కడుపులో ఉన్నది అబ్బాయి అని తెలియడానికి ఋజువు...హ్హ హ్హ హ్హ!
ప్రియ బ్లాగ్మిత్రులారా! - అన్నట్టు ఈ సారి మాకు పాపండోయ్. ఈ వసంతానికి మాతో ఉంటుంది. చక్కటి పేరు ఒకటి సూచించండి. నేను వెన్నెల, జాస్మిన్, సుహానా అనుకొంటున్నా ప్రస్తుతం. నాలుగేళ్ల మా వాడి పేరు సుహాస్!
9 comments:
congratulations Rayalu garu! how about వసంత
for a name, in honor of the season?
వెన్నెల
మీ తెలుగు భాషాభిమానానికి సరిపొతుంది.మీ జీవితంలో చల్లని వెన్నెలలు కురిపిస్తుంది ఈ పాప.ఇది తథ్యం
జ్యోతి
I'd go with Vasantha.. entha bagundi? Anyway congratulations..!!
congratulations....baabu,paapa...iddaruu vumteane jiivitam sampuurnamavutumdi.miirippudu paripuurnulavutunnarannamaata.naakayite vennela nachimdi.
భలే భలే శుభాభినందనలు. వచ్చిపోయేది వసంతం. ఎప్పుడు కాచేది వెన్నెల. వెన్నెల బాగుంది. మాకు కూతురు పుడితే మేము పెట్టాలని నిర్ణయించుకున్న పేరు తపస్సుమ(తబస్సుం) (మతాలకతీతంగా ఉంటుందని)
చాలా సంతోషం. ప్రస్తుతానికి స్కోరు వెన్నెల-3,వసంత-2. ఇంకా చాలా సమయముంది,చూడాలి. అమెరికాలో ఉన్నాం కాబట్టి ఇక్కడ వెన్నెల పెడితే వానిల్లా గా పలుకుతారేమో? అయినా నా మనస్సు అటు వైపే మొగ్గుచూపుతోంది.వసంత కూడా చాలా చక్కటి పేరు. రవి గారూ మీరన్న తపస్సుమ వినూత్నంగా ఉంది! అందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు.
వెన్నెల! ఎంత చల్లగా, హాయిగా ఉంది పేరు!! నా వోటు దానికే. తపస్సుమ - కవితాత్మకంగా ఉంది. తపస్సుమం అంటే తపోఫలం అన్నమాట.
- అన్నట్టు అభినందనలు ఇస్మాయిల్ గారూ!
నా ఓటూ వెన్నెలకే. అన్నట్లు సుహానా అంటే ఏంటండీ?
సుహానా అంటే "మంచి,యింపైన,రమ్యమైన,మనోహరమైన,
సరసమైన, ఉల్లాసమైన" అనే అర్థాలు వస్తాయి. అన్నట్టు షారూఖ్ ఖాన్ అమ్మాయి పేరు అదే!
Post a Comment