"ఇప్పుడు మీరు గెలిచివున్నా ఆ సంతోషం రేపు మీరు గెలిచినప్పటి సంతోషానికి ధీటు రాదు.ఈ ఓటమి రేపటి విజయానికి గొప్ప మెట్టు.--ప్రసాద్" మార్చి 16, 2007. ఈ మాటలు అక్షరసత్యాలయ్యాయి ఈ రోజు.
నేను మ్యాచయ్యానోచ్!!! అసలు ఈ మ్యాచు గొడవ తెలియని వారి కోసం విపులంగా మరో టపాలో. ప్రస్తుతానికి కష్టసాధ్యమైన ఈ అంచెను అధిగమించి విజయం సాధించానని సవినయంగా తెలియజేసుకొంటున్నాను. మరి టపా శీర్షికలో వినయం లోపించిందే అనేది మీ ప్రశ్నైతే, అడగవలసింది నన్ను కాదు...ఈ నవ్వుల ఱేడును.
అసలు ఈ వైపంటూ రాకుండా ఉన్నా, ఠంచనుగా కూడలికి వస్తున్నా. ఈ సందర్భంగా అసలు దొరకకుండా తప్పించుకొని తిరుగుతున్నందుకు సాలభంజికల ఫణీంద్రుల వారికీ, కొత్తపాళీ పెద్దనామాత్యులకు బ్లాగు ముఖంగా నా క్షమాపణలు. పోయినేడు భుజం తట్టిన అందరికీ నెనర్లు. మళ్లీ వివరంగా ... తొందర్లోనే (పేరుకు పోయిన టపాలు బోలెడున్నాయి మరి:-) అంత వరకూ ... మీ ఇస్మాయిల్ పెనుకొండ ఎం.డి.
16 comments:
Hearty Congratulations!
CONGRATULATIONS BROTHER...
విజయీభవ!!! దిగ్విజయీభవ!!.......
శుభాకాంక్షలు డాక్టరుగారూ!
Congratulations! Good to hear this.
అభినందనలు!
చాలా సంతోషకరమయిన వార్త.
శుభాకాంక్షలు.
congratulations!! what specialty are you in?
శుభకామనలు.
డాటరు గారు మళ్ళీ సూది లోకి మందెక్కించినందుకు శుభాకాంక్షలు. మరి మాకందరికి మందెప్పుడు పోయిస్తారు?
-- విహారి
Boss...Congratulations!!!!
శుభాకాంక్షలు అందచేసిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇక ఆ మరో మజిలీ లూసియానా రాష్ట్రంలోని అలెగ్జాండ్రియా. రానారె...ఇక హ్యూస్టన్ నాకు మూడు గంటలే:-)టెరెసా గారు...ఫ్యామిలీ మెడిసిన్. అప్పుడే బ్లాగు మిత్రుల నుంచి సూచనలు-సలహాలు కోరుతూ ఈ-లేఖలందుతున్నాయి. మూడేళ్ల తర్వాత తెలుగు బ్లాగు కుటుంబ వైద్యునిగా అవతారమెత్తాలి.
విహారీ...ఆ మందు పోయిస్తా... మొదట సూది మందు వేసుకో-అసలే చాలా మంది తమ పొట్ట నొప్పికి కారణం నీవేనంటూ ఫిర్యాదు చేస్తున్నారు.నీకు సూది వేస్తే వారి నొప్పి తగ్గుతుందట:-)మరోసారి అందరికీ నెనర్లు.-డా.స్మైల్
>> రానారె...ఇక హ్యూస్టన్ నాకు మూడు గంటలే:-)
మరి నాకు అలెగ్జాండ్రియా ఎన్ని గంటలో!? ;-)
మరోసారి మీకు శుభాకాంక్షలు. :)
రాయలవారికి శుభాభినందనలు.
Belated Shubhakankshalu
ముందుగా కృష్ణ దేవరాయలు వారికి హార్దిక శుభాకాంక్షలు రెసిడెన్సి లో చేరపోతున్నందుకు..చాలా ఆలస్యము గా మీ గురించి తెలుసుకున్నందుకు క్షంతవ్యుడిని..అయ్యా రాయలు వారు, నా నామ ధేయము డా"రాంబాబు. టి..నిన్న విహారి గారి అమెరికా బ్లాగర్ల సమావేశము గురించి చదువుతుంటే, మీ పరిచయ బాగ్యము కలిగి..ఈ బ్లాగ్గుంపు లో అహొ మన వ్యైద్యులు ఇంకొకరు వున్నారు అని తెలుసుకోగలిగాను..చాలా సంతోషము వేసినది..మీరు ఈ బ్లాగ్ప్రపంచము లో కూడా నా కన్న పెద్ద వారే..నా బ్లాగు ని ఒక సారి పరికించగలరు.. www.drrams.wordpress.com
మీ తెలుగు సాహిత్యము చూసి నాకు సంతొషము వేసింది..ముఖ్యము గా చిరంజీవి గారి ని రాజకీయాలలోకి అహ్వానిస్తూ భగవద్గీత సారాంశము వివరిస్తూ..మీరు రాసిన టపా చూస్తే, మీరు డాక్టరు గారు అంటే నమ్మలేక పోయాను, మీ ఈ మాచ్ అయ్యనో అన్న టపా చూసే వరకు..మీ తెలుగు సాహిత్య అభిరుచి ని ప్రశంసించడానికి నా వయస్సు(చంటోడి ని కదా) అడ్డు వస్తుంది..
ఇక నా గురించి నేను నా అమెరికా ప్రయాణాని 2005 లో మొదలు పెట్టాను..బుష్ గాడు ఇంత వరకు కనికరించ లేదు..ఇంకా మాతృ దేశము లో నే వుంటిని..అతి త్వరలో step 2 రాయపోతున్నాను..తరువాత బుష్ గారి దర్శన బాగ్యానికి ప్రయత్నిద్దము అని చూస్తున్నాను..ఇదీ సంగతి..!! మీకు మరొక్క మారు శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ శెలవు తీసుకుంటున్నాను..
Post a Comment