రానారె బ్లాగులోని 'సిరివెన్నెల' మాటలు వింటూంటే నిన్న విన్న 'అజీజ్ మియా' ఖవ్వాలి గుర్తొచ్చి ఇక్కడ ఆ సూఫీ గీతార్థాన్ని నాకు చేతనైనంత రీతిలో అనువదిస్తున్నాను. నిజంగా మనిషి అసమానుడే అన్పించింది. ఇద్దరి పాటల్లోను భావం ఎంత సమానం. మీరు వినండి, అర్థం కాకపోతే ఇది చదవండి.
ఉపోద్ఘాతం: ఎవరైతే నీకు సర్వం అర్పిస్తారో, వారు కూడా ఉపాసనకు అర్హులు.
మనిషి ఓ మనిషి...
నీవు అసమానుడవు.
మట్టిబొమ్మ అని తీసిపారవేయకు అందులోనూ మనిషి ఉన్నాడు.
మనిషి ఓ మనిషి...
నీవు అసమానుడవు.
ఎక్కడైతే నీవు పూజింపబడ్డానో అక్కడే నీవు శిలువ వేయబడ్డావు.
నీ ఉనికి నిగూఢమైనది,
అర్థం కానిది, వివరింప శక్యముకానిది.
నీ స్థాయి అనంతం.
మనిషి ఓ మనిషి...
నీవు అసమానుడవు.
పువ్వుల్లోని పరిమళం నీవే,
గోరింటాకులోని రంగూ నీవే,
జ్ఞానదీపం నీవే, అద్దం నీవే, రాయి నీవే.
పాటలు కట్టే కవివి నీవే,
ధూళి నుంచి ఎగసిపడే ఆ స్వరమూ నీవే.
మనిషి ఓ మనిషి...
నీవు అసమానుడవు.
నీ ప్రతి శ్వాస రెపరెపలాడే ఆ దేవుని తెర,
ప్రపంచంలోని సత్యమంతా నీ చుట్టూ తిరుగుతోంది.
విశ్వాసం, అవిశ్వాసం నిర్ణయించేవాడు నీవే,
తోరా, బైబిల్, ఖురాన్, భగవద్గీత నీవే!
మనిషి ఓ మనిషి...
నీవు అసమానుడవు.
యేసు, మూసా, సులేమాన్ గీతం నీవే.
రుస్తుం, ఘనశ్యాం, అర్జునుడు, లక్ష్మణుడు, రాముడు,
మహావీరుడు, గాలిబ్, ఫిరదౌసి, వేణువూదే కృష్ణుడు నీవే.
దావీదు, గౌతమబుద్ధుడు, మేరీతనయుడు నీవే.
దారిచూపే వెలుగు నీవే,
సోక్రటీసు, హుల్లాజు, హుస్సేను నీవే.
విశ్వాసి, అవిశ్వాసి నీవే,
సమస్త మానవాళికి ఓ వరం నీవే.
మనిషి ఓ మనిషి...
నీవు అసమానుడవు, అజేయుడవు.
3 comments:
అవును..ఇద్దరూ కూడా ఒక రూపం లోని భిన్న భావాలను సున్నితం గా వివరించారు.
జగమంత కుటుంబం నాది-ఏకాకి జీవితం నాది...
అద్దమూనీవే-రాయి నీవే...
డాక్టరు గారూ,
ఈ మధ్య రానారె తన బ్లాగులో ఇచ్చిన లంకెనించి ఇక్కడికి వచ్చాను. చక్కటి ఖవ్వాలి గాయకుణ్ణి పరిచయం చేసినందుకు బహుత్ షుక్రియా. నాకు సాబ్రీ సోదరుల "దమాదం మస్త్ కలందర్" చాలా ఇష్టం.
మీరేంటి, పాపతోనూ, కొత్త ఉద్యోగంతోనూ బిజీ బిజీనా? ఎప్పుడన్నా ఒక నిమిషం దొరికితే ఒక మెయిలు కొట్టండి - kottapali at yahoo dot com
నుస్రత్ ఫతే అలీ ఖాన్ గారి ఖవ్వాళీలు తప్ప మిగతావి ఏవీ వినలేదు. ఇంత కన్న గొప్ప అర్ధం ఉన్న పాట మరొకటి గుర్తుకు రావడంలేదంటే ఆశ్చర్యం లేదేమో... థాంక్స్
Post a Comment