో చూస్తే నా పక్కనే 'సునీత'. మా ఊరు పక్కనే ఉన్న పల్లె నుంచీ రోజూ వచ్చేది. కొద్ది రోజుల్లోనే క్లోజు ఫ్రెండ్సు అయిపోయాం. ఆ తరువాత తొమ్మిదో తరగతిలో అమెరికా వెళ్లి వచ్చిందని ఊర్లో భలే క్రేజు.

ఐదో తరగతి అమరాపురంలో భగవద్గీత పోటీలు... ఎంతో కష్టపడి "ఏవం సతతయుక్తాయే..." అంటూ బట్టీయం వేసిన ద్వాదశోధ్యాయాన్ని అప్పజెప్పి, ఓ చిన్నపాటి కప్పు గెలుచుకొని అర్థరాత్రి మా ఊరికి తిరుగు ప్రయాణం చేస్తున్నాం. బస్సులో నా పక్కనే పెద్ద చిన్మయా స్కూలు నుంచి 'బృంద'. ఆ మాటా ఈ మాటా కలిసింది. తరువాత ఆరో తరగతి నుంచి ఇంటరు వరకు నా స్నేహితురాలు కం. పోటీదారు.

ఆరో తరగతి సాంఘిక శాస్త్రం క్లాసు... మొదటి బెంచీలో ఉన్న నేను, అస్లం గాన్ని బ్రతిమాలి బామాలి చివరి బెంచీలోని వాడి సీటుకు మారి, పక్కనే ఉన్న రెండు జళ్ల 'కళ్యాణి'తో బాతాఖానీ మొదలు పెట్టాను. చూడనే చూసింది మా ఆడ మేడమ్ రాక్షసి, ఇద్దరినీ ఆ రోజంతా నిలబెట్టింది. అప్పుడు ముఖం ముడుచుకొన్నా, తన చిన్నప్పటి ఫోటోలను బహుమతిగా ఇచ్చి నాకు మరో మంచి స్నేహితురాలయ్యింది కళ్యాణి.

ఏడో తరగతి డిసెంబరు 24... స్కూలు నుంచి ఇంటికి వెళుతూంటే ఆపి మరీ గ్రీటింగ్ కార్డిచ్చి వెళ్లాడు అనిల్. వీడికింత అభిమానమేమిటా అని తీసి చూస్తే ఎన్నో రోజులుగా ప్రాణాలుగ్గ బట్టి ఎదురుచూస్తోన్న 'పసివాడి ప్రాణం'లో మా చిరంజీవి ఛాయాచిత్రంతో ఉన్న గ్రీటింగ్ కార్డు. వెనకాల 'హ్యాపీ బర్త్ డే- ఇస్మాయిల్'...అంటూ 'మంజుల'. ఆ రోజుల్లో మేము తయారు చేస్తున్న చిరు రికార్డు పుస్తకానికి ( అంటే ఏం లేదు ఓ నోటు పుస్తకంలో చిరు గ్రీటింగు కార్డులతికించడం, వాటి పైన ఏవో రంగు రంగుల కోడి ఈకలు పెట్టి సరదా పడడం) ఆ ఫోటో ఇమ్మంటే ససేమిరా అన్న అమ్మాయి, నా పుట్టినరోజు అందమైన సర్`ప్రై జు ఇచ్చింది. స్నే. జాబితాలో మరో ఖాతా.

ఎనిమిదో తరగతి కొత్త పాఠశాలలో...అందరూ కొత్తవారే. దిక్కులు చూస్తూన్న నన్ను మీ పేరు 'ఇస్మాయిలా?' అని పలకరించింది ఓ కొత్త గొంతు. పేరు 'నాగవేణి'. మా హిందీ టీచరు కూతురు. కొద్ది రోజుల్లోనే నాకు అత్యంత ఆప్తురాలయిపోయింది. నా చెల్లి తర్వాత అంతగా నన్ను ఇష్టపడే వ్యక్తి వేణీయే. ప్రతి రాఖీ పండక్కి ఎక్కడున్నా నాకు రాఖీ పంపేది. పెళ్లయ్యాక సంసారంలో పడి మరచిపోయినట్టుంది. అలాగే ' భానురేఖ', 'ప్రశాంతి' కూడా.

తొమ్మిదో తరగతి మళ్లీ మా క్లాసు రూము... కొత్తగా బిడియ పడుతూ ఓ అమ్మాయి అడుగుపెట్టింది. చూడగానే ఏదో తెలియని కొత్త భావం. క్లాసు లీడరుగా నేనే స్కూలంతా తిప్పి చూపాను. పేరు 'పల్లవి'. నాకు తెలియకుండానే అప్పుడప్పుడూ 'పల్లవించవా నా గుండెలో, పల్లవి కావా నా పాటలో' అని పాటలు పాడేసుకొంటూండే వాన్ని. వేణి, భాను, పల్లవి,నేను మధ్యాహ్నం కలిసే భోం చేసే వాళ్లం. తరువాత ఇంటరులో వాళ్ల నాన్న మా కెమిస్ట్రి మేస్టారు.

పదో తరగతి స్కూలు ఆవరణ... అర మార్కుకీ, కాలు(1/4) మార్కుకీ సిగపట్లు పట్టే మా 'డి.డి శ్రీవిద్య' కుంటుకొంటూ నడుస్తోంది. కారణం అరకాలిలో గుచ్చుకొన్న ముల్లు అని డయాగ్నోస్ చేసేసి, తనతోనే శస్త్రచికిత్సకై పిన్నీసుని బదులు తీసుకొని, విజయవంతంగా ముల్లు బయటకు తీసి ఆపరేషన్ సక్సెస్ చేసాను. అప్పటి నుంచీ చదువులో సై అంటే సై అనే శ్రీవిద్య బయట మాత్రం నేనంటే చాలా అభిమానం చూపేది. అలాగే నేనంటే ఉడుక్కొనే 'అపర్ణ', కళ్లెగరేసే 'శైలజ', ఇంటి దగ్గర 'చిట్టి'...వగైరా వగైరా, అబ్బో పదో తరగతంటేనే అంతేనేమో?

ఇంటరు ఎంటరయిన తరువాత ఒక్కసారిగా ప్రశాంతంగా నడుస్తున్న నా జీవితం అల్లకల్లోలంగా మారింది. కారణం తొలిసారిగా ప్రేమలో పడ్డం. అదే సమయంలో మా ఊరి నుంచి నిమ్మకూరు వెళ్లడం, నీళ్ల నుంచి బయట పడ్డ చేపలా అయ్యింది నా పరిస్థితి. గోడకు కొట్టిన బంతిలా వెంటనే తిరిగొచ్చాను పది రోజులకే. ఇక రెండు సంవత్సరాలు ఎలా గడిచాయో తెలియదు, అదే సమయంలో 'కుముద', 'హేమ' అని ఇద్దరు అక్కచెల్లెళ్లు మా కాలేజీలో ఎంసెట్ కోసమని చేరారు. నాకు అక్క లేని లోటు తీర్ఛారు. నేనంటే పంచ ప్రాణాలు వాళ్లకప్పుడు.

మెడికల్ కాలేజీ మెట్లెక్కినా మనస్సంతా హిందూపురంలో... అలా ఓ రోజు ఎవరికీ తెలియకుండా ఊరెళితే బయటపడ్డ దారుణమైన నిజం, వేరే అబ్బాయితో 'ఆ' అమ్మాయి కనబడ్డం, వారి మధ్య లేఖలన్నీ చదవడం. మనస్సు వేయి కాకపోయినా కొన్ని ముక్కలయ్యింది:-( మరీ దేవదాసు కాకపోయినా ఓ రేంజిలో భగ్న ప్రేమికుడిగా అనుభవం సంపాదించాను. అలా కొన్ని సంవత్సరాలు గడిచాక ఉన్నట్టుండి ఓ రోజు కాలేజీలో మా మరదలి స్నేహితురాలు పరిచయం అయ్యింది. మాటా మాటా కలిసింది, రోజూ నిముషాలతో మొదలయిన మాటలు, గంటల వరకూ వెళ్లాయి. ఇప్పుడిలా చెబుతున్నట్టే ఇంకా వివరంగా నా జీవితాన్నంతా పూసగుచ్చినట్లు ఆ కొన్ని రోజుల్లో చెప్పేశాను. ఎందుకు చెప్పానో తెలియదు. తను కూడా నాతో అంతే స్నేహంగా మసలుకొంది. యండమూరి ని, తిలక్ ను చదివిన ప్రభావమేమో కవితలు, లేఖలు, పాటలు (క్యాసెట్టుల్లో) బాగా నడిచాయి ఇద్దరి మధ్య.

