లేపాక్షి అందాలు... హిందూపురం చరిత్ర!

లేపాక్షి...మా హిందూపురానికి 13 కి.మీ. దూరంలో ఉండే చారిత్రాత్మక ప్రదేశం. విజయనగర రాజుల పరిపాలనలో పరిఢవిల్లిన కళాతేజం. నా యాహూ 360 మిత్రుడు 'మహేష్' అందించిన అద్భుత చిత్రాలివి. మీరూ ఇక్కడికి వెళ్లి లేపాక్షి కళాసంపదను వీక్షించండి. వీలైతే అక్కడికి స్వయంగా వెళ్లి మీ కళ్లతో చూసి మీ కళాతృష్ణను తీర్చుకోండి.

అప్పట్లో ఈ ప్రాంతంలో పెనుకొండ, లేపాక్షి పెద్ద జనావాసాలు. హిందూపురం అంతా నిన్న మొన్నటిది. ఈ ప్రాంతం రాయల తర్వాత నవాబుల చేతిలో కొన్నాళ్లు, పాలెగాళ్ల చేతిలో కొన్నాళ్లు, అ తర్వాత విజృంభించిన మరాఠాల ఏలుబడిలో కొన్నాళ్లు ఉన్నప్పుడు మురారిరావనే ఓ మరాఠా నాయకుడు వాళ్ల నాన్నగారైన హిందూరావు పేరు మీదుగా హిందూపురాన్ని నిర్మించాడు. తర్వాత టిప్పు సుల్తాన్ వశమై, బ్రిటిషు వారు టిప్పు సుల్తాన్ ని శ్రీరంగపట్టణంలో చంపి ఈ ప్రాంతాన్నంతా నైజాం పరిపాలన క్రిందికి తెచ్చారు. ఆ తర్వాత నైజాం ఈ ప్రాంతాన్ని బ్రిటిషు వారికి దత్తత ఈయబట్టి దత్తమండలంలో ఓ భాగంగా మారింది.

ఈ విషయాలన్నీ ఎన్నో పుస్తకాల్లో చదివాక హిందూపురంలో ఉన్న ఎందరో మరాఠీ మిత్రులు, మా తాత ఇంటిలోనే కాక మా ప్రాంతంలో చాలా మంది ఇళ్లల్లో ఉండే టిప్పుసుల్తాన్ చిత్రపటాలకు అర్థం తెలిసొచ్చింది. ఇక ఇప్పటి రాజకీయాలకొస్తే తెలుగు ప్రజల గుండె చప్పుడైన "ఎన్టీయార్" ను శాసనసభకు పంపించిన నియోజకవర్గం మాది. అన్నగారిని 84 లో అన్యాయంగా పదవి నుంచి దించినప్పుడు జరిగిన ప్రజాందోళనలో మరణించిన అభిమానుల త్యాగానికి నేను (నాలుగవ తరగతి చదువుతున్న సమయం) ప్రత్యక్షసాక్షిని. కానీ రెండోసారి అదే అన్యాయం జరిగితే...? ప్రధాన మంత్రి కాబోయి తృటిలో తప్పిన దురదృష్టం అన్నగారిది.

( లేపాక్షి బసవన్న, చిత్రసౌజన్యం: మహేష్ ఖన్నా, అనంతపురం.)

4 comments:

రాధిక said...

caritra ni caalaa simple ga cepeesaru.adea mii raatalloa goppadanam.

spandana said...

థ్యాంక్సండీ డాక్టర్ గారూ,
లేపాక్షి అందాలను విన్నదే గానీ చూసింది లేదు. కన్నులకింపుగా కమనీయ దృశ్యాన్ని అందించిన మీ మితృడికి మాకు పరిచయం చేసిన మీకూ కృతజ్ఞతలు.

--ప్రసాద్
http://blog.charasala.com

Anonymous said...

phOTo lu maTuku yamAgA unnAyi gurugAru

Unknown said...

Mana lepakshi avuntyanni andariki chati cheputhunna meeku vandanalu..........