నీ కళ్ళు...
బీడువారిన ఈ బండ గుండెల పై,
ప్రేమ వర్షం కురిపించే నీలిమేఘచారికలు!
నీ కళ్ళు...
నీ తలపులతో నిత్యం తల్లడిల్లే నా మదిని,
సృశించి, లాలించి, పాలించే మలయమారుతవీచికలు!
నీ కళ్ళు...
మృతమైన ఈ శూన్య మనస్సును,
అమృతధారలతో నింపే నిండు గిన్నెలు!
నీకళ్ళు...
తెల్లటి రాత్రి పై వికసించే...నల్లటి చందమామలు!
- ఇస్మాయిల్ పెనుకొండ.
6 comments:
Baagundadi. Intaki aa photo evaridandi ???
madhubala...anarkali of indian cinema!
కవిత చాలా బాగుంది. నాకు ఎంతో ఇష్టమైన హీరోయిన్.
కవిత చాలా బాగుంది. మధుబాల గురించి వికీపీడియాలో రాయాలి.
చాలా బాగుంది.
కళ్ల గురించి నా బ్లాగులో వ్రాసిన మరో కవితను వీలుంటే చదవండి.
బొల్లోజు బాబా
http://sahitheeyanam.blogspot.com/
రాయలవారే స్వయంగా అల్లితే పద్యం
రాకపోతుందా వారెవా పొంగి పొంగి పెదవి పై-
మధుబాల నయనాల వూగి వూగి
వూయలయిన మనసులో చెక్కిన అక్షరాలయి
ఎన్నాళ్లుగా దాగి వుందో ఈ స్మైలు మాటున
ఈ పద్యాల నిషాంతరంగం
కదను తొక్కే నేడు పదతురంగమయి.
Post a Comment