సంక్రాంతి శుభాకాంక్షలు!

మిత్రులందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. వేకువఝామునే లేచి చలిపులి నుంచి కాపాడుకోవడానికి భోగిమంటల ముందు కూర్చొంటూ, తెలుగింటి ఆడపడుచులు కళ్లాపి చల్లి వేసే రంగురంగుల ముగ్గులను చూసే అదృష్టం ఈ ఏటికి లేకున్నా, ఇలా ఈ జగద్వలయంలో అయినా ఆ ముగ్గుల అందాలను చూసే అవకాశానికి సంతసిస్తూ...శ్రీ వ్యయనామ సంవత్సరం, పుష్య బహుళపక్ష ఏకాదశి, జనవరి 14 ఆదివారం సాయంకాలం 5గం.52 ని.కు విశాఖా నక్షత్రం, మిథున లగ్నం, బవ కరణం, గండ యోగంలో సూర్యుడు మకరరాశిలో ప్రవేశించే ఈ శుభసందర్భంలో మీకంతా శుభాలే జరగాలని, ఈ విశ్వంలో నివసించే ప్రజలందరూ శాంతి,సౌభాగ్యాలతో విలసిల్లాలని కోరుకుంటూ...మీ 'చింతు'. (చిత్ర సౌజన్యం: క్రియేటివ్ కామన్స్, దీపక్)

3 comments:

Anonymous said...

Ismail.
It is too good to believe. Happy Pongal to you, annie and haasu.
With blessings
Krishna

Unknown said...

HI Ismail...

Happy Pongal to you....

and by the way..nice blog...

Pratyush

Anonymous said...

మంచి ముగ్గు తో మొదలు పెట్టారు సంక్రాంతిని.

మీకు సంక్రాంతి శుభాకాంక్షలు.

విహారి.