5వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు: అక్టోబర్ 14-15, 2006

5వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు: అక్టోబర్ 14-15, 2006 హ్యూస్టన్, టెక్సాస్.
ఆహ్వానం

మీ అందరి ప్రోత్సాహంతో దిగ్విజయంగా జరిగిన అఖిల అమెరికా తెలుగు సాహితీ సదస్సుల సంప్రదాయాన్ని అనుసరిస్తూ, అంతకంటే ఆసక్తి కరంగా ఐదవ అమెరికా తెలుగు సాహితీ సదస్సు హ్యూస్టన్ మహా నగరంలో అక్టోబర్ 14-15 తేదీలలో జరగబోతోంది. తెలుగు భాషాభిమానులు, పండితులు, సాహిత్య విమర్శకులు, కంప్యూటర్ తెలుగు లిపి మొదలైన సాంకేతిక విషయాలలో నిష్ణాతులైనవారు, అమెరికాలో తెలుగు భాషను పెంపొందించదలుచుకున్న వారందరనీ ఈ ఐదవ అమెరికా తెలుగు సాహితీ సదస్సు లో పాల్గొనమని ఆహ్వానిస్తున్నాం.

సదస్సు ప్రధానాంశం: సాహిత్యంలో హాస్యం

రచయితలకు, వక్తలకు విన్నపం:

ప్రతిష్టాత్మకమైన ఈ ఐదవ అమెరికా తెలుగు సాహితీ సదస్సు లో ప్రసంగించదల్చుకున్నవారు, స్వీయ కవితా విభాగంలో తమ రచనలను వినిపించదల్చుకున్న రచయితలు వంగూరి చిట్టెన్ రాజును సంప్రదించమని కోరుతున్నాము. రచయితలకు సూచనల పేజీని డౌన్‌లోడ్ చేసుకోండి.

{ఇది ఈ మాట తెలుగు వలపత్రిక నుంచి సంగ్రహీతము.}

నాకు వెళ్లాలని చాలా ఆసక్తిగా ఉన్నా, నా చదువు కు సంబంధించిన ముఖాముఖిలు ఉండడం వల్ల కుదరడం లేదు. నా అభ్యర్థన ఏమంటే ఎవరైనా మన తెలుగు బ్లాగర్లు ఈ సమావేశానికి హాజరైతే మన తెలుగు బ్లాగుల గురించి, కూడలి గురించి, లేఖిని గురించి మాట్లాడగోర్తాను. వీలూన్నవారు వంగూరి చిట్టెన్ రాజును గారిని సంప్రదించండి.

No comments: