తెలుగు బ్లాగులు,వెబ్ సైట్ ల వీరవిహారం!

తెలుగు ప్రేమికులకు నిజంగా ఇది తీపి కబురు! బ్లాగులు,వెబ్ సైట్ లు తెలుగు లో విజృంభిస్తున్నాయి.నేను ఓ ఏడాదిగా గమనిస్తున్నా, ఈ మధ్య కాలంలో ఇంత మార్పు ఎప్పుడూ చూడలేదు.వీవెన్ ఇచ్చిన గణాంకాలే కాకుండా అక్కడ తెలుగు వికిపీడియా కూడా 22,708 వ్యాసాలతో అప్రతిహతంగా ముందుకు దూసుకెళ్లిపోతోంది.ఇది ఎంతో సంతోషకరమైన వార్త.ఇందుకు కారణభూతులైన ప్రతి ఒక్కరి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను.

ముఖ్యంగా వీరికి: తెలుగు బ్లాగులు మొదలైనప్పుడు అందర్నీ కదిలించి,పెను నిద్దర వదిలించి బ్లాగులు మొదలుపెట్టించిన చావాకిరణ్‌ , లేఖిని తో తెలుగులో రాయడం సులభం చేసిన వీవెన్, లేఖిని పూర్వ రూపమైన పద్మ ను అందించిన నాగార్జున వెన్న, కొత్తగా వచ్చిన క్విల్ ప్యాడ్ , క్రొంగొత్తగా తెలుగు ఉపకరణపట్టీ తయారు చేసి ఈ అంతర్జాలంలో తెలుగు పరిఢవిల్లడానికి కృషి చేస్తున్న సుధాకర్.

వీరితో పాటు తెలుగు వికీ ని పరుగులెత్తిస్తున్న నాగార్జున , వైఙాసత్య ,
చదువరి ,ప్రదీపు ,త్రివిక్రం ,ఇంకా సభ్యులైన వీరందరికీ ,సభ్యులు కాకుండానే తోడ్పడుతున్న ...ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు.

నేను కూడా నాకు తోచిన రీతిలో ఆర్కుట్ లో తెలుగు కు ప్రచారం చేస్తున్నాను.ఇదే సందర్భంలో నేను తెలుగు అక్షరాలు వ్రాయడానికి ఉపకరిస్తున్న 'పోతన బాణీ' రూపకర్త, 'శ్రీ తిరుమల కృష్ణ దేశికాచార్యులు' గారికి కృతజ్ఞతలు.

తెలుగుదనం, తెలుగు జర్నల్ లాంటి వినూత్న వెబ్ సైట్ లు తప్పక దర్శించండి.ఇంతకీ మొట్టమొదటి తెలుగు బ్లాగు, తొలి తెలుగు బ్లాగువీరుడు,తొలి బ్లాగువనిత ఎవరో? మీదే ఐతే ఇక్కడ తెలపండి.

3 comments:

రాధిక said...

meeru paina pearkonnavaallamdariki naa hrudayapuurvaka dhanyavaadamulu.

KLKR said...

Ismail gaaru...neenu telugujournal.com team lo oka sabhudni.

Thanks a lot for encouraging us by linking us from your blog.

We are trying to improve telugujournal.com to make it accessable to telugu people spread across the globe. So, I request you to kindly send your comments and suggestions to me at lakshmikanthraja@gmail.com

We look forward to serve the Telugu Community the best possible way!!

Stay tuned and please spread the word.

Regards,
Lakshmikanth @ TeluguJournal.Com

Madhu said...

మీ బ్లాగు లో వెతకండి, ఈ క్రింది ఫలితాలను గమనించండి.

http://www.gults.com/mini/te/search.htm?cx=011867517247898499319%3Aihag31htjkm&cof=FORID%3A9&q=%E0%B0%B5%E0%B0%BF%E0%B0%9C%E0%B0%AF%E0%B0%82+site%3Akrishnadevarayalu.blogspot.com&hl=te&site=krishnadevarayalu.blogspot.com

మీ బ్లాగు కి ఈ శోధనను అనుసందానించండి పూర్తి వివరాలకు ఈ క్రింది బ్లాగు లో చూడండి.

http://gultus.blogspot.com/