క్రిస్మస్ శుభాకాంక్షలు!

మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. యేసుకు 'బెత్ యాలదాఖ్ బ్రీఖ' అంటే ఆయన మాట్లాడిన అరమాయిక్ భాష లో ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ సందర్భంగా ఓ చిన్న విషయం క్రిస్మస్ అంటే సాంటా క్లాస్, రుడాల్ఫ్, బొమ్మలు తప్ప అసలయిన పండుగను చాలా మంది జరుపుకోవడం లేదేమో అనిపిస్తుంది. అవన్నీ పిల్లలకు ప్రీతిపాత్రమైనా పండుగలో ఆధ్యాత్మికతకన్నా వ్యాపారవిలువలు ఎక్కువైపోయాయి. ఏది ఏమైనా ఈ పండుగ ఆ యేసు ఆశించినట్టు ప్రపంచంలో శాంతి పెంపొందించాలని అందరి మధ్య సుహృద్భావం వెల్లివిరియాలని ఆశిస్తున్నాను. అన్నట్టు యేసు వాళ్ల నాన్నను ఏమని పిలిచేవాడో తెలుసా? "అబ్బా" అని!

(చిత్ర సౌజన్యం: క్రియేటివ్ కామన్స్. గియొవన్ని బాటిస్టా సాల్వి చిత్రం 1609-1685)

3 comments:

Anonymous said...

మీకు తెలుసా యేసు డిసెంబర్లో పుట్టలేదని.
క్రిస్మస్ సుభాకాంక్షలు.

Dr.Pen said...

తెలుసండీ...జనవరి అంటారు కొందరు.కానీ పండుగ ఇప్పుడే కదా! క్రీస్తుకు పూర్వం నుంచే చలికాలంలో జరిగే ఓ పండుగ ఉండేదని చదివాను. మొన్న ఎక్కడో బ్లాగులో చదివాను... క్రీస్తు క్రిస్టియన్ కాదు, బుద్ధుడు భౌద్దుడు కాడు అనీ వాల్ల తర్వాత పుట్టిన మతాలేగా ఇవన్నీ!

spandana said...

మీరన్నది నిజమే!
క్రిస్టమస్ సందర్భంగా జీసస్ పేరు చర్చిల్లో వినిపిస్తుందేమొ గానీ బయట కనిపించేది సాంటానే!
--ప్రసాద్
http://blog.charasala.com