దక్షిణ షిర్డీ, 1998. కర్నూలులోని సాయిబాబా ఆలయం గుడి మెట్లు... నేను, తను. కొబ్బరి చిప్పలు పగులకొడుతూ 'నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకొంటున్నాను" అని సిన్సియర్`గా అడిగేసాను. అంత ఆకస్మాత్తుగా అడిగే సరికి తనకి ఏం చెప్పాలో తోచలేదు. ఏం ఫర్లేదు బాగా ఆలోచించుకొని నీకు నచ్చితే రేపు కాలేజీకి నాకు నచ్చిన కలువ పూవులున్న ఆ నల్లంచుల తెల్లచీర కట్టుకొని రా అన్నాను.(చినేమాల ప్రభావం ఎక్కువ కదా మఱి;-) ఆ పదుకొండు గంటలు కొన్ని యుగాల్లా గడిచాయి. ఆ తర్వాత ఇంకేముంది, మీకు తెలిసిందే... ఉదయం హృదయం ఉప్పొంగే సంతోషంతో నేను. ఆ మరుసటి ఏడాదికే నా రాణి అయ్యింది ఈ 'సుధారాణి' :-) ఇక మళ్లీ 'గర్ల్ ఫ్రెండ్స్' అంటూ తిరక్కుండా చేసేందుకేమో అందర్నీ మించిన ది బెస్ట్ గర్ల్ ఫ్రెండ్`ని ఇచ్చింది. ఆ ముద్దుల, మురిపాల ముద్దుగుమ్మే ఈ 'సుహానీ శ్రేయ పెనుకొండ', మై స్వీటెస్ట్ 'హనీ'!

38 comments:

నేస్తం said...

super...undi mee ammayi... chaalaa baagaa cheppaaru mee jnapakaalu :)

జ్యోతి said...

పుట్టినరోజు శుభాకాంక్షలు సోదరా!
Happy Birthday Brother !
जन्म दिन मुबारक हॊ भय्या !
ఐనా ఇది పెళ్లా(ళ్లీ)డు వయస్సు. వా!! అంటే ఎలా. ఎంజాయ్.. వామ్మో! ఎంతమంది గర్ల్ ఫ్రెండ్సో?? చెప్పనివారు ఎంతమందో??కాని హనీకంటే అందమైన అమ్మాయి ఉండదు..

జ్యోతి said...

200వ టపా శుబాకాంక్షలు..

cbrao said...

Happy birthday.

మాగంటి వంశీ మోహన్ said...

హార్దిక జన్మదిన శుభాకాంక్షలు ఇస్మాయిల్ గారు...ఆ బ్లాక్ అండ్ వైట్ ఫోటో చూస్తూ అలా మా అమ్మమ్మగారి ఊర్లోకి ఒక పదిసార్లు వెళ్ళి వచ్చాను...

మీరు మూడేళ్ల క్రితం ఏడిచింది, నేను ఇంకా రెండేళ్లలో వచ్చే నలభైకి ఏడ్వాలేమో....:)..:)....just kidding...అయినా సంవత్సరాలు ఎన్ని వచ్చాయన్నది కాకుండా అందులో అసలు సిసలు జీవితం ఎంత గడిపాం అన్నది ముఖ్యం కాబట్టి...ఇంతే సంగతులు చిత్తగించవలెను...

మళ్ళీ శుభాకాంక్షలతో

Anonymous said...

