ఇది నా వందవ పోస్టు/జాబు/టపా. నేను గమనించలేదు కానీ, నేను బ్లాగడం మొదలుపెట్టి ఈ నెలతో ఒక సంవత్సరం పూర్తి అయ్యింది. ఈ బ్లాగోతం కారణంగా ఎందరో మంచి వ్యక్తులు పరిచయమయ్యారు, మరెందరి మదిలో భావాలను తరచి చూసే అవకాశం లభించింది, తెలుగును మరచిపోకుండా ఈ అంతర్జాలంలో తెలుగువెలుగుల్ని చూసుకొనే అదృష్టమూ దక్కింది. వ్యక్తిగతంగా నా బుర్రకు కొంచెం మేత, చేతికి రాత కూడా! తెలుగు కవితలు, కథలు, వ్యాసాలు చదివి విస్తృతంగా జరిగే చర్చల్లో పాల్గొని జ్ఞానాన్ని వృద్ధి చేసుకొనే భాగ్యమూ లభించింది. ఈ సందర్బంలో నా బ్లాగు మిత్రులందరికీ నా ధన్యవాదాలు తెలుపుతూ, నా భావాలను చదువుతూ, నా జాబులకు బదులిస్తూ నాకు కొండంత స్ఫూర్తినిస్తూ ఉన్న బ్లాగాభిమానులకు నా కృతజ్ఞతలు! ఆంగ్ల కవి బైరన్ అన్నట్టు "ఒక చిన్న సిరా చుక్క - లక్ష మెదళ్ల కదలిక".
చరసాల గారి బ్లాగులో 'థలస్సీమియా' గురించి చదివాక 'మేక్ ఎ ఢిఫరెన్స్'లో సహసభ్యుడిగా నాకు తెలిసిన విజ్ఞానాన్ని మీతో పంచుకోవాలని ఇలా...చరసాల గారు చాలా చక్కగా, సూటిగా ఈ జబ్బు గురించి వివరించారు. మొదట అది చదివి మళ్లీ ఇది చదవండి. 'థలస్సీమియా' అనే పేరెందుకు వచ్చిందంటే మొదట ఇలాంటి రక్తహీనత మధ్యధరా సముద్ర తీర ప్రాంత(మెడిటేరియన్) ప్రజల్లో గమనించారు, అందువల్ల గ్రీకులో 'థలస్' అంటే సముద్రం, హీమియా' అంటే రక్తానికి సంబంధించిన అని అర్థం ఉండడం వల్ల. మన తెలుగులో స్వేచ్ఛానువాదం చేస్తే 'సముద్రపు రక్తహీనత' అనే పేరు పెట్టుకోవచ్చు. కానీ ఈ వ్యాధి అక్కడ మాత్రమే కాకుండా మన దేశంలో, చైనా, బర్మా, థాయ్ లాండ్ మొ. ఆగ్నేయాసియా దేశాల్లోనూ కన్పిస్తుంది.
ఈ రకమైన జన్యు లోపం ఎందుకు కలగాలి అంటే సమాధానం-మన మంచికే! ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. మలేరియా క్రిమి నుంచి కాచుకోవడానికి మన దేహం చేసిన ప్రయత్నాల్లో, మానవ పరిణామ క్రమంలో (ఎవల్యూషన్)ఈ రకమైన జన్యు పరివర్తన(మ్యూటేషన్) జరిగింది. మన రక్తంలో ఎర్ర రక్త కణాలలో ఉన్న హీమోగ్లోబిన్ ఐరన్ తో కూడిన 'హీమ్' మరియు ప్రోటీన్(మాంసకృత్తులు) అయిన 'గ్లోబిన్' కలసి ఉన్న పెద్ద నిర్మాణం. గ్లోబిన్ లో ఆల్ఫా, బీటా అని మరో రెండు ప్రోటీను నిర్మాణాలుంటాయి. వాటి రెండింటి సమతుల్యత దెబ్బ తింటే ఈ వ్యాధి వస్తుంది. బీటా థ. లో బీటా ప్రోటీను తగ్గి, ఆల్ఫా ప్రోటీన్ పెరిగి ఎర్ర రక్త కణాల విచ్ఛితికి దారి తీస్తుంది. అందువల్ల వచ్చే రక్తహీనతను తట్టుకొనేందుకు మన ఎముక మూలుగ ఎక్కువ రక్తకణాలను ఉత్పత్తి చేయడానికి ప్రయత్నిస్తుంది. ఉత్పత్తి ఎక్కువైనా, అది జరిగే క్రమంలో వేగానికి ఎముక మూలుగ దెబ్బతిని పనికి రాని కణాలను రక్తంలోనికి పంపుతుంది. అందుకే ఈ వ్యాధి ఎముకల పెరుగుదలను నిలవరిస్తూ,ఎన్నో విపరీతాలకు దారి తీస్తుంది. ఇదంతా 'బీటా థ. మేజర్' అన్న జబ్బులోనే 'థ. మైనర్' అని ఇంకా చాలా రకాలు ఉన్నాయి ఇందులో. అలాగే 'ఆల్ఫా థ.' లో బీటా ప్రోటీను ఎక్కువై ఇలాగే జరుగుతుంది, కానీ కొంతలో కొంత నయం.
