ఎన్నాళ్ల నుంచో ఈ విషయమై బ్లాగులో రాద్దామనుకొని పని ఒత్తిడిలో రాయలేకపోయాను. ఆ మధ్య పెనుకొండ వెళ్లినప్పుడు అక్కడి రాయల వారి వేసవి విడిది గృహమైన 'గగనమహల్' దుస్థితి చూసి మనసు వికలమయ్యింది. ఊరి చుట్టూ ఉన్న కోటగోడనే కాక పురాతన జైనమందిరాలు, అణువణువునా చరిత్ర చిప్పిల్లే ఎన్నో కట్టడాలకు పుట్టినిల్లు మా పెనుకొండ. మన సంస్కృతి, వారసత్వాన్ని కాపాడుకొనే విషయంలో మనం చాలా వెనుకబడి ఉన్నాం. ఈ విషయమై వారం వారం ప్రజలతో మాట్లాడుతోన్న జిల్లా కలెక్టరు సముఖానికి ఈ సంగతి చేరవేసేంతలో ఈ వార్త. కనీసం ఇప్పుడైనా ఘనత వహించిన ప్రభుత్వం వారు మన ప్రాచీన సంపదను కాపాడి, రేపటి తరాల వారికి చరిత్ర మిగిల్చిన తీపిగుర్తులను ఆస్వాదించే భాగ్యం కలుగజేస్తారని ఆశిద్దాం!
(వార్త: 'ఈనాడు' అనంతపురం నుంచి.)
No comments:
Post a Comment