డిసెంబరు 24 (క్రీస్తుకు ముందు) పుట్టాను కాబట్టి, అందరికీ నా పుట్టినరోజు ఎప్పుడంటే బి.సి. లో పుట్టానని తమాషాగా చెప్తూంటాను. మొత్తానికి ఈ విశాలవిశ్వంలో, అతిచిన్న పరిణామమైన 31సం. దిగ్విజయంగా ముగించి, నా జీవితంలో ముఫైరెండో ఏటిని ప్రారంభించబోతున్నాను. పోయినేడాది నా పుట్టినరోజు చాలా నిస్సారంగా గడిచింది. 30 ఏళ్లు నిండాయి, జీవితంలో అర్థభాగం గడచిపోయింది...ఏదో పోగొట్టుకున్న భావన. కానీ నేడలా లేదు... చదువుపరంగా, వృత్తిపరంగా రేపటి ఏడాది చాలా ఆసక్తికరంగా ఉండబోతోంది. అదీ కాక మన తెలుగు బ్లాగ్సమాజం లో ఒకడిగా నా మదిలోని ఆలోచనలు మీతో పంచుకుంటూ నిత్యయవ్వనాన్ని అనుభవిస్తున్నాను. కాబట్టి నా ఈ పుట్టినరోజు ఇలా ఈ జగద్వలయంలో జరుపుకొంటున్నాను.
(పైనున్న చిత్రం లో లీలగా కన్పించే ఆ నీలి చుక్క ఏమిటో తెలుసా? మనం నివసించే 'ఈ భూమి'. నాసా వారి 'వోయేజర్' ఇక్కడి నుంచి నాలుగొందల కోట్ల మైళ్ల దూరం నుంచి 1991 లో తీసి పంపిన చిత్రం. ఇన్ని విజయాలు, విషాదాలు, యుద్ధాలు, రక్తపాతాలు, మోహాలు, అడ్డుగోడలు...అన్నీ ఇందులో ఎంత ?)
11 comments:
మీకు నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు !!
మీకు నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు !!
మీరు నిత్య యౌవనులుగానే ఉండాలని మా ఆకాంక్ష!!!
wish you a very happy birthday
జన్మదిన శుభాకా౦క్షలు.
అయితే క్రీస్తు ఇ.శ (ఇస్మయిల్ శక౦)లో పుట్టడన్న మాట :)
హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.ముందు ముందు ఇంక ఉత్సాహంగా ఉండాలని కోరుకుంటున్నాను.
మీకు నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు !!
డాక్టరు గారూ, జన్మదిన శుభాకాంక్షలు. నక్షలైటు కాకుండా డాక్టరయ్యి ప్రపంచానికి ఎంతో మేలు చేశారు. తప్పకుండా యల్లాప్రగడ అంత గొప్పవారవుతారని ఆశిస్తున్నా.
బి.సి. లో పుట్టినాకూడా ఆధునికభావాలతో మా అందరికీ అభిమానపాతృడైన మీకు మా జన్మదిన శుభా కాంక్షలు
మీ అందరి అభిమానానికి కృతజ్ఞతలు!
పుట్టిన రోజు శుభాకాంక్షలు
-నాగరాజు
పుట్టిన రోజు శుభాకాంక్షలు.
--ప్రసాద్
http://blog.charasala.com
Post a Comment