ఇక జన్యువుల్లో ఉన్న ఈ ప్రమాదాన్ని పిండదశలోనే అదీ 9-12 వారాల దశలోనే కనుక్కొనే పరీక్షలు ఇప్పుడు మనకు లభ్యమవుతున్నాయి.ప్రజల్లో ఈ వ్యాధి మీద అవగాహన తెచ్చి ఈ వ్యాధి జన్యువాహకుల మధ్య వివాహాలు జరగకుండా నియత్రించడం ఒక పద్ధతి. కానీ కొన్ని శాస్త్ర పరిశోధనల్లో దీని వల్ల లాభం తగుమాత్రం అని తేలింది. ఇక మిగిలి ఉన్న దారి తల్లి గర్భం ధరించి ఉన్నప్పుడు చేసే పరీక్షలు. గర్భం ధరించిన కొంత కాలానికే కనుక్కోవడం వల్ల ఈ జబ్బు ఉన్న పిండాలను గర్భస్రావం ద్వారా తొలగించడం వల్ల తర్వాతి తరాలలో ఈ జన్యవు పోకుండా నిరోధించవచ్చు, తద్వారా ఈ వ్యాధి నియంత్రణ చేయొచ్చు. వినడానికి కాస్త కటువుగా ఉన్నా (ఈ జబ్బుతో ఉన్న పిల్లల జీవనప్రమాణం 3ఏళ్ల నుంచి మంచి చికిత్స పొందితే 18 ఏళ్లు వరకు మాత్రమే!) పై విధంగా చేసి వ్యాధి ప్రాబల్యాన్ని కొన్ని దేశాలలో తగ్గించారు.
ఇక చికిత్స విషయానికొస్తే రక్తహీనత ఉందని ఐరన్ మాత్రలు ఇవ్వడం చాలా ప్రమాదకరం.ఎందుకంటే రక్తహీనత ఐరన్(ఇనుము ధాతువు) లోపించడం వల్ల కాదు. ఉన్న ఒక్క చికిత్సల్లా రక్త మార్పిడి మాత్రమే లేదా రక్తమూలుగ మార్పిడి. పూర్తి రక్తం కన్నా మనం ఇచ్చే రక్తంలో ఎర్రరక్తకణాలను మాత్రం పక్కకు తీసి వాటిని మాత్రమే రోగి శరీరంలో ఎక్కించడం వల్ల అనవసర ప్రతిచర్యలు రాకుండా నిరోధించవచ్చు.వారి జీవితాంతం ఈ రకంగా రక్తమార్పిడి చేయించుకోవాలి. కాకపోతే ఇందువల్ల ఇంకో ప్రమాదముంది. వారు తీసుకొనే ఈ రక్తకణాల వల్ల ఐరన్ శాతం శరీరంలో ఎక్కువయ్యి కాలేయం(లివర్), గుండె(హార్ట్) లలో చేరి మరో విధంగా వారి ఆయు:ప్రమాణాన్ని తగ్గిస్తుంది. అందుకు ప్రతిక్రియగా 'డెఫిరాగ్జమైన్' అనే మందును తీసుకోవాల్సి ఉంటుంది (ఇది ఎక్కువగా ఉన్న ఐరన్ ను ఒడిసిపట్టుకొని శరీరాన్నుంచి బయటకు పంపుతుంది). ప్లీహం(స్ప్లీన్) ను శస్త్రచికిత్స ద్వారా తొలగించడం కూడా చికిత్సలో ఓ భాగం.
