ప్రాణం ఖరీదు: వెగెనర్స్ గ్రాన్యులోమటోసిస్!

ఆఖరికి మళ్లీ బ్లాగుబాట పట్టక తప్పింది కాదు. ఈ మధ్యలో పుంఖానుపుంఖాలుగా తెలుగు బ్లాగులు విజృంభిస్తూంటే అప్పుడప్పుడూ చదువుతూ ఉన్నానే కానీ పని ఒత్తిడి వల్ల ఏమీ రాయలేకపోయాను. ఇక ఇప్పుడైనా ఎందుకు అంటే...రెండు కారణాలు.

1. ఆర్కుట్లో పరిచయమైన నేత్రవైద్యుడు డా.రాజేష్ పంపిన ఈ-లేఖలో అరుదైన వ్యాధి బారిన పడ్డ ఓ అభాగ్యుడి గురించి చదివి
2.పొద్దులో 'ప్రశాంతి' వ్యాసం చూసి...

వెగెనర్స్ గ్రాన్యులోమటోసిస్: మూడు ముక్కల్లో చెప్పాలంటే ఊపిరితిత్తులు(లంగ్స్) , మూత్రపిండం(కిడ్నీ) లలో ఉండే చిన్న రక్తనాళాలు చిట్లి, ప్రాణానికే ప్రమాదం తెచ్చే జబ్బు. కంటిలో కార్నియా కూడా దెబ్బ తింటుంది. కానీ అరుదైన ఈ జబ్బుకు చికిత్స ఉంది. చేయించుకొనే తాహతు ఆ వ్యక్తికి లేదు. మీరు తలో చేయి వెయ్యండి...ఇక్కడ. మరిన్ని వివరాలకు నా 'ఐ-మెడిసిన్' బ్లాగు చూడగలరు.

No comments: