'స్టాలిన్' సమీక్షల పై ఇస్మాయిల్ సమీక్ష!

'స్టాలిన్' - నిస్సందేహంగా మెగాస్టార్ స్టామినా కు తగ్గ చిత్రం. ఓ మంచి ఆలోచనని మన తెలుగు వాళ్లకు పరిచయం చేసిన తమిళ మురుగదాస్ నిజంగా అభినందనీయుడు. ఈ ఆలోచన తన స్వకపోలకల్పితం కాకపోయినా ఇలాంటి విప్లవాత్మక అంశాన్ని తెలుగు తెరకు పరిచయం చేయడం నిజంగా సాహసోపేతం.

మరి ఈ 'అవిడియా' ఎవరిది? 'కేథరీన్ ర్యాన్ హైడ్' అనే నవలా రచయిత్రి రాసిన " పే ఇట్ ఫార్వార్డ్" అన్న నవల (ఇదే ఓ హాలీవుడ్ చిత్రంగా కూడా వచ్చింది) లోని వినూత్నసందేశమే ఈ 'స్టాలిన్' కథాంశం. మరి ఆమెకు ఈ ఆలోచన ఎలా వచ్చిందనుకొంటుంన్నారా? తన నిజజీవితంలో జరిగిన ఓ సంఘటనే ఈ నవల కు అంకురార్పణ కలిగించింది.

ఓ సమీక్షకుడు అన్నట్టు " ఓ సిరా చుక్క లక్ష మెదళ్ల కదలిక" అన్నది ఇదంతా వింటూంటే నిజమనిపిస్తోంది కదూ! ఆ రోజు ఆమె మొదలుపెట్టిన ఆ మొట్టమెదటి అక్షరం ఎంతో మంది జీవితాలలో వెలుగు నింపుతోంది.

ఇక సినిమా విషయానికొస్తే చిరంజీవి అనే నటుడు పరిపూర్ణంగా తన పాత్రకు న్యాయం చేశాడు. సినిమాలో తప్పొప్పుల సంగతి ఎలా ఉన్నా మనస్సును కదిలించే సన్నివేశాలు నిండుగా ఉన్న చిత్రం. మరో సమీక్షకుడు కొన్ని సన్నివేశాలు తమిళ వాసన కొడుతున్నాయి అన్నాడు. తమిళ వాసనంటే హృదయం స్పందించే సన్నివేశాలే అయితే నేను వాటిని ఎంతో ఇష్టంగా ఆఘ్రాణిస్తాను.

ఒక 'ఆటోగ్రాఫ్' మరొక 'కాదల్' ఏవీ ఇలాంటి సినిమాలు మన తెలుగులో? తమిళం,ఆంగ్లం అని కాదు మంచి ఎక్కడున్నా మనం అభినందించాలి, ఆస్వాదించాలి ! బొమ్మరిల్లులో కథానాయకుడు 'సిద్ధార్థ' ఓ తమిళ కుర్రాడు, అందులో ఓ పాటని ఎంతో చక్కగా తెలుగులో హృద్యంగా పాడాడు.

మరి స్టాలిన్ విషయానికొస్తే దీన్ని కాపీ అనరా? అంటే నా సమాధానం కాదు అనే. ఎందుకంటారా ఓ పాయింట్ ని తీసుకొని దాని చుట్టూ కథ అల్లుకొచ్చారే కానీ ఎత్తి దించిన కథ ఎంత మాత్రం కాదు.ఇక అభిమానిగా కొంచెం నిరుత్సాహ పడింది పాటలు-నృత్యాల విషయంలో, ఠాగూర్, ఇంద్ర లాంటి పాటలు,నృత్యాలు ఉండి ఉంటే ఇంకా బావుండేది. మరి దర్శకుడు, మెగాస్టార్ అందులో ఎక్కువ మొగ్గు చూపితే కథావిషయం పలుచనపడిపొతుందనుకొన్నారో ఏమిటో ఓ రెండు తప్పిస్తే మిగతావి మామూలుగా ఉన్నాయి.

మెత్తం మీద మంచి ప్రయత్నం...ఓ మంచి చిత్రం...నేను ఓ ముగ్గురికి సాయం చేసా...మరి మీరూ ఓ ముగ్గురికి సాయం చేయండి!

5 comments:

Anonymous said...

This comment is not specific to this post -

I am really impressed with the way you are able to continue blogging in telugu. I bow before you for the effort you are taking. I hope to start a telugu blog on my website too. Keep up the good work.

Anonymous said...

i too agree with u that its a gud idea. but i didnt like murugudoss saying he got this idea when he say indra function.

regarding movie first of is useless, except a scene where every disabled help each other to finish race.

if he has to give message chiru can do a documentary which can be telecasted after news in teja or e tv, but shldn't fail his fans like this. being a chiru fan from my childhood, i think directors are wasting his enormous power and talent. definite ga e movie murugudoss failure. he wasted many acting talents like saradha, prakash raj, sunil etc. songs r useless, i dont know who is doing costumes for chiru, naku ichina baaga chesundo vadini emo.

sorry idhi jus my opinion. koni scenes bagunayi ani movie chulemu ga

Anonymous said...

some corrections
when he sees indra fn
movie first half

Dr.Pen said...
This comment has been removed by a blog administrator.
Dr.Pen said...

well he(Murugudoss) is right about the part that he had this thought when he saw Indra function or I think it's Tagore Court scene, if I am correct.

I mean he might have thought about this idea which he saw/heard earlier to apply for Megastar.

And as for as your analysis goes first half is not good but I think its bcos of all this hype the movie generated...and regarding songs & costumes ur absolutely right