'ఫోర్మిసిడే' కుటుంబానికి చెందిన చీమల్లో మరీ ముఖ్యంగా 'మంట చీమలు'(చూ.మంట నక్క), 'హైమెనాప్టెరా' చీమలు చాలా ప్రమాదకరమైనవి. ఇందులోనూ కొన్ని ప్రమోదకరమైన చీమలు లేకపోలేదు (చూ.పొద్దు చీమలు). చీమ ఎంత పెద్దదైతే నొప్పి ఎంత ఎక్కువగా ఉంటుంది. కొన్ని రకాల చీమలను చేతితో పట్టుకున్నా అవి కుట్టకపోయినా మన శరీరం తీవ్రంగా స్పందించే అవకాశం ఉంది.
ఎర్ర చీమలు, నల్ల చీమలు మనిషి చర్మాన్ని కుట్టిన తర్వాత తమ బలిష్ఠమైన చుబుకంతో గట్టిగా పట్టుకొని తమ శరీరాన్ని 360 డిగ్రీల కోణంలో తిప్పుతూ గ్రంథుల్లోని స్రావాలను చర్మం కిందకు పంపుతాయి. క్షార యుక్తమైన ఆ స్రావాల్లో కణవినాశకర, రక్తవిచ్ఛేధక ప్రోటీనులు ఉంటాయి. మొట్టమొదటగా కుట్టిన ప్రదేశంలో కాస్త ఉబ్బడం, మంట, నవ్వ కలగడం జరిగి ఓ అరగంట లోపు తగ్గుముఖం పడుతాయి. మళ్లీ ఓ 24 గం.ల్లో చిన్నపాటి పొక్కులాగా లేచి ఇబ్బంది కలుగజేస్తుంది.ఈ పొక్కు తర్వాతి 48 గం.ల్లో పుండులా తయారయ్యి ఓ పదిరోజుల్లో పూర్తిగా మానిపోతుంది. ఇవన్నీ అందరిలోనూ కలుగవు. ఒక్కో దశలో ఒక్కొక్కరికి స్వాంతన కలిగే అవకాశం ఉంది.
కానీ పైవాటి కంటే ప్రమాదకరమైనది 'తీవ్ర శరీర ప్రతిస్పందన'(అనాఫిలాక్సిస్), మన శరీర రక్షక ప్రతిచర్యలలో భాగంగా కొంత మంది సున్నితమైన శరీర ధర్మం కలిగిన వారిలో ఈ ప్రతిస్పందనతో ప్రాణానికే ప్రమాదం రావచ్చు. ఇలాంటి వారిలో 'ఎపినెఫ్రిన్' అనే సూదిమందును సకాలంలో ఇస్తే ప్రాణాపాయం తప్పుతుంది. ఇక నవ్వ, మంట ఎక్కువగా ఉన్న మామూలు చీమ కాటుకు మందు 'మంచు గడ్డలు' కుట్టిన ప్రదేశం పై ఉంచడం, స్టీరాయిడ్ మందు పూత వాడడం, యాంటీ హిస్టమైను మందులైన 'సెట్రిజిన్', 'అవిల్' మొ. మాత్రలు వాడడం.
{ముఖ్య గమనిక: పైవన్నీ కేవలం తెలుసుకోవడానికి ఇవ్వబడిన సమాచారం. సరైన చికిత్స కొరకు మీ వైద్యున్ని సంప్రదించగలరు. మళ్లీ బ్లాగు లోకంలోనికి అడుగు పెట్టించిన పొద్దు 'చీమ'కు కృతజ్ఞతలు తెలియజేస్తూ...మీ డా.ఇ.పె}
4 comments:
అహా..డాక్టర్ గారికి చీమ కుడితేగానీ బ్లాగు రాయాలని గుర్తురాలేదన్న మాట.ఏమయితేనే చీమ కుట్టిన సందర్భం లో పుట్టిన టపా చాలా విషయాలు తెలిపింది.
చీమ కుడితే ప్రాణంమీదకొస్తుందని నాకింతవరకూ తెలీదు. ఇంకో కొత్తసంగతి అవి విడిచేది ఆమ్లయుత స్రావాలనుకొనేవాణ్ణి. శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదట. చీమాజ్ఞ లేనిదే మా డాక్టర్ మాలోకానికి రారన్నమాట.
మీరు నిజమైన బ్లాక్టరు.
చాలా రోజుల తరువాత పునర్దర్శనం. సంతోషం. మిమ్ముల్ని తిరిగి బ్లాగ్పుట్టలో పడేసిన పొద్దు చీమకు ముందుగా ధన్యవాదములు. చీమ కాటుకు గురైన బ్లాగ్మిత్రులకి మరియు గురికాబోయే బ్లాగ్మిత్రులకి మంచి చిట్కాలే చెప్పారు.
Post a Comment