మొన్న నేను నా ఫోటో ని 'టైమ్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్' గా నా బ్లాగులో ఉంచిన సంగతి తెలిసిందే. అది ఈ రోజు అక్షరాలా నిజం అయింది. నేనే కాదు మీరూ ఈ 'ఏటి మేటి వ్యక్తే'. 2006 యూ ట్యూబ్ సంచలనం, ఆర్కుట్ విప్లవం, బ్లాగుల వీరవిహారం అన్నీ కలగలిపి వెబ్ 2.0 గా ప్రముఖుల మన్ననలందుకొన్న ఈ వెబ్ ప్రజాస్వామ్యం మన జీవితాలలో ఓ భాగం అయిపోయింది. మనలో ప్రతి ఒక్కరూ కేవలం ప్రేక్షకులుగా కాక మనమే వార్తల్ని, కవితల్ని, ఇతర వినోద సమాచారాన్ని అందిస్తూ మనమూ ఇందులో భాగస్వామ్యులైనాము. అందుకే టైమ్ వారపత్రిక వారు ఈ ఏటి మేటి వ్యక్తిగా 'మిమ్మల్ని' ఎన్నుకొన్నందుకు నా హార్థిక అభినందనలు.
ఇందుకు ఓ ఉదాహరణ: సిద్ధార్థ అనే కుర్రాడిని 'మకాకా' అని శ్లేషతో వ్యాఖ్యానించినందుకు అలెన్ అనబడే సెనేటర్ పరాజయం పొందాడు. సిద్ధార్థ అమెరికా సెనేట్ లో డెమొక్రాట్ల ఆధిక్యానికి పరోక్షంగా కారకుడయ్యాడు. దీనికంతటికీ కారణం యూ ట్యూబ్, బ్లాగుల్లో ప్రచారం పొందిన సిద్ధార్థ తీసిన వీడియో. ఈ వెబ్ ప్రజాస్వామ్యానికి జిందాబాద్!
No comments:
Post a Comment