ప్రియ వసంతమా...!


అతడు:

ప్రియ వసంతమా!

ఎందుకిలా వేధిస్తావు...

తొందరగా రావూ...!

ఏం మాయ చేశావో కానీ...

నా ప్రేమ రాగాన్ని మీటావు.

ఆమె:

ఎందుకిలా వేధిస్తావు...

ప్రియ వసంతమా...తొందరగా రావూ...!

అతడు:

ఈ మేఘచాపం....

రెపరెపలలాడుతూన్న భూదేవి కొంగు సింగారం.

ఈ ఆకులూ, ఈ పొదలూ...

ఎంత అలజడి రేపుతున్నాయో నా మదిలో.

ఊగిసలాడుతున్న నా మనస్సుకు...

ఏం చెప్పాలో తెలియకున్నది.

ఆమె:

నా మదీ వినకున్నది...

నీ దాన్ని నేనే నన్నది.

ఎందుకిలా వేధిస్తావు...తొందరగా రావూ...!

రాబోయే కలలన్నీ...కనురెప్పల మీద కూర్చొన్నాయి...

గుండె ముళ్లన్నీ విప్పుకొన్నాయి...మదిలో ప్రేమ భావనలు పురివిప్పాయి!

సప్తవర్ణాల స్వప్నాలు స్వాగతిస్తున్నాయి...

ఎందుకిలా వేధిస్తావు...తొందరగా రావూ...!

అతడు:

ఏం మాయ చేశావో కానీ...నా ప్రేమ రాగాన్ని మీటావు...

ప్రియ వసంతమా! ఎందుకలా వేధిస్తావు...త్వరగా రావూ...!

ఆమె:

అవును...ఎందుకలా వేధిస్తావు...తొందరగా రావూ...!!!

గానం: ఉస్తాద్ సుల్తాన్ ఖాన్ & చిత్ర.

తెలుగు బ్లాగులో హిందుస్థానీ పాటేమిటని ఆశ్చర్యపోతున్నారా? నాకెంతో ఇష్టమైన పాట ఇది. అవడానికి హిందీ లలిత సంగీతమైనా, సంగీతానికి భాష లేదు కదా! అందుకే ఇలా. అన్నట్టు నాకు తోచినంతలో పాట సాహిత్యాన్ని తెలుగులో అనువదించాను కానీ...అసలు భావం పాట వింటే మీకే తేలిగ్గా అర్థమవుతుంది (కల్హర గారో, రాధిక గారో నిజమైన కవిత రూపంలో అనువదిస్తే ఇంకా బావుంటుంది). 'చిత్ర' గాన మాధుర్యం, 'ఉస్తాద్' మంద్ర గంభీర కంఠం, కంటికింపైన పచ్చని ప్రకృతి, గాఢమైన నీలిమ, అమాయక పుష్ప సౌందర్యం, అన్నిటికీ మించి 'నౌహీద్ సైరస్' భీత హరిణేక్షణ చూపులూ, కంటి విరుపులు, నొసటి నాట్యాలూ, ఓహ్...ఇవన్నీ ఈ పాటకు వన్నెలద్దాయి. చూసి, విని, అనుభవించి...పలవరించండి! - బ్లాగర్లకందరికీ బక్రీదు శుభాకాంక్షలు.

4 comments:

వికటకవి said...

చాలా మంచి పాట పరిచయం చేసారు. ధన్యవాదాలు. మీ అనువాదం కూడా బాగుంది. ఎప్పుడో, నస్రత్ ఫతే ఆలీఖాన్ "పియారే పియారే..." విన్నాను. మళ్ళీ ఆ స్థాయిలో బాగుంది.

వికటకవి
http://sreenyvas.wordpress.com

రానారె said...

డాక్టర్, అనువాదం చాలా చాలా బాగుంది. ఇదివరకూ విన్నాను గానీ అర్థం తెలియడంతో ఇప్పుడు ఇంకా బాగా ఆస్వాదించాను. ఈ పాటమధ్యలో నుస్రత్ ఫతేఅలీ ఖఆన్ గారి ... "సాధియాఁ... బేలియాఁ..." పాటలో వచ్చే 'తెరె బిన్ నై జీనా మర్ జానా ....' వరుస వినవస్తుంది గమనించారా? పండుగ శుభాకాంక్షలు.

Aruna said...

నేను ఇంజనీరింగు చదివె రోజుల్లో వచింది ఈ పాట. నాకు చాలా నచ్చిన పాట.అదేమిటో కాని, మా స్నేహితులకు ఇది నచ్చలే. ఏదెమైన మంచి వీడియో తో మల్లా బ్లాగు నుపునహ్ ప్రారంభిస్తున్నారన్నమాట. స్వాగతం. :)

rākeśvara said...

పుట్టిన పబ్బం శూభాకాంక్షలు...
హుట్టు హబ్బదా శుభాశాయగళు...
:)