Disclaimer: నా వృత్తి పరంగా 90శాతం సమయం తొంభై ఏళ్లకు దగ్గర పడిన అవ్వలూ, తాతలకు సేవలందించాల్సి వస్తోంది. వారి జబ్బులను నయం చేయడం కన్నా, వారితో ప్రేమగా ఓ రెండు మాటలు మాట్లాడితే చాలు- వారి ముఖం వెయ్యి వొల్టుల బల్బులా వెలిగిపోతుంది. అలా కాసేపట్లోనే దగ్గరైన వారు, ఒక్కోసారి నా కళ్ల ముందే అందని తీరాలకు సాగిపోతూంటారు.
ఒక్కోసారి అప్పుడే పుట్టిన పాపాయిని పరీక్షిస్తూ నోట్లో వేలు పెట్టి (gloved finger though, for assessing their sucking reflex) వారి ఆత్రాన్ని చూసి నవ్వుకొని కొన్ని క్షణాలైనా కాకమునుపే, ఓ అవ్వ మరణధృవీకరణ చేయాల్సి రావడం, అదే వేళ్లతో లేని నాడి కోసం ప్రయత్నించడం, ఒక్కసారిగా నన్ను ఆనందం లోనుంచి విషాదంలోకి తోసేస్తూంటుంది. చనిపోయిన నా స్నేహితుల నుదురు ముద్దాడి ఇక వెనక్కు తిరక్కుండా వచ్చేస్తాను.
"జాతస్య హి ధ్రువో మృత్యుర్ధ్రువం జన్మ మృతస్య చ
తస్మాదపరిహార్యేऽర్థే న త్వం శోచితుమర్హసి 2-27 " - భగవద్గీత.
'పుట్టిన వాడికి మరణం తప్పదు, అందుకు శోకించుట తగదు' అని గీతాకారుడు అన్నా ఒక్కోసారి కన్నీళ్లు ఆగవు. 'గుండె మంటలనార్పే చన్నీళ్లు కన్నీళ్లు' అన్న ఆత్రేయ గీతం ఇందుకు సాక్ష్యం. అలా నా అనుభవాల నేపథ్యంలో చూసాను కాబట్టి సమీక్ష కాస్త గాఢంగా ఉండొచ్చు. కానీ మొత్తానికి సినిమా బావుంది. అక్కడ చెప్పలేదు కానీ యువకుడిగా మారిన బ్రాడ్ పిట్`ను పరిచయం చేస్తూ చూపిన దృశ్యంలో ఓ మోటారుసైకిలులో స్టైలుగా అలా దిలాసాగా రోడ్డుపై వెళుతూంటే నా నోట్లోంచి అనుకోకుండా 'ఈల' వచ్చింది. (మామూలుగా ఆ ఈల 'అన్న'గారికి, మా 'మెగాస్టార్'కి పరిమితం:-)
(చిత్ర సౌజన్యం: క్రియేటివ్ కామన్స్. కుమార్ గారూ: ఆ చిక్కుముడికి సమాధానం- మన భారతం:-)
No comments:
Post a Comment