'బెంగళూరు' పుట్టుపూర్వోత్తరాలు!

పూర్వం ఒకానొక రోజు రాజైన 'వీర బల్లాలుడు' వేటకు వెళ్లాడు. అలా వేటాడుతూ, వేటాడుతూ...తనతో పాటు వచ్చిన సైనికుల నుంచి వేరుపడి చీకట్లో దారి తప్పాడు. చివరకు అలసిసొలసి విశ్రమించడానికి చోటు కోసం వెతికాడు. ఇంతలో ఓ పూరి గుడిసె కనిపించింది ఆ నిర్జనారణ్యంలో.అందులో ఉన్న ఓ పండు ముదుసలిని చూసి 'అవ్వా! ఆకలి అవుతోంది ఏమైనా తినడానికి ఉందా?' అని అభ్యర్థించాడు. ఆ అవ్వ తన దగ్గర ఉడకబెట్టిన 'బెంగళు'(కన్నడ-ఓ రకమైన చిక్కుడుకాయ) తప్ప ఏమీ లేదు అంటూ ఆతిథ్యం ఇచ్చింది. అదే అమృతంగా భావించి ఆవురావురుమని తిని తన గుఱ్ఱానికి కాసిన్ని పెట్టి ఆ రాత్రి ఎలాగో గడిపేశాడు వీరబల్లాలుడు. ఈ కథ ఆనోటా ఈనోటా ప్రాకి ఆ ప్రాంతాన్ని అక్కడ మెల్లగా రూపుదిద్దుకొన్న 'ఊరు'ను 'బెంగళూరు' అని పిలవడం మొదలుపెట్టారు.
(సశేషం)

2 comments:

Shree said...

తమరు translationలొ పొరపడిపోయారు.

"బెంగళూరు" అంటె "బెంద కాళు ఊరు"
"బెంద"=వండిన, ఉడికించిన
"కాళు"=గింజలు

--Shree

Dr.Pen said...

అనువాదంలో పొరపాటు కాదు శ్రీధర్ గారూ,నే చదివిన అసలు కథ ఇదే...Page 43: MYSORE-A Gazetteer compiled for Government. By: Benjamin Lewis Rice. కావాలంటే మీరూ ఇక్కడ చదవొచ్చు: http://books.google.com/books?id=krgBAAAAYAAJ&dq=mysore&as_brr=1

అన్నట్టు ఇది బ్రిటీషు వాడి పుస్తకమైనా, సరుకంతా అప్పటి మన పండితుల నుంచి గ్రహించినదే!