'శోధన' మామకు శుభాకాంక్షలు!

తెలుగులో 2006కు ఉత్తమ బ్లాగుగా ఎన్నుకోబడ్డ 'శోధన' సుధాకర్ కు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ పోటీలో అత్యుత్సాహంగా పాల్గొన్న తెలుగు బ్లాగర్లందరికీ నా మనఃపూర్వక అభినందనలు. అత్యంత ఉత్సాహంగా జరిగిన ఈ పోటీల్లో విజయం తృటిలో తప్పినా...మొత్తానికి మూడో స్థానంలో నిలవడం నాక్కూడా ఆనందానిచ్చింది. ఈ సందర్భంగా నా బ్లాగుకు ఓటేసిన బ్లాగాభిమానులందరికీ నా కృతజ్ఞతలు!

రెండో స్థానంలో నిలిచిన 'గుండెచప్పుడు'కు, ఇతర స్థానాల్లో నిలిచిన అందరికీ, మరీ ముఖ్యంగా 'ఏకవీరుని'కి నా అభినందనలు. ఈ పోటీలో 'బెస్ట్ డిజైన్' మరియు 'బెస్ట్ హ్యూమరస్ బ్లాగ్' కు అన్ని విధాలా అర్హుడైన మన 'విహారి' మరుసటి సంవత్సరం ఇరగదీయాలని కోరుకుంటూ...2007లో ఇంతకు రెట్టించిన ఉత్సాహంతో పోటీలో ఉంటాననీ, మీ అందరి ఆదరాభిమానాలు మరోసారి చూరగొంటాననీ...'పూను స్పర్థను విద్యలందే' అన్న గురజాడ వారి మాటను బ్లాగులకు అన్వయించి ఆరోగ్యకరమైన పోటీని నిర్వహించిన 'ఇండీబ్లాగీస్' వారికి, బహుమతిని ప్రాయోజితం చేసిన 'తేనెగూడు' మిత్రులకు మరోసారి నా వినమ్ర ప్రణామాలు.
విచిత్రం ఏమిటంటే రోజూ నా కలనయంత్రాన్ని ఒక్కసారైనా కలబెట్టకుంటే ఊరుకోని నేను, గత రెండ్రోజులుగా నా 'ఈ' రెండో భార్యని వదలి ఉండాల్సి వచ్చింది...కారణం వచ్చే జాబులో. అందుకే ఈ ఫలితాలపై తగిన సమయంలో నా ప్రతిస్పందన ఇవ్వలేకపోయాను. అడిగిన వెంటనే పైనున్న చిత్రరాజాన్ని చిత్రీకరించి ఇచ్చిన మా యువరాజా వారైన "శ్రీ సుహాస్ పెనుకొండ" గారికి కూడా శతధా నా కృతజ్ఞతలు:-)

8 comments:

రానారె said...

యువరాజావారి చిత్రరాజము బహుముచ్చటగానున్నయది.

తెలు'గోడు' unique speck said...

yuvaraajaavaaridi raajaavaarilaa andevaesina ceyye!cooDamuccaTagaa unaadi

Sudhakar said...

నాకొచ్చిన శుభాకాంక్షలలో అత్యంత అందమైన శుభాకాంక్షలు సుహాస్ వే :-) ధన్యవాదములు యువరాజా :-)

జ్యోతి said...

యువరాణి ఎప్పుడొస్తుందండి .....సుహాసిని నా లేక వెన్నెలా

Anonymous said...

పెనుగొండ యువరాజావారు చక్కటి కళా పిపాసకులు అని తెలుస్తున్నది...

Unknown said...

అయితే మనకో చిన్న బ్లాగర్ వచ్చేసాడన్నమాట.

రాధిక said...

ఇలాంటి శుభాకాంక్షలు విజయానికి అందాన్ని,విజేతకు మిక్కిలి ఆనందాన్ని కలిగిస్తాయి.

Anonymous said...

బుల్లి కృష్ణ దేవరాయలుకు తెలుగు బాగానే వచ్చే!
చూడు బుల్లోడా, తొందరగా తెలుగు నొక్కులు నొక్కడం నేర్చేసుకుని...అతి చిన్న బ్లాగు బుడతడి గా పేరు తెచ్చేసుకో. ఏంటి వింటున్నావా? లేకపోతే ఇక్కడున్న ఇంకో సుహాస్ తెలుగు సాగరంలోకి దూకేస్తాడు.

-- బుడ్డోళ్ళ విహారి