బావుంది మీ "ఆటోగ్రాఫ్.."

అయితే, మీ అసలు పేరు కృష్ణన్నమాట. దేవరాయలు తరవాత చేర్చుకున్నట్టున్నారు.

ఒకమాట చెప్పనా.. ఇహనిలాంటి టపాలు రాయడం ఆపాలి మీరు. ఎంచేతంటే, ఇప్పుటికింకా నా వయస్సు ముప్పైమూడేళ్ళే అంటూ మీరు పాడుతూంటే నాబోంట్లకు అసౌకర్యంగా ఉంటమే గాకుండా, ఇప్పుడు నా వయస్సు యా...భయ్యేళ్ళూ.. అనే పాట గుర్తుకొస్తుంది. :)

-శుభాకాంక్షలతో

సిరిసిరిమువ్వ said...

జన్మదిన శుభాకాంక్షలు. ఔరా ఎంతమంది ఆడస్నేహితులు! కృష్ణలీలలు చాలానే ఉన్నాయి మీ దగ్గర! సుహానీ చాలా ముద్దుగా ఉంది. మీ రాణి ఫోటో కూడా పెడితే చూసి సంతోషించేవాళ్లం కదా.

అలాగే మీ 200వ టపాకి అభినందనలు!

సుజాత వేల్పూరి said...

మీ అందరు స్నేహితుల్లోకీ సుహానీ కే నా వోటు!

రానారె said...

శుభాకాంక్షలు.

కానీ 31 నుంచి మళ్లీ మామూలే , ఏమీ అనిపించడం లేదు. వయస్సు శరీరానికి కానీ, మనస్సుకు కాదు కదా.

:-) డాక్టరుగారు బాగా రాటుదేలిపోయినారు.

Sujata M said...
This comment has been removed by the author.
Sujata M said...

Congratulations for winning over Sudha garu. Best wishes for u, sudha garu and ur daughter suhani. I wish u a very very happy birthday sir. Congrats for ur 200th post too. Very lovely post.

Rajendra Devarapalli said...

కాస్త పొడుగాటి వ్యాఖ్య రాయటానికి ముందుగా...చదువరి గారు,అసలేం రాయకూడదొ ఆది రాసి మళ్ళా పాటంటారా??

Dr.Pen said...

మీ అందరి శుభాకాంక్షలతో ఈ రోజు ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. You all are like a family to me.
@నేస్తం, జ్యోతక్క, రావుగారు, వంశీ గారు: నెనర్లు.
@చదువరి...ఎంతైనా 'ప్రవరాఖ్యుల' ముందు మేమెంత?;-)
'ఇప్పటికింకా నా వయస్సు ముఫైమూడేళ్లే...'అంటూ పాటతో భలే నవ్వించారు.
@సిసిము గారు...రాణి గారిని ప్రవేశపెట్టాం:-)
@సుజాత స్క్వేర్...నెనర్లు.
@రానారె...In front there is crocodile festival:-)

నేస్తం said...

made for each other ante meerenemo anipistundandi.. disti tagulutundi jagarta :)

Purnima said...

హార్దిక జన్మదిన శుభాకాంక్షలు! :-)

Burri said...

హార్దిక జన్మదిన శుభాకాంక్షలు ఇస్మాయిల్ గారు... మీ ఆటోగ్రాఫ్ చాలా బావుంది.

Rajendra Devarapalli said...

