వహ్వా!!!

ఆహా! ఎన్నాళ్లకు ఓ మంచి క్రీడా సమరం చూసే అవకాశం కలిగింది. యూ.ఎస్.ఓపెన్ రెండో అంకంలో ఈ రోజు రెండు మత్తగజాల్లా పోరాడి, సై అంటే సై అనే విధంగా ఆడి, చూసేవారికి క్రీడోల్లాసాన్ని కలిగించిన ఈ ఇద్దరు టెన్నిస్ వీరులు...సెర్బియాకు చెందిన 'నొవాక్ జొకోవిక్'-చెక్ రిపబ్లిక్ కు చెందిన 'రాడెక్ స్టిఫానెక్'! నాలుగ్గంటలా నలభై నాలుగు నిముషాల పాటు జరిగిన ఈ సమరంలో ఇరవై ఏళ్ల నవ యువకుడు 'నొవాక్' 5-7, 7-5, 6-7, 7-6, 7-6 స్కోరుతో ఇరవై తొమ్మిదేళ్ల 'రాడెక్'ను ఓడించాడు. అసలు ఓడించాడు అని రాయడానికి మనసొప్పడం లేదు. అన్నిటికంటే ప్రత్యర్థి సర్వులను మెచ్చుకోవడం, గెలిచాక ఈ ఘనత అంతా రాడెక్ కే చెందుతుందంటూ నొవాక్ సైగ చేయడం, గెలిచాక ఒకరినొకరు మనస్ఫూర్తిగా కౌగిలించుకోవడం, అసలు క్రీడాస్ఫూర్తి అంటే ఇదే అనే విధంగా ప్రవర్తించారు ఇద్దరూ! చివరికి టెన్నిసే గెలిచింది. రేపటి మూడో అంకంలో రష్యన్ 'అన్నా'తో పోటిలో మన 'సానియా' గెలవాలని కోరుకుంటూ...

No comments: