ఇంతలోనే ఐదేళ్లూ ఎలా గడచిపోయాయబ్బా! ఆగష్టు 21,2002 ఉదయం 6గంటలకు నా చేతుల్లో మొదటిసారి వాన్ని చూసుకొన్నప్పుడు నాలో ఏదో తెలియని ఉద్వేగం! మా శ్రీమతిని ఒక్క రోజు ఓపిక పట్టకూడదూ (మెగాస్టార్-ఆగష్టు 22!) అన్నానని, ఇప్పటికీ అందరూ నన్ను ఎగతాళి చేస్తూంటారు.కానీ మనం మనమే! తొమ్మిది నెలల (తల్లి కడుపులో ఉన్నప్పుడు)వయస్సులో మా వాడు చూసిన(విన్న) తొలి తెలుగు చిత్రం 'ఇంద్ర'. అందుకే అప్పట్లో వాన్ని 'ఇంద్ర' అనే పిలిచేవారు. అందుకేనేమో మా వాడికిష్టమైన ఇంగ్లీషు రైమ్ 'ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్! చిరంజీవి మెగాస్టార్!'. ఇక వాళ్ల తాత నేర్పించిన ఊతపదం 'శంకర్ దాదా - ఎం.బి.బి.ఎస్! పి.సుహాస్ ఐ.ఏ.ఎస్!' కానీ ఇప్పుడేమో తీరం ఆవల ఉన్నాడాయె. ఈ సోదంతా ఎందుకంటే మా వాడు, నా బ్లాగు చూస్తూంటాడు...అందుకే ఈ టపా. హాసూ...మరోసారి నీకు నా హార్థిక జన్మదిన శుభాకాంక్షలురా! బాసూ...నీక్కూడా కాస్త ముందుగా!
15 comments:
పుట్టినరోజు శుభాకంక్షలు
మీ సుహాస్ కి నా తరపు నుండి కూడా జన్మదిన శుభాకాంక్షలు.
Happy Birthday to Suhaas...
సుహాస్ కి జన్మదిన శుభాకాంక్షలు...
చక్కగా చదువుకుని బాగా అభివృద్ధి లోకి రావాలి.
ఏమో IAS అయినా ఆశ్చర్యం లేదు. రేపు ఎక్కడేమి జరుగుతుందో ఎవరికీ తెలీదుగా :)
Happy Birthday Suhaas!
సుహాస్ కి జన్మదిన శుభాకాంక్షలు. MBBS అయినా IAS అయినా పిల్లల అభిరుచికనుగుణంగా పెంచండి.
సుహాసునకు జన్మ దిన శుభాకాంక్షలు.
ఒక బాధ్యత గల పౌరుడిగా భార్త దేశానికి అమెరికాకు గర్వం గలిగేలా ఎదగాలని ఆశీర్వదిస్తూ...
-- ఇంకో సుహాసు నాన్న.
సుహాసు కు జన్మ దిన శుభాకాంక్షలు
వరెవ్వా!! ప్రతి క్షణమూ ఆనందంగా గడుపుతూ హాసు బాసుకన్నా గోప్పోడై నలుగురికీ ఆదర్శమవ్వాలని ఆశీర్వదిస్తున్నా.
Happy BirthDay,
Happy Birth Day,
Happy Birth Day,
May you have many more years
May you have many more happy years,
May you have many more girl friends!
Happy Birth Day.
సుహాస్,
జన్మదిన శుభాకాంక్షలు.
మెగాస్టార్ ను మించే గిగాస్టార్వి అవ్వాలి.
--ప్రసాద్
http://blog.charasala.com
గిగాస్టార్ సుహాస్ కి
హ్యాపీ హ్యాపీ బర్తుడేలు మళ్లీ మళ్లీ జరుపుకోవాలి.
శుభాకాంక్షలందుకోర మిత్రమా.
Happy BirthDay Suhas...
నాకు ఆశీస్సులందించిన మామలు, బాబాయిలు, అత్తలు, పిన్నిలందరికీ నా ముద్దులు.థాంక్యూ! - సుహాస్.
చిరుహాసునికి పుట్టినరోజు ఆశీస్సులు!
Post a Comment