{సెప్టెంబరు 11 2006 న గ్రౌండ్ జీరో దగ్గర మహాత్ముడు}
'లగే రహో మున్నాభాయ్' చూస్తూంటే 'కన్నీటి నవ్వు' అంటే ఏంటో తెలిసింది. మనస్సును హత్తుకొనే విధంగా తీసిన చిత్రం, అలా ఆ చిత్రం చూస్తూండగానే మనస్సులో చిన్న ఆలోచన మెదిలింది. లక్కీసింగ్ ను చూస్తూంటే మన భూషయ్యే కనిపించాడు. ఆ ఆలొచన కు ప్రతిరూపమే ఈ 'అమెరికన్ సత్యాగ్రహి'.
మహాత్ముడు సత్యాగ్రహాన్ని ఆయుధంగా చేపట్టి ఈ సెప్టెంబరు 11 నాటికి 100ఏళ్లు నిండుతున్నాయి. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ మన ముందుకు కొత్త సొగసుతో వచ్చిన ఈ గాంధీగిరి ని ప్రపంచం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్యకే ఎందుకు ఉపయోగించకూడదు?
అందుకే మన భూషయ్యకు కూడా పూలగుత్తిని పంపుదామనుకొంటే శ్వేతసౌధం వారు పూలు,పళ్లు వగైరా వస్తువులు భద్రతాకారణాల రీత్యా పంపకూడదన్నారు. కాబట్టి ఈ-పూలగుత్తిని,మన విన్నపాన్ని కలిపి ఈ-లేఖ గా పంపాను. మరి మీరు ఈ బృహత్ప్రయత్నంలో ఓ చేయి వేసి మహాత్మునికి కృతజ్ఞతగా మన భూషయ్యకు ఓ లేఖ పంపండి.లేదా ఇక్కడ మీ సంతకాన్ని జతచేయండి.
No comments:
Post a Comment