మొదట జన్మదినశుభాకాంక్షలు.సుహానీకి మా అందరి ముద్దులు(మొన్న ఫేస్ బుక్ లో హాయ్ చెప్పాక కూడా).ఒకరకంగా చాలా మందికి అసూయకలిగిస్తున్నారు,ఈ టపాతో:)బాల్యమంటేనే ఒకమరకతమాణిక్యాల గని అయితే,అందులో ఉన్నతపాఠశాల అసలుసిసలు వజ్రాల విభాగం.ప్రతి తరగతిలోనూ మీకు మంచి మిత్రులే దొరికారు.హైస్కూలు మరియు అమ్మాయిలు అన్న అంశం మీద పదివేల పంక్తులకు మించని వ్యాసం రాయమంటే మీదే మొదటి బహుమతి అన్నట్లుంది మీ అనుభవాల ధార.మీ సంస్కారం,విజయాల వెనుక మీ తల్లిగారి శ్రీమతి గారి మరియు చిన్నారి సుహానీ ల పాత్రను నేను తరచూ అంచనా కడ్తుంటాను.ప్రపంచానికి ఒక బాధ్యతగల,బాధ్యత్లు తెలిసిన పౌరుడిగా తీర్చిదిద్దిన మీతల్లితండ్రులకు నా నమస్కారాలు తెలియజెయ్యండి.
ముప్ఫయ్ అంటూ ఒకంకె వచ్చి మీదబడ్డ రోజున కొన్ని క్షణాలు మనసెందుకో ఒకరకమైన ఉద్విగ్నతకు లోనయ్యింది నాక్కూడా,మరలా మామూలే.
వంశీ గారు:)
నా తరపున ఈ వీడియో యూ...ట్యూ...బ్ వారి సౌజన్యంతో
http://in.youtube.com/watch?v=glNjsOHiBYs
బీటిల్స్ బృందమాలపించిన అరుదైన,32క్షణాల శుభాకాంక్షల గీతం.

krishna rao jallipalli said...

అందమైన మీ బాల్యాన్ని మరింత అందంగా PRESENT చేసినందుకు ఆనందంగా ఉంది.

రాధిక said...

హార్దిక జన్మదిన శుభాకాంక్షలు

రవి వైజాసత్య said...

ఇస్మాయిల్ భాయ్, జన్మదిన శుభాకాంక్షలు. ముప్పై మూడంటే ఇప్పుడే జీవితం ప్రారంభమౌతున్నట్టు. హిహిహి

KumarN said...

Boy.. she is a charmer.
By the way, how did you manage such a cutie Ismail?

బాబోయ్, ఎంతమంది అమ్మాయిలో!! కుళ్లేస్తోంది. నా జీవితమంతా మామూలు ఎడారి కాదు, ఆఫ్రికా ఎడారి అని ఇప్పుడర్ధమవుతోంది. ఉన్న ఇద్దరు ముగ్గిరి పేర్లు కూడా అస్సలు గుర్తు లేవు.

And to echo Devarapalli's comments..Pass on my salutes to your parents. A lot of credit goes to them for sure.

నాకు ఇరవై పెద్ద షాక్,మొట్టమొదటి సారిగా పెద్దవాణ్ణి అన్న ఫీలింగ్ వచ్చింది అప్పుడే. ముప్పై కూడా అంతే..కాని ఇప్పుడనిపిస్తోంది..నలభై నిజంగా పెద్ద వయసేమో అని. :-)

సుజాత వేల్పూరి said...

మగవాళ్ళు మీరే 'ముప్ఫై" రాగానే ఉద్విగ్నతకు లోనైతే మా సంగతి ఏమిటి ఆలోచించండి కొంచెం? ఎంత బాధ, వేదన...నిర్లిప్తత(చివరికి నాక్కూడా ముప్ఫై రావాల్సిందేనా అని) ..ప్చ్"! అందుకే మల్లాది అనుకుంటా ఒక చోట చెప్పాడు..."స్త్రీలు 29 నుంచి 30 లోకి రావడానికి ఆరేడేళ్ళు పడుతుంది" అని!

KumarN said...

భలే సుజాత గారూ, ఆ కోట్ బావుంది.
నేను కూడా ముప్పైల్లోంచి, నలభైల్లోకి వెళ్ళెప్పుడు అదే సూత్రం పాటించాలన్న మహత్తరమయిన అవుడియానిచ్చారు. గుర్తుంచుకొంటాను.

కానీ, ఇక్కడే దేవుడు ఆడవాళ్ళ పక్షపాతాన ఉండడం నాకస్సలు సహించని విషయం. మీకేమో జుట్టు ఊడదు కాబట్టి, ఓ నాలుగేళ్ళు అదే వయసు చెప్పినా చెల్తుంది. మాలాంటి వాళ్ళకి "జుట్టు" సహకరించదే :-)

సుజాత వేల్పూరి said...

