అశ్రుతర్పణం!

నిర్లక్ష్యం, దురాశ ఖరీదు నిండు ప్రాణాలు. మహబూబ్‌నగర్‌ జిల్లా కొల్లాపూర్‌ దగ్గర కృష్ణానదిలో గురువారం బల్లకట్టు మునిగి సుమారు యాభైమంది నిరుపేదలు గల్లంతు కావడం మన సును కలచివేసే దుర్ఘటన. నీట మునిగినవారి దేహాల కోసం గజ ఈతగాళ్ళు వెతుకుతుంటే ఒడ్డున నిరీక్షిస్తూ హృదయవిదారకంగా విలపిస్తున్న బంధువులను టీవీ చానళ్ళలో చూసి గుండె తరుక్కు పోనివారు ఉండరు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే మహబూ బ్‌నగర్‌ జిల్లా కలెక్టర్‌ కృష్ణ ఒడ్డుకు వచ్చినా సహాయ చర్యలు ఆల స్యంగానే మొదలైనాయి. సహాయ, పునరావాసానికి అనుసరించ వలసిన మార్గదర్శక సూత్రాలను పాటించలేదు. వందల సంఖ్యలో ప్రమాద స్థలానికి చేరిన బాధితులకు కనీస సదుపాయాలు లేవు. మంచినీరు, ఆహారం ఏర్పాటు చేయాలన్న ధ్యాస కూడా జిల్లా అధి కార యంత్రాంగానికి లేకపోయింది. బాధితులకు నిలువ నీడ లేదు. ఎవరి గొడవ వారిదే.(ఆంధ్రజ్యోతి నుంచి...ఇంకా చదవండి.)

ఈ ఘోరానికి ఎవరు కారణం? అంటే సరైన నిఘా యంత్రాంగం లేని ప్రభుత్వం, లాంచీ యజమానులు, చివరకు ప్రాణాలు కోల్పోయిన వారి నిర్లక్ష్యం కూడా. కానీ సరైన రవాణా సౌకర్యాలు లేని వారికి ఇది తప్పని పనే. మొన్నేదో సినిమాలో ఇలానే తన ఊరికి వంతెన కోసం హీరో ప్రాణాలకు తెగించి అనుకొన్నది సాధిస్తాడు. మరి వీరి జీవితాల్లో ఆ హీరో ఎవరో? మరణించిన అభాగ్యులకు నా అశ్రుతర్పణం. 'మేక్ ఎ డిఫరెన్స్' సభ్యుల ద్వారా ఏదో కొంత సాయాన్ని అందజేయాలి మనం కూడా!

No comments: