ఓ మేఘమాలిక! అందించాలి నా చెలికి ఈ చిరుగీతిక!
"తొలిపొద్దున, నులివెచ్చని సూర్యకిరణాల్లో నీ స్పర్శని...
మలిసంధ్యన, నిండుపున్నమి చందమామలో నీ మోముని...
ప్రత్యూషపు వేళల్లో, చివురాకులపై వెలసిన మంచుబిందువుల్లో నీ మదిని...
సంజెవెలుగుల్లో, అరుణార్ణవమైన ఆకాశంలో సిగ్గుతో కందిపోయిన నీ మేనిని...
దట్టమైన నీలిమేఘాల్లో, నిగూఢమైన నీ చూపుల్లోని గాఢత్వాన్ని...
నీలి సంద్రం నుంచి, కొండాకోనల మీదుగా నను తాకుతూన్న పిల్లతెమ్మరలో నీ శ్వాసని...
అనుభవిస్తూ... పలవరిస్తూ... కలవరిస్తూ... ఓ చకోరపక్షిలా వేచిచూస్తూన్నాను!
వర్షించు, ప్రేమ వర్షం కురిపించు... ఆ వానలో తడిసి ముద్దవడానికి నా మనసు తహతహలాడుతోంది!"
(ఎన్నాళ్ల తర్వాతో మనసు స్పందించి "నూనూగు మీసాల నూత్న యవ్వనాన" రాసిన కవిత వైపు పరుగుతీసింది. అది మీతో పంచుకోవాలని ఇలా - ఇస్మాయిల్ పెనుకొండ)

3 comments:
sunnitamaina bhaavanni saralam ga cakkaga raasaru.
ఇలాటి కవితలు చూస్తుంటే అన్ని రకాల కవితళ్ళోకెల్లా అనుభూతి కవిత్వం ఉత్తమమైందేమో అనిపిస్తుంటుంది....
ఎన్నాళ్ల తర్వాతో మనసు స్పందించి "నూనూగు మీసాల నూత్న యవ్వనాన" రాసిన కవిత ఈ ప్రౌఢ వయస్సున మాకందించినందుకు అభినందనలు....
కవిత చాలా బాగుంది....
Kavitha chaala bagundi. Meghamaalika thana pani thappakunda chesi untundani bhavisthu...:-)
Post a Comment