సనాతన ధార్మిక పరీక్షల్లో రాష్ట్ర ప్రథముడు: మహబూబ్ బాషా!

ఏడవ తరగతిలో నాకు వచ్చిన 'తితిదే పురాణ ప్రబోధ పరీక్ష ప్రశంసా పత్రం' గుర్తుకొచ్చింది ఈ వార్త చదివి. ముస్లింలకు పరమత సహనం లేదన్నది ఎవడయ్యా?

(వార్త: ఈనాడు అనంతపురం సౌజన్యం)

5 comments:

కొత్త పాళీ said...

ఇది తప్పక సంతోషించాల్సిన విషయమే గానీ అపురూపమైతే కాదు. దక్షిణదేశ ముస్లిములు తమ ప్రత్యేక అస్తిత్వాన్ని కాపాడుకుంటూనే జనజీవంలో భాగంగానే ఉన్నారు. అనేక హిందూ మతకళలు సాంప్రదాయకంగా ముస్లిము కుటుంబాల చేతిలో ఉన్నాయి. నా చిన్నప్పటి స్నేహితుడు ముస్తఖీం గుర్తొస్తున్నాడు. ఆరో క్లాసులో మాకు ద్రౌపదీ స్వయంవరం కథ నాటిక లాగా ఉండేది. అందులో దుర్యోధనుడి డైలాగులు చెప్పటం వాడికెంతో ఇష్టంగా ఉండేది.

Unknown said...

ఎవరో ఛాందసవాదులు అందరినీ ఓ గాటిన కట్టేసినంత మాత్రాన అది నిజమయిపోదు కదండీ.
మంచీ చెడూ అనేవి అందరిలోనూ ఉంటాయనేదే నా నమ్మకం. మనిషిని మనిషిని గానే బేరీజు వేయాలి కానీ కులాలు మతాలతో కాదు కదా.

రానారె said...

బాషా జిందాబాద్! ప్రవీణ్ అన్నట్లు "ముస్లిములకు పరమత సహనం లేదు/ హిందువులకు పరమత సహనం లేదు" అని మతస్తులందరినీ ఒక గాటన కట్టివేయలేం. గురజాడ చెప్పినట్లు మనుషులు రెండే కులాలు, అవి - మంచివాళ్లు, చెడ్డవాళ్లు.

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం said...

I want to make a distinction. తెలుగు ముస్లిములు ప్రపంచంలో ఇతర దేశాల/రాష్ట్రాల ముస్లిముల కంటే చాలా వేరు. కారణం-వాళ్ళు స్వతహాగా విదేశాల నుంచి ఇక్కడికి దిగుమతైన ముస్లిములు కారు. వాళ్ళు వేలాది సంవత్సరాలుగా మనవాళ్ళే. నాగార్జున విశ్వవిద్యాలయంలో ఖాదర్ అనే సంస్కృత పండితుడుండేవాడు. అలాగే కాకినాడలో షేక్ మస్తాన్ అనే మహాకవి ఉండేవాడు. ఆయన సాంప్రదాయిక చ్ఛందస్సులలో (ఉత్పలమాల, తేటగీతి మొ.)సమకాలీన సమస్యలపై కథలు రాసేవాడు. నిజానికి ఈ జాబితా చాలా చాలా పెద్దది.

రవి వైజాసత్య said...

తాబాసు గారన్నది నిజం. చిన్నప్పుడు మా ఊళ్లో హానీఫ్ మాస్టారు గారు చదువు చెప్పేవారు..ఆయన మొదటి తరగతి పిల్లోల్లకి తల్లి నిన్నుదలంచి అంటూ విద్యాభ్యాసం చేయించేవారు. మొన్నీమధ్య వందేమాతరాన్ని ముస్లింలు ఎందుకు పాడాలి అన్న దుమారం చెలరేగినప్పుడు నాకాయనే గుర్తొచ్చారు.