కుమార్ గారు, దానికేం చెయ్యలేమండి! కానీ ఒక చిన్న కన్సెషనుంది. వయసు విషయం మర్చిపోయి బట్టతల మేధావులకే వస్తుంది అని భీష్మించుక్కూచుంటే సరి! (అప్పుడు "మేధావులక్కూడా బట్టతల వస్తుందేమో కానీ బట్ట తల ఉన్న వాళ్లంతా మేధావులు కాదు లెండి" అని రంగనాయకమ్మ గారి టైపులో ఎవరైనా వాదిస్తే కొత్త పాయింట్ వెదుక్కోవాలి)

Unknown said...

ఇన్నాళ్ళుగా వెతుకుతున్న నా గర్ల్‌ఫ్రెండు దొరికింది మీ సుహానీ రూపంలో ;-)

మొత్తానికి ముప్ఫై మూడేళ్ళు శ్రీ కృష్ణావతారం బాగానే ఎత్తారు. ఎప్పటికీ ఇలాగే "ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే" అనే అమ్మాయిలతో జల్సా చెయ్యగలరు :P

నిన్నే కామెంటాను కానీ మీ బ్లాగులో కనిపించదేంటి చెప్మా!

ఏకాంతపు దిలీప్ said...

ఇస్మాయిలు గారు, కొంచెం ఆలస్యంగా అయినా, మీకు మీ కొత్త సంవత్సరానికి శుభాకాంక్షలు... ఈ ముప్పై నాలుగో యేట మీరు అనుకున్నవి నెరవేర్చుకోవాలని కోరుకుంటున్నాను... మాతో ఇలా మరిన్ని రోజులు పంచుకోవాలని....

Bolloju Baba said...

210

శ్రేష్టత్వం ఒంటరిగా రాదు
సపరివార సమేతంగా విచ్చేస్తుంది.
tagore stray birds

పై పద్య తాత్పర్యం మీకు, మీ కుటుంబానికీ, మీ పాపాయికీ, మీ పోస్టులకూ వర్తిస్తుంది.
అభినందనలతో
బొల్లోజు బాబా

rākeśvara said...

నాకు ఏమి వ్రాయాలో తెలియట్లేదు గాని కంట నీళ్ళు మాత్రం తిఱిగాయి. మీ టపా హ్యాపీ డేస్ సినిమాలావుంది.

Dr.Pen said...

@నేస్తం...మీ దిష్టే తగిలేట్లుంది. పరిహారం ఓ దోసెడు జాజిపూలు:-)
@పూర్ణిమ, మరమరాలు...థాంక్యూ!
@దేవరపల్లి గారు...మిమ్మల్ని మా సుహానీ అక్కడే 'బాబాయ్' అంది. గమనించారా? సో మీరు ఇంకా ముఫైయేనన్నమాట, దిగుల్లేదు. అన్నట్టు మీ నమస్కారాలు అందజేసాను, ప్రతినమస్కారాలను స్వీకరించండి. I really enjoyed watching that video. Thanks for making my day special.
@రవి వైజాసత్య...నవ్వండి, నవ్వండి ఎంత కాలం నవ్వుతారు. ఆ మూడు పడ్డాయిగా,"ముందుంది...."
@రాధిక, కృష్ణారావు గారు...నెనర్లు!
@సుజాత గారు...మొత్తానికి మా కుమార్ గారిని 'మేధావి'ని చేశారు:-)
@కుమార్ గారు..."ఉందిలే మంచి కాలం ముందు ముందున..."
@ఏకాంతపు దిలీప్...తప్పకుండా! థాంక్స్.
@ప్రవీణ్...ఆహా! నీలాంటి అల్లుడు వస్తే ఏ మామకయినా సంతోషమేగా:-) హతవిధీ! అప్పుడే 'మామ' అనిపించుకోవాల్సి వస్తోంది.
@బాబా గారు...ఠాగూర్ 'గీతాంజలి'కి చలం అనువాదం చదివినంత ఆనందం వేసింది మీ వ్యాఖ్య చదివి. మీ ఆశీస్సులకు శిరస్సు వంచి ప్రణమిల్లడం తప్ప ఏం చేయగలను?
@రాకేశ్వర...మీ కంట కన్నీరా? ప.రా.క్షే.ల మనస్సు కరగిపోగలదు:-) మనలో మన మాట, పెళ్లి ఎన్ని కష్టాలు తెస్తుందో ఓ చిన్న ఉదాహరణ చెబుతాను- పెళ్లయిన మూడు నెలలకే ఓ ముఫై మంది పరశురామక్షేత్రాంగనల మధ్య లెక్చరర్ అవతారం, హౌస్ సర్జన్సీలో మూడు వందల ప.రా.క్షే.ల మధ్య కొత్త డాక్టర్ ఉద్యోగం చేస్తూ, కళ్లెత్తకుండా గడిపానంటే మీరు నమ్మగలరా? మరోసారి మీ కంట కన్నీరొలకడం ఖాయం:-) అప్పటికీ చెబుతూనే ఉన్నా మన రానారెకి (చూ.@రానారె వ్యాఖ్య)అయినా పెళ్లికి సిద్ధమయ్యాడు. ఇక ఆ 'మనిషి' కాస్తా 'మని'+'షి' కావడం తథ్యం!

