ఈ చిన్నారిని కాపాడండి !
పై ఫోటోలో ఉన్న చిన్నారి పేరు 'నిరాళి'. తను మందులకు లొంగని 'ఎక్యూట్ లింఫోబ్లాస్టిక్ ల్యుకేమియా' అనే జబ్బుతో బాధ పడుతోంది. ఈ రకమైన రక్త క్యాన్సరు పది లక్షల మందిలో 30 పిల్లలకు రావచ్చు. అది కూడా 2 నుంచి 5 సంవత్సరాల వయస్సులో ఎక్కువగా వస్తుంది.
ఈ ముద్దులపట్టి కి మనం సహాయం ఎలా చేయాలంటే...తనకు మన ఎముకలలోని రక్తమూలుగ (బోన్ మ్యారో) ను దానం చేయడం ద్వారా! మరి అందరి శరీరాలలోని మూలుగ సరిపోదుగా అందుకు వారి బంధువులు, మన లాంటి స్నేహితులు కొన్ని చోట్ల సహాయ శిబిరాలను ఏర్పరిచారు ముఖ్యంగా అమెరికాలో ఈ క్రింది చోట్ల
మీరు చేయాల్సిందల్లా అక్కడకు వెళ్లి మీ పేరు నమోదు చేసుకొని మీ రక్త నమూనా (శాంపిల్) ను ఇవ్వడం. ఇకవేళ మీ శరీరం లోని మూలుగ ఈ చిన్నారి కి సరిపోతే అప్పుడు మాత్రమే మీరు మీ మ్యారో ను ఇవ్వాల్సి ఉంటుంది. పదివేల మందిలో ఒక్కరిది జతపడే అవకాశం ఉంది.
రక్త మూలుగ ను తీసుకోవడం చిన్న శస్త్రచికిత్స లాంటిది. అవసరమైన మత్తుమందు ఇచ్చిన తర్వాత మీ కటి భాగంలో ఉన్న ఎముక (పెల్విక్ బోన్) లో నుంచి ఓ మాదిరి సూది గుచ్చి 10-15 మి.లీ. మూలుగ ను తీసుకొంటారు.
ఇందుకు మీ బ్లడ్ గ్రూప్ పాప గ్రూప్ ఒకటిగా ఉండాల్సిన అవసరం లేదు, ఎందుకంటారా తీసుకొనేది మాతృకణాలున్న ఎముకమూలుగ కానీ ఎర్రరక్తకణాలు కాదు. కాబట్టి వేరే గ్రూప్ నకు చెందినా మీ కణరకం(టిశ్యూ టైపింగ్) సరిపోతే చాలు.
అంతే కాకుండా మీరు వెళ్ళలేక పోతే మీ ఇంటి నుండే ఇక్కడి నుండి ఓ కిట్ ను పంపమని అభ్యర్థన చేయవచ్చు. అంతే కాక మీరు మరో సహాయం కూడా చేయవచ్చు- ఈ వార్తను , విజ్ఞప్తిని మీ స్నేహితులకు పంపండి.మరి ఆలశ్యం ఎందుకు...రండి ఓ ప్రాణం నిలబెడదాం!
(మెగాస్టార్ 'స్టాలిన్' స్ఫూర్తితో...)
For those who cannot read Telugu font please go here
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment