ఇప్పుడే కొత్త 'ఉమ్రావ్ జాన్' చూశాను. ఇది 'మీర్జా హదీ రుస్వా' రాసిన నవల కు సినీ రూపం. అన్ని సమీక్షలు ఈ సినిమాను తీసిపారేసినా...నా మటుకు నాకు ఈ సినిమా నన్ను చాలా కదిలించింది. మెదటి సగం చాలా నిదానంగా సాగినా నాకు తెలియకుండానే సినిమాలో లీనమయిపోయి ఒక దశలో వెక్కి వెక్కి ఏడ్చాను. ఇంత కంటే మంచి సినిమాకు గొప్ప నిర్వచనం నా దగ్గర లేదు.
పాత్రధారుల నటన కన్నా ఈ కథలోని గొప్పదనమే ఇదంతాను. ఐతే ఐశ్వర్యారాయ్ నటన అంత తీసిపారేయదగినదిగా లేదు, తన నటనలో ఎంతో పరిణితి కన్పించింది. 1857 ప్రాంతపు లక్నో జీవితాన్ని, మరీ ముఖ్యంగా ఓ పసిదాని విధిని మనస్సు కరిగించేలా చిత్రీకరించారు. ప్రేమ, డబ్బు, పగ, వంచన, అపనమ్మకం అన్నీ ఒకదానినొకటి పెనవేసుకొన్న ఓ అభాగ్యురాలి జీవితం ఈ కథ. కొన్ని అమూల్యమైన సంభాషణలు ఉన్నాయి ఇందులో.
ఈ సినిమా చూశాక అమీర్ ఖుస్రో రాసిన ఈ అమూల్య ముత్యాలు గుర్తొచ్చాయి...
నా 'పక్క'కు దూరంగా వెళ్లు...ఓ వైద్యుడా!
ఈ ప్రేమ రోగికి నా ప్రియురాలి చూపే మందు!
ఇది తప్ప నీ మందులేవీ పనిచేయవు...అది తప్ప ఇంకేమీ వద్దు!
(ఓ పర్షియన్ కవితకి నా స్వేచ్ఛానువాదం)
మరొకటి...
ఆ ఖాళీ పక్క చూసి రాత్రీ పగలు తెలియకుండా ఏడ్చాను,
తన కోసం వగస్తూ ఒక్క క్షణం తీరిక లేకుండా గడిపాను.
4 comments:
ఇలాగే అందరూ తీసిపారేసిన 'చక్రం' సినిమా ఇప్పుడే చూశాను.
నాకు చాలాచాలా నచ్చింది. ముఖ్యంగా ప్రకాశ్‌రాజ్, ప్రభాస్‌ల నటన అత్యద్భుతం. దీనికి కారణం ఈ నేపధ్యం. అదేపనిగా ఇండియన్ స్టోర్‌కెళ్లి DVD తెచ్చుకొని ఇది రెండవసారి చూడటం.
'ఒక దశలో వెక్కి వెక్కి ఏడ్చాను.' ఈ వయస్సులో మీరు ఇలాంటి అనుభూతి చెందారంటే అది దర్శకుని ప్రతిభే.
నిజం చెప్పలంటే నాకు ఈ సినిమా అంతగా నచ్చలేదు.కానీ మీరు రాసింది చదివాక ఎందుకో మల్ల ఒక్కసారి చూడాలని వుంది.
పాతికేళ్ళ క్రితపు రేఖ సినిమాతో పోల్చుకోక పోతే ఈ సినిమా బానే ఉంది. ఈ సినిమాకి ఉన్న రెండు పెద్ద బలహీనతలు (నా ఉద్దేశంలో) అభిషేక్, మరియు ఐశ్వర్య.
Post a Comment