సాలభంజికల 'నాగరాజు' గారు, మన 'రానారె', ఐశ్వర్యారాయ్!

ఇదేంటీ ఈ బ్లాగు మకుటం వైవిధ్యంగా ఉంది అనుకొంటున్నారా? ఆగండాగండి చెబుతాను. ఇప్పుడే 'బంటీ ఔర్ బబ్లీ' అనే హిందీ చిత్రరాజాన్ని చూశాను. ఇంతకు ముందే చూసినా మా వాళ్లు చూస్తోంటే, నేను 'కజరారే...కజరారే' గీతం మాత్రం చూశానన్న మాట. ఆ పాటను చూడాలనుకోవటంలో నా ఉద్దేశ్యమైతే... అప్పటికి తెలియకున్నా, ఇప్పుడు మొగుడు-పెళ్లాలు కాబోతున్న 'అభిషేక్-ఐశ్వర్య', మామ-కోడలు కాబోతున్న 'అమితాబ్-ఐశ్వర్య'లను ఆ పాటలో ఉత్సాహంగా చేసిన నృత్యాన్ని చూసి మురిసిపోదామనే!

కానీ ఆ పాట చూస్తూంటే ఐశ్వర్యారాయ్ అయితే కన్పించింది కానీ...విచిత్రంగా నాకు అమితాబ్ స్థానంలో మన 'నాగరాజు'గారు, అభిషేక్ స్థానంలో మన 'రానారె' వీరవిహారం చేస్తున్నట్టు కాన్పడింది:-) మీరు నమ్మకపోతే ఇక్కడ, మరియు ఇక్కడా నొక్కండి, అందులో వారి చిత్రాలను చూశాక మళ్లీ ఇక్కడ ఘాట్టిగా మరోమారు నొక్కండి! నేను చెప్పింది తప్పంటారా? మరి 'పచ్చకామెర్లు' వచ్చిన వాడికి లోకమంతా పచ్చగా కన్పించినట్లు (అది నిజం కాకపోయినా) ఈ బ్లాగు కామెర్లు వచ్చాక లోకంలో ఏది చూసినా బ్లాగెయ్యాలనీ, లేదా ఎవరిని చూసినా మన బ్లాగ్మిత్రులు కన్పించడం మొదలయ్యింది:-) దీనికి మందేమిటి చెప్మా?

(ఇందుమూలంగా యావన్మంది తెలుగు బ్లాగు ప్రజానీకానికి తెలియజేయునదేమనగా ఇది నా పుర్రెలో పుట్టిన అవిడియాకు బ్లాగు రూపమని, హాస్యానికే గానీ అపహాస్యం చేయడానికి కాదనీ తెలుసుకోవలసిందిగా ప్రార్థన.)

6 comments:

Krishh Raem said...

అవునవును .. ఈ మధ్య చాలా మంది నన్ను మహేష్ బాబు అనుకొని ఆటోగ్ర్రఫ్ ల కోసం తెగ విసిగిస్తున్నారు !!

ఏం చెయ్యాలి ఉప్మా ?? ;)

Naveen Garla said...

ఐశ్వర్యరాయ్ బదులు ఎవరు కనపడ్డారేంటి? ;)

జ్యోతి said...

డాక్టరయ్యి ఉండి మీకే ఇలా కనపడితే ఎలాగండి.మీ ఆవిడతో పాటు ఆసుపత్రిలో చేరిపోండి. ఈ బ్లాగు పిచ్చి వదులుతుంది.ఐనా రానారే వెనకాల పడ్డారేంటీ?పాపం పసివాడు.పాలబుగ్గలవాడు.వదిలెయ్యండి.

Dr.Pen said...

కృష్ణా...
ఇంకేముంది కాస్త అంజాన్ కొట్టు(తెలిసీ తెలియనట్లు ఉండు)...కలిసి ఉప్మా తినొచ్చు!(పోకిరి చూసే ఉంటారుగా:-)

నవీన్...
ఐశ్వర్యారాయ్ ఉండగా ఇంకా ఎవరైనా ఎందుకు కనపడతారు అబ్బాయ్!

జ్యోతి గారు...
ఇది కాంప్లిమెంటే కానీ కామెంటు కాదు!రాజుగారికి- నాకు, నాకు-రానారెకు మధ్య గురు-శిష్య సంబంధం ఉంది లెండి...అందుకే ఆ చనువుతో అప్పుడప్పుడూ ఇలా:-)

జ్యోతి said...

మీరు చెప్పింది నిజమేనండి.నిన్న టివీలో ఆ పాట చూస్తుంటే నాకూ అలానే అనిపించింది.రాజుగారి పిల్లిగడ్డం రము నల్ల కళ్ళద్దాలు,అమితాబ్,అభిషేక్ లానే అనిపించారు.ఇద్దరూ సరసులే.అల్లరి కూడా చేస్తారు.నిన్న తప్పుగా మాట్లాడా క్షమించండి.

Nagaraju Pappu said...

ఇది చాలా అన్యాయం రాయల వారు. రానారేకి తండ్రినవ్వటానికి నాకనందమే గాని, ఐశ్వర్యారాయ్ నాకన్నా ఐదేళ్ళు పెద్దదండీ. అందుకే, అభిషేక్ కి వదిలేసా, లేకపోతే గట్టి పోటి ఇచ్చేవాణ్ణే.