మరో మంచి సినిమా! తెలుగు సినీ ప్రపంచం లోకి కొత్తనీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇది మరో ప్రేమకథ గా కాకుండా తండ్రీకొడుకుల మధ్య ఉండవలసిన అనుబంధాన్ని దర్శకుడు 'భాస్కర్' ప్రతిభావంతంగా తీర్చిదిద్దాడు. ప్రతి తండ్రి తన కొడుకుతో కలిసి చూడాల్సిన చిత్రమిది. నిర్మాత రాజు అభిరుచి కి నా అభినందనలు. ప్రతి పాత్ర సమయోచితంగా ప్రవర్తించింది. ఇక నటీనటుల విషయానికి వస్తే సిద్ధార్థ నటనలో పరిపక్వత కన్పించింది, జెనీలియా చాలా చలాకీగా నటించింది, ప్రకాష్ రాజ్ తన నటనా ప్రతిభ ఏమిటో మళ్ళీ మరోసారి ఋజువు చేశాడు. తప్పక చూడండి!
No comments:
Post a Comment