ఇదే కాకుండా 'ఎముక మూలుగ మార్పిడి' కూడా చాలా ఉపయోగకరం. తొలిదశలోనే ఈ చికిత్స మొదలు పెడితే 80 నుంచి 90 శాతం వరకు జబ్బును నయం చేయవచ్చు. దాత రక్తమూలుగను కటి ప్రదేశంలోని ఎముక నుంచి కాస్త తీసుకొని రోగి రక్తంలో ప్రవేశపెడతారు. అందులోని మాతృకణాలు (స్టెమ్ సెల్స్) మంచి హీమోగ్లోబిన్ తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. ఇంకా ప్రయోగదశలో ఉన్న చికిత్స - జన్యు చికిత్స('జీన్ థెరపీ' ), ఇందులో కొన్ని కణాలలో వైరస్ ల ద్వారా మంచి జన్యువులను ప్రవేశపెట్టి వాటి ద్వారా రోగాన్ని నయం చేసే ప్రయత్నం. జీవసాంకేతిక శాస్త్రంలో (బయో టెక్నాలజీ) నేడు వస్తున్న విప్లవాల కారణంగా ఈ జబ్బును పూర్తిగా నయం చేసే రోజు తొందర్లోనే వస్తుందని ఆశిద్దాం! అలాగే మీ అందరికీ భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు!

8 comments:
శత టపోత్సవ శుభాకాంక్షలు :-)
శత టపోత్సవ శుభాకాంక్షలు. మీరు 'సాహితీవైద్యాలయ సార్వభౌములు' గా ఇలాగే వర్ధిల్లాలనీ, కొమ్మూరిగారిని మించిన రచయితగా ఎదగాలనీ కోరుకొంటున్నాను. మీరు చెప్పినది నిజమే- బ్లాగులవల్ల అనేక లాభాలు- ముఖ్యంగా మిత్రలాభం- కలిగాయి. నిన్నైతే ఏకంగా ఇద్దరు బ్లాగర్లు నా కలలోకొచ్చారు. అందులో ఒకరు 'శోధన' సుధాకర్ (ఆయన ఫోటో ఇన్టర్నెట్ లో స్పష్టంగా చూసాను కాబట్టీ, నా ఇటీవలి బ్లాగుకి వ్యాఖ్య వ్రాయడంతో ఆయన్ను తలుచుకోవడం వల్లా అనుకొంటా), వేరొకరు స్పష్తంగా కనిపించలేదు, వారితో మాట్లాడాను కాని.
వంద జాబుల పండుగ వేళ మీకు నా శుభాకాంక్షలు.
డాక్టరు గారూ! థలస్సీమియా గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. మీకు ప్రథమవార్షికోత్సవ మరియు శతటపోత్సవ శుభాకాంక్షలు! ఇలాగే దూసుకుపొండి.
ప్రధమ వార్షికోత్సవ, శత టపోత్సవ శుభాకాంక్షలు. ముందు ముందు ఇంకా ఎన్నో పండగలు త్వరత్వరగా జరుపుకోవాలని కోరుకుంటూ
మీకు శతాధిక అభినందన మందార మాలలు.
మీరు ఇలాగే ఎప్పుడూ మరిన్ని శతాధికాలను అందిస్తారని ఆశిస్తూ.
ఎప్పట్నుంచో అడుగుదామనుకుంటున్న మీరు పిల్లల వైద్యులా?
విహారి
డాక్టరు గారూ,
చాలా చక్కగా వివరించారు. మీ బ్లాగు చూశాక నా బ్లాగులోని కొన్ని పదాలను సవరించుకోవాలని తెలుస్తోంది. మీ తెలుగు చాలా చక్కగా వుంది.
శతబ్లాగుల శుభాభినందనలు.
--ప్రసాద్
http://blog.charasala.com
సుధాకర్,చదువరి,త్రివిక్రం,షడ్రుచుల రచయిత్రికి...మీ అభినందనలకు నా కృతజ్ఞతలు!
కొవ్వలి గారూ...అంతలేసి పదాలు నాకు తగినవి కావని భావిస్తూ, మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ కోరుతున్నాను.
విహారీ...ఇప్పటికింకా కాదు.ఈ మార్చికి తెలుస్తుంది నేను ఏ విభాగంలో చేరుతానో!
ప్రసాద్...మీ రచన ప్రేరణతోనే ఇది రాసాను.అందుకు మీకే చెప్పాలి థాంక్స్!
Post a Comment