Anonymous said...

ఇస్మాయిల్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ౩౩ పెద్ద వయసేమీ కాదులెండి.

(సరదాగా) అయినా ఈ సందర్భంగా శుభాకాంక్షలు చెప్పాల్సింది మీక్కాదు, మీ శ్రీమతిగారికి అనుకుంటా. భర్తలకి వయసు మళ్ళేకొద్దీ భార్యలకి మానసిక భద్రత పెరుగుతుంది.

Anonymous said...

గమనిక : ఎల్.బి.ఎస్. అనగా తాడేపల్లి

వేణూశ్రీకాంత్ said...

హార్ధిక జన్మదిన శుభాకాంక్షలు ఇస్మాయిల్ గారు, కాస్త ఆలస్యంగా :-)
టపా చాలా బాగుంది.

మెహెర్ said...
This comment has been removed by the author.
teresa said...

smail bhai,
Hope you had a wonderful B'day. Many happier returns!
Suhani is just too cute :)
All the pictures are lovely.

Dr.Pen said...

@తాడేపల్లి: మీ ఆశీర్వచనానికి నెనర్లు. మీరు సరదాగా చెప్పినా అది అక్షరాలా నిజం:-) గురువు గారూ ఆకస్మాత్తుగా ఈ పేరు మార్పేమిటి? సంఖ్యాశాస్త్రమా?:-) ఇప్పుడే తెలిసిన ఇంకో విషయం- 'మహానటి' సావిత్రి పుట్టింది గుంటూరు/తెనాలి దగ్గర 'తాడేపల్లి'లో అట. మీ స్వగ్రామమూ/మీ పూర్వీకుల స్వగ్రామమూ అదేనా? అన్నట్టు మా శ్రీమతి పుట్టింది తెనాలిలో వారి మాతామహుల ఇంట!

@ శ్రీకాంత్: నెనర్లు.

@ఫణీంద్ర: దిష్టి తీయాల్సిందేనా? సరే! నాకు మఱి మీ టపాలు ఈర్ష్య కలిగిస్తాయెందుకో?:-)

@teresa: Thank you Madam. మీతో పరిచయ భాగ్యం కల్పించరూ? నా మెయిలుకు ఓ వేగు పంపండి ప్లీజ్! drchinthu @ జీమెయిల్.కాం

Dr.Pen said...

చదివి .. నా ఎడమ కంటి కొలుకులో ఒక కన్నీటి చుక్క.
simply beautiful.- కొత్తపాళీ.

@గురువు గారు... " " ఇంతకంటే ఏం చెప్పను. నెనర్లు!

యోగి said...

జన్మదిన సుభాకాంక్షలండీ :)

teresa said...

వేగు పంపాను.