టైమ్‌ ఈ ఏటి వ్యక్తి మీరే!

ఆహా ఏమాశ్చర్యము! నిన్నటి నా బ్లాగు టపా నేడు 'ఈనాడు' వార్తయ్యింది. నాకెంతో సంతోషంగా ఉంది. మీరే చదవండి.

న్యూయార్క్‌: 'టైమ్‌' మ్యాగజైన్‌ ముఖచిత్రంపై మెరిసిపోనున్న ఈ ఏడాది వ్యక్తి ఎవరో తెలుసా? ఇంకెవరు... మీరే!!. ఏంటీ నమ్మబుద్ధి కావటం లేదా? నిజమేనండీ. అచ్చంగా మీరే. ఈ సమాచార సాంకేతిక యుగంలో బ్లాగ్‌లు, యు ట్యూబ్‌, మై స్పేస్‌ వంటి వెబ్‌సైట్ల ద్వారా చొచ్చుకుపోతున్న వ్యక్తుల శక్తిసామర్థ్యాలను గుర్తించిన టైమ్‌ పత్రిక... వారే ముఖచిత్రానికి అర్హులని నిర్ధారించింది. అందుకోసం తన ముఖపత్రంపై కంప్యూటర్‌ తెరపైనుండే ఖాళీ అద్దాన్ని మాత్రమే ప్రచురిస్తోంది. టెక్నాలజీ గురువులు ఎవరికి వారే తమను ఆ అద్దంలో ఊహించుకోవచ్చన్న మాట. ఈ సంచిక సోమవారం మార్కెట్లోకి విడుదలవుతోంది. ఇరాన్‌ అధ్యక్షుడు మహమూద్‌ అహ్మదినెజాద్‌, ఉత్తర కొరియా నేత కిమ్‌జాంగ్‌-2, అమెరికా మాజీ రక్షణ మంత్రి డొనాల్డ్‌ రమ్స్‌ఫెల్డ్‌ తదితరులు ఈ ఏడాది వ్యక్తులుగా వార్తల్లోకి వచ్చి... ముఖచిత్ర రేసులో ఉన్నా... చివరికి 'మీరు' మాత్రమే నెగ్గారు. (ఈనాడు నుంచి)

No comments: