సాహితీవనం-5 జవాబులు

పవిత్ర రంజాన్ మాసంలో తొలి ఉపవాసం ఉంటూ, చేస్తూన్న దీప్తిధార 'సాహితీవన' విహారం:

అ. 'రష్యన్ సీత' కథా సంపుటి రచయిత్రి : కందుకూరి వెంకట మహాలక్ష్మి. (గూగులమ్మ: నరుడా ఏమి నీ కోరిక? :)

ఆ. ''ఏవి తల్లీ,నిరుడు మండిన ఎండు తాటాకుల్" అని పారడి రాసింది: ఝరుక్ శాస్త్రి? (పేరడీ శూరుడు, సాహితీ చంద్రుడు, సుధలు కురిసే కథలు, సుడిగాలి విసిరే కవితలు, రాసిన జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి.)

ఇ. ఇది ఒక భక్తుడి, సాహితీకారుడి సమాధి : శ్రీత్యాగరాజ, తిరువాయూరు. (ఎందరో మహానుభావు లందరికి వందనము.)

ఈ. సుగాత్రి అంటే ఏమిటి? : పైన పేర్కొన్నవి ఏవీ కావు. (మంచి గాత్రం కలది)

ఉ. కవి శేషెంద్ర శర్మ అభిమాన సంఘం : కవి సేన? (మెగాసేన లాగా కవులకూ అభిమాన సంఘాలున్నాయండోయ్!)

ఊ. పంజరాన్ని నేనే, పక్షిని నెనే -కవితా సంపుటి రచయిత్రి : శిలాలోలిత. (పదుకొండేళ్లకే పెళ్లి అనే పంజరంలో చిక్కుకున్న పక్షి, ఈ 'లక్ష్మి' కలం పేరు రేవతీదేవి విరచిత శిలాలోలిత. మళ్లీ గూగులమ్మ వరమే!)

ఎ. ఈ చిత్రం లో ఉన్నవారిని గుర్తించండి : వెల్చేరు నారాయణ రావు. (విస్కాన్సిన్-మాడిసన్ విశ్వవిద్యాలయంలో ఆసియా భాష-సంస్కృతి-సాహిత్యాల అధ్యయన విభాగంలో 'శ్రీకృష్ణదేవరాయ పీఠం' ఆచార్యుడు. గూగులమ్మకు నేనే చెప్పా:)

ఏ. ఆలాపన రాసిన రచయిత : వి.ఎ.కె.రంగారావు. (చిక్కవరం జమీందారు, 'పాట' వీరాభిమాని-అఫిషినాడో కు తెలుగు,ఆలాపన పేరిట ఓ దినపత్రికలో-వార్త? పాటల గురించి రాసిన గుర్తు)

ఐ. చిత్రకారుడు, దర్శకుడు బాపు రూపొందించిన చీరలు ఈ చిత్రం లో వాడారు : పెళ్లి పుస్తకం. (రాజేంద్రుడు ఈ సినిమాలో చీరల రూపకల్పి)

ఒ. "మా నిజాం రాజు, జన్మ జన్మల బూజు " అని గర్జించిన రచయిత : వట్టికోట ఆళ్వార్ స్వామి? ('ప్రజల మనిషి' రచయిత, తెలంగాణా పోరాటయోధుడు.)

మరి నా 'ఇఫ్తార్' విందేది?

2 comments:

cbrao said...

వాయువేగంతో జవాబులిచ్చి ఒక కొత్త విషయాన్ని, తెలుగు బ్లాగు చరిత్ర లో నమోదు చేశారు. సాహిత్య విషయాలపై ప్రజా స్పందన, క్రికెట్ లాంటి వాటితో పోలిస్తే, చాలా తక్కువుంటుంది.ఈ ప్రశ్నలు రాసే సమయం లో పాఠకులు search engine వాడి జవాబులు సులభంగా పట్టుకోగలరనే విషయం నా స్మృతిలో లేదు.Hats off to Google. అయినా, కొత్తపాళీగారు ప్రశ్నలు కఠినంగా ఉన్నాయని స్పందించారు.వారు మీ టపా చూసి ఉన్నట్లైతే, అలా రాసిఉండేవారు కాదు.ఇన్ని ప్రశ్నలకు జవాబు అన్వేషణయంత్రం లో కనుగొన్న మీరు, సుగాత్రి అన్న పదానికి dictionary లో వెదకక పోవటం ఆశ్చర్యం కలిగించింది.నిఘంటువులో ఈ పదానికి సరైన అర్థం ఉంది కదా, అదెందుకు రాయలేదనే సందేహం కలిగింది.

Dr.Pen said...

అయ్యో...తెలుసు కదా అనే నిర్లక్ష్యంతో సరిచూసుకోలేకపోయాను.సరైన సమాధానం: మంచి శరీరము కలది.(గాత్రము [ gātramu ] gātramu. [Skt.] n. The body, a member a limb, a part. శరీరము, అవయవము.)వెజ్జునకు వైద్యం నేర్పారు! నెనర్లు.