'అర్థరాత్రి స్వతంత్రం'

"రెడ్డి నారాయణమూర్తి" మీద ఈనాడు ఆదివారంలో వచ్చిన ఈ వ్యాసం చదువుతూంటే... నేను చిన్నప్పుడెప్పుడో (ఆరో తరగతి అనుకొంటా) ఓ అర్థరాత్రి (రెండో ఆట) కదిరిలో చూసిన 'అర్థరాత్రి స్వతంత్రం' సినిమా గుర్తుకు వచ్చింది. ఓ సినిమా ప్రభావం ఎలా ఉంటుందంటే తెలిసీతెలియని ఆ వయస్సులో, చివరి దృశ్యంలో ఓ చిన్న పిల్లవాడు గొంగళి భుజాన వేసుకొని తూరుపు సూరీడి వైపు కదిలిపోయే సన్నివేశం చూసి నేనూ నక్సలైట్లలో కలిసిపోదామని అనుకొన్నాను. ఆ సన్నివేశం అనేకాదు మొత్తం సినిమా మనస్సును కదిలించే సినిమా. అలాగే 'ఎర్రసైన్యం' లోని ఈ పాట "కొడుకో...బంగారు తండ్రీ". అంత మాత్రాన నేను విప్లవకారుడిని అనుకొనేరు, కానీ చదువు వల్లే పేదరికం, అజ్ఞానం పోతుందనుకొనే వాళ్లలో మొదటివాడిని. 'ఆశ' లాంటి ఉన్నతాశయాలు కల సంస్థలతో కలిసి పనిచేయడం మంచిదని భావించేవాడిని. అత్యాశ అయినా...ఎప్పటికైనా 'డా.ఎల్లాప్రగడ సుబ్బారావు' సాధించిన దానిలో లేశమాత్రమైనా సాధించి ...

"నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను!
నేను సైతం విశ్వవృష్టికి అశ్రువొక్కటి ధారపోశాను!
నేను సైతం భువనఘోషకు వెర్రి గొంతుక విచ్చి మ్రోశాను."(శ్రీశ్రీ)
అని అనుకొనే స్థాయికి ఎదగాలని నా కోరిక.

2 comments:

Anonymous said...

తథా అస్తు!!

Anonymous said...

మీరు కోరిక అంటున్న మీ ఆశయం నెరవేరాలని నా ఆకాంక్ష!!