అందరికీ ఓ శుభవార్త. మన రానారె ఓ ఇంటివాడు, ఓ వంటవాడు కాబోతున్నాడు (చేసుకోబోయే అమ్మాయికి వంట రాదు మరి!). ఈ మధ్య మన బ్లాగుల్లో
పెళ్లిచూపులు ఎక్కువయ్యాయి ఇంతలో ఈ తీపి కబురు. మొన్ననే సీతారాముల కళ్యాణం జరిగింది కదా, ఆ మహత్యమేమో! ఇంతకీ అమ్మాయి గురించి వివరాలైతే తెలియదు కానీ ప్రేమ వివాహమే అని అభిజ్ఞవర్గాల కథనం. మరి మనకందరికీ చెప్పకుండా అకస్మాత్తుగా ఈ వార్త ఏంటీ అనుకొంటూ ఉండగానే ఆర్కుట్లో దొరికిపోయాడు. ఇలా అందరికీ టముకు వేసి చెబుతున్నందుకు రానారెకు సారీ! మరి మీరూ
ఇక్కడ చూడండి ఆ అదృష్టవంతురాలు ఎవరో?
3 comments:
కెవ్ ....చ...తెలుగు బ్లాగరులు ఎవరో ఒకరు ఇలాంటిది చేస్తారు నమ్మకూడదు అనుకుంటూనే బుట్టలో పడిపోయాను.మీ చేతిలో బకరా అయిపోయాను.వా.............
డాక్టర్, నెలరోజుల క్రితమే నేను మరోసారి (అద్దె)ఇంటివాణ్ణైపోయాను. కొన్నేళ్లుగా నేను వంటవాణ్ణి. :)
by any chance, do you have a picture of Sri Krishnadevaraaya's court?
If so, please e-mail me at raghuram.jsj@gmail.com
Please excuse this random e-mail.
Thanks,
Raghu
Post a Comment