కొన్ని సున్నితమైన అంశాలపై నా స్పందన!

తెలంగాణా, రిజర్వేషన్లు...చాలా రోజుల నుంచి ఈ అంశాలపై రాద్దామనుకొన్నా పని ఒత్తిడిలో రాయలేకపోయాను. కానీ కూడలి పుణ్యమా అంటూ తెలుగు వారి ఆలోచనలను ఈ బ్లాగుల్లో చూసి నాకు తోచిన విధంగా స్పందించాను. రాయాలని ప్రేరేపించే (స్టిములేటింగ్) వారి బ్లాగులు నా సమాధానాలు మీకోసం.

ముందుగా చదువరి గారి 'స్వపరిపాలన కోసం తెలంగాణ' కు నా ప్రతిస్పందన:

చదువరీ,

మరో మంచి వ్యాసం రాసి అందర్నీ మంచి చదువరులుగా చేస్తున్నారు, కృతజ్ఞతలు!

ఇక తెలంగాణా విషయానికొస్తే ఇదీ రిజర్వేషన్లలా సున్నితమైన అంశం.ఇప్పటికీ నాకో విషయం అర్థంకానిది ఏంటంటే గోదావరీ పరీవాహక ప్రాంతం అయిన ఈ నేల ఇంతవరకు అభివృద్ధి చెందక పోవడం.చరిత్ర తెరిచి చూస్తే నిజాం నిరంకుశత్వ పాలనలో ఈ ప్రాంతం అంతా మగ్గితే అర్థర్ కాటన్ వంటి తెల్లవాల్ల వల్ల ప్రయోజనాలు పొందింది కోస్తా. మరి అంతరాలు ఉండమంటే ఉండవా?

బలవంతుడు బలహీనుల పై సవారీ చేయడమే దీనికంతా కారణం.నేను రాయలసీమవాణ్నయినా మేము గుడ్డిలో మెల్ల ఏదో ఆ సుముహూర్తాన ఆ నిజాం నవాబు దత్తత కీయ బట్టి కాస్తో కూస్తో రాజకీయాలను ఒంటబట్టించుకొన్నాం(?) నేను తెలంగాణా వారి న్యాయసమ్మతమైన కోరికను సమర్థిస్తాను.

రావుగారూ! ఇక యాస విషయానికొస్తే వేప చేదు మీకోమోగానీ మాకు కాదు...ఒక వేళ యాస అన్నది వేప అయినా "తినగ తినగ వేప తియ్యనుండు "అన్నాడుగా ప్రజాకవి!మీకూ అలవాటవుతుంది.

అన్ని భాషలకు ప్రామాణిక భాష అంటూ ఒకటుంటుంది నేను అందులోనే రాస్తున్నాను.కానీ అమ్మపాల లోని కమ్మదనం ఇక ఎక్కడైనా రుచి చూడగలమా? ఏందబ్బా ఎట్టాఉండావు, సల్లగుండు నాయనా , రామనాథరెడ్డి బ్లాగులో పెద్దోడు అన్నట్టు "మీ నాయన మీకొసం శానా అగసాట్లు పణ్ణాడు. మీరు ఎట్ట సూసుకుంటారో ఏమో...నేనొచ్చి సూచ్చా... ఏమన్నా ఏరేగా ఉన్నిందంటే మీ సెయిబట్టుకోని ఇరిశాచ్చా" ఇలా యాస సజీవమైంది దానికీ ఘోరీలు కట్టకండి!

చివరిగా ఈ ప్రశ్న తెలంగాణా అన్న మాట అచ్చతెనుగా లేక ఆంధ్రప్రదేశ్ అన్నదా? - ఇస్మాయిల్

ఇక చరసాల గారి అద్భుతమైన విశ్లేషణాత్మక వ్యాసం ఇక్కడ చదవండి "రిజర్వేషన్ హక్కు - దేశం తుక్కు తుక్కు " దీనికి నా ప్రతిస్పందన ఇలా:

ప్రసాద్ గారూ,

భేష్! నాలో రగులుతున్న భావాలను మీ అక్షరాలలో చూసుకొన్నప్పుడు ఉద్రేకం,ఆవేశం,ఆవేదన ముప్పిరిగొన్నాయి. తరతరాలుగా సాగుతున్న ఈ రిజర్వేషన్ గురించి ఒక్కరూ మాట్లాడరేం? శంభూక వధలు, నాలుక తెగ్గోయటాలు, మాన ప్రాణాలు హరించడాలు తరతరాలుగా జరుగుతున్నా ఎప్పడూ రాలేదే ఇంత కోపం?

కానీ ఎంత కాలం ఇవ్వాలి అన్నవారికి నా సమాధానం ఒక్కటే…ప్రతివాడు సమానంగా పోటీ పడే అవకాశం వచ్చేంతవరకు ఇవ్వాలి.సమాచార విప్లవం వెల్లువెత్తుతున్న ఈ రోజుల్లో రిజర్వేషన్ ల వల్ల లబ్ధి పొందినవారిని గుర్తించడం పెద్దపనేం కాదు.ఇప్పటివరకు ఏ రిజర్వేషనూ ఉపయోగించలేని వారికి ఇవ్వండి అవకాశం.

మీ వివరణాత్మక విశ్లేషణ చాలా బాగుంది.భేషో భేష్!
- ఇస్మాయిల్

2 comments:

spandana said...

ఇస్మాయిల్ గారూ,
మీరు నన్ను అర్థం చేసుకున్నందుకు కృతజ్ఞతలు.
రిజర్వేషన్లు సరిగ్గా అమలు కాకపోతే, సరిగ్గా అమలు చేయని వాళ్ళని నిందించాలి గానీ అసలు రిజర్వేషన్లనే గాదు.
కొందరేమంటారంటే కులాన్ని బట్టి ఎందుకు ఆర్థికతను బట్టి పెట్టొచ్చు గదా అని. సామాజిక వివక్ష కులాన్ని బట్టి వున్నంతవరకూ రిజర్వేషన్లు కులాన్ని బట్టే వుండాలి.
ఇంకొందరు అంటారు..కులాన్ని బట్టి రిజర్వేషను వున్నంతకాలమూ కులాల వివక్ష వుంటుందీ అని. నిజమే ఇది "పెళ్ళి కిదిరితే గానీ పిచ్చి కుదరదు, పిచ్చి కుదిరితే గానీ పెళ్ళి కుదరదు" లాంటిది. కానీ రిజర్వేషన్లు పూర్వం నుండీ వున్నవి కాదు, కుల వివక్ష ముందు నుండీ వున్నది, దానికి విరుగుడుగా వచ్చినవి రిజర్వేషన్లు, కనుక ముందు వచ్చి వివక్షే ముందు పోవాలి.

కానీ "తెలంగాణ" పై మీ వాదనతో నేను విభేదిస్తాను.
కర్ణుడి చావుకి లక్ష కారణాలు వున్నట్లే తెలంగాణా వెనుకబాటు తనానికీ లక్ష కారణాలు వున్నాయి. వెనుకబాటు నుండి ముందు పడటం ముందున్నవాళ్ళున్నప్పుడే జరగాలి. ముందున్నవాళ్ళు లేకపోతే ఇక మనమే ముందున్నట్లు, కానీ ఇది కాదు అభివృద్ది. నేను ఖచ్చితంగా చెప్పగలను వేరు కుంపటి పెట్టుకుంటే వచ్చేది మరో రాజధాణి, ఇంకో ముఖ్యమంత్రి, సచివాలయము. అభివృద్ది జరిగినా తెలంగాణ కావాల్సిందే అంటున్నారు ఇప్పుడు నేతలు. ఆత్మగౌరవము అనేది అందరిలో వున్నప్పుడు సాధించుకోవాలి గానీ, ప్రత్యేకంగా నీ చుట్టూ గిరిగీసుకుంటే వచ్చేది ఆత్మగౌరవమెలా అవుతుంది? ప్రాంతము, కులము, దేశము, మతము అనేవి మనిషిని సులభంగా బోల్తా పడేసే దుర్గుణాలాంటివి.

--ప్రసాద్
http://charasala.com/blog/

Anonymous said...

" rijarvEshanlu vunnatavarakoo kula vivaksha vunTundi " anE daanitO nEnu Ekeebhavistaanu. Dabbu, hOdaa vunna vaaadiki kulavivaksha aDDuraadu. rkshaNamantri gaa vunna jagajeevan raam ku tirupatilO vEdapanDitulu poorNakumbha svaagatamu ichchina eppuDO chinnappuDu choosina phOTOnu nEnu maruvalEdu.
rijarvEshanla dvaaraa intavarakoo enta kulavivaksha tagginchaaru ani choostE ani praSninchukOnDi, appuDu arthamavutundi A nEtibeerakaaya.
eppuDO vunna anTaraanitanamu valla ippuDu ippuDu chaduvu, arhata vunna vaaLLanu, kEvalam agrakulaalu ani vEruchEsi tiraskarinchaDam entavarakoo nyaayam? idO sankuchita manastatvam ani naa abhipraayamu. ee kula tatvaaniki paraakaashaTa miliTareelO , I.I.TillO rijarvEshanunDaalani nirlajjagaa aDukkOvaDam. burra buddhi vunna agrakulaalu ikkaDa vuDakooDadani raajakeeya edavalu chaTTaalu testE , kaneesam kenaDaa, amerikaa laanTi dESaallO kaandiSeekulugaa vaaLLu bratukutaaru. meelaanTi mEdhaavulu AlOchinchaali